newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

22-02-202022-02-2020 11:35:12 IST
2020-02-22T06:05:12.935Z22-02-2020 2020-02-22T06:05:10.168Z - - 07-04-2020

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో గత ఐదేళ్లలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు గాను ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల ప్రభుత్వంలో తీసుకున్న ప్రధాన విధానాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు అంశం ఏదైనా సరే ఈ సిట్ నేరుగా విచారించేందుకు జగన్ ప్రభుత్వం అధికారులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామ్‌ రెడ్డి నేతృత్వంలో మొత్తం 10 మంది పోలీసు అధికారులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేయగా ‘సిట్‌’నే ఒక పోలీసు స్టేషన్‌గా పరిగణిస్తారని స్పష్టం చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్ కు ఉండే అన్ని అధికారాలు ఈ టీం సొంతం అనమాట. అంటే ఈ అధికారులు ఎవరి మీదనైనా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారణ చేయవచ్చన్నమాట.

ఇంకా అవసరమైతే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు బృందాలను కూడా సహాయంగా తీసుకోవచ్చు. దీనిపై పొలిటికల్‌ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం రాత్రి జీవో నెంబరు 344 జారీ చేశారు. ఈ బృందం ముందుగా గత ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సమర్పించిన తొలి నివేదికపై దర్యాప్తు మొదలుపెట్టనుంది.

అయితే, సిట్ నియామకంపై ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇది కేవలం రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే ప్రభుత్వం నియమించిన బృందంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పదికి పది మంది పోలీసు అధికారులే కాగా మంత్రులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే దర్యాప్తు చేయడం కేవలం రాజకీయ కోణంగానే కనిపిస్తుందని అంటున్నారు.

గత తొమ్మిది నెలల కాలంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్రంగా జల్లెడ పడుతున్నా ప్రతిపక్షులన్ని ఇరికించే ఆధారాలు లభించకపోవడంతో సిట్ ద్వారా కనీసం తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చనే భావనగా కనిపిస్తుంది. ఈ సిట్ అధికారాలతో ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు కనుక ప్రభుత్వం అనుకున్న వాళ్ళని కనీసం ఒక్కరోజైనా అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

నిజానికి రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులలో మాత్రమే ఈ తరహా విచారణకు ప్రభుత్వం సిద్ధపడాలి. జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి తక్షణమే విచారణ చేయాల్సి వస్తే ఈ తరహా బృందాన్ని ఏర్పాటు చేసి తేల్చాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం 9 నెలలుగా ఒక్క రూపాయి అవినీతిని తేల్చలేకపోయారన్న వాదనను అధిగమించడానికి ఈ సిట్ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుంది.

 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   14 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle