newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

ఏపీలో మరో వివాదం.. ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయం!

16-09-202016-09-2020 12:00:56 IST
Updated On 16-09-2020 12:09:02 ISTUpdated On 16-09-20202020-09-16T06:30:56.996Z16-09-2020 2020-09-16T06:30:53.585Z - 2020-09-16T06:39:02.995Z - 16-09-2020

ఏపీలో మరో వివాదం.. ఇంద్రకీలాద్రిపై వెండి సింహాలు మాయం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన మరువక ముందే ఏపీలో పలు ఆలయాలలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అంతర్వేది ఘటనలో ఇప్పటికీ ఇటు హిందూ ధార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తుండగానే ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేయాలని సిబిఐ అధికారులకు అప్పగించింది. ఆ ఘటన అనంతరం పలు దుర్ఘటనలు జరగుతుండగానే తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వెండి సింహాలు మాయమైనట్లుగా ప్రచారం మొదలైంది.

ఆలయంలో మహామండపం కింద ఉన్న అమ్మవారి రథంలో మూడు వెండి సింహాలు మాయమంటూ ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్కటి మూడు కేజీల బరువు కలిగిన మూడు సింహాలు మాయమవగా మరో సింహం పాక్షికంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. బుధవారం ఉదయం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దుర్గగుడి దర్శనానికి వెళ్లారు. ఆలయంలో ఉన్న అమ్మవారి వెండి రథాన్ని పరిశీలించిన ఆయన మండపం కింద ఉండాల్సిన మూడు సింహాలు మాయమైనట్లు గుర్తించారు.

అలాగే మండపంలోని మరో సింహం పాక్షికంగా దెబ్బతిన్నట్లు అయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఆలయ ఈఓను సోము వీర్రాజు ప్రశ్నించగా.. సింహాలు ఎక్కడికీ పోలేదని, ఆలయ స్టోర్ రూమ్ లోనే ఉండి ఉంటాయని ఈవో తెలిపారు. వెంటనే తమ సిబ్బందిచేత స్టోర్ రూమ్ అంతా వెతికిస్తామని ఏవో వీర్రాజుకు సమాధానం చెప్పారు. అయితే, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పలు అనుమానాలు మొదలయ్యాయి.

ప్రముఖ ఆలయాలలో, అతి సున్నితమైన అంశాలలో ఇంత నిర్లక్ష్యం ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వసం, ఇప్పుడు వెండి సింహాలు మాయమవ్వడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నిజంగానే ఈ సింహాలు స్టోర్ రూంలోనే ఉన్నాయా.. లేక మాయమయ్యాయా అన్నది తేలాల్సి ఉండగా ముందుగా ప్రభుత్వం ఈ వివాదంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

   2 hours ago


ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం...  పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం... పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

   4 hours ago


బీజీపీ ’మహా‘ రాజకీయం!

బీజీపీ ’మహా‘ రాజకీయం!

   6 hours ago


ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

   8 hours ago


సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

   8 hours ago


రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

   9 hours ago


కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

   9 hours ago


జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

   10 hours ago


రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

   10 hours ago


మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle