newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

ఏపీలో మరో రెండు పాజిటివ్ కేసులు.. గుంటూరు, పాణ్యంలో అలర్ట్

10-04-202010-04-2020 11:49:00 IST
Updated On 10-04-2020 12:23:48 ISTUpdated On 10-04-20202020-04-10T06:19:00.759Z10-04-2020 2020-04-10T06:18:34.342Z - 2020-04-10T06:53:48.372Z - 10-04-2020

ఏపీలో మరో రెండు పాజిటివ్ కేసులు.. గుంటూరు, పాణ్యంలో అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 365కి చేరుకుంది. గురువారం రాత్రి 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో రెండు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా బులిటెన్ విడుదల చేసింది వైద్య ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 892 కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. అందులో 17  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. కరోనా నుండి కోలుకుని 10 మంది డిశ్చార్జి అయ్యారు. మరోవైపు గుంటూరులో పక్కాగా లాక్ డౌన్  అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్ పోస్ట్ ను పరిశీలించారు ఏలూరు రేంజ్ డి ఐ జి  కె వి మోహన్ రావు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని అనుమతించటం లేదన్నారు. సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని మోహనరావు తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ పోలీసులకు సహకరించాలని డి ఐ జి కోరారు.గుంటూరు జిల్లాలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సందిగా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు.దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. 

మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు.నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు కార్యాలయాలకు చేరుకోవాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రహదార్లపైకి ఉద్యోగులను అనుమతించేది లేదని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ స్పష్టం చేశారు. కరోనా రెడ్ జోన్స్ లో ఇళ్ల నుండి బయటకు అడుగుపెట్టేందుకు లేదు ఉన్నోళ్ల స్దితి అయిన పేదోళ్లు అయిన అందరిది ఒకటే దుస్థితి. డబ్బులు లేక నిత్యావసరలు కోనే స్తోమత లేక చాల కుటుంబాలు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కర్నూలు జిల్లా పాణ్యంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాణ్యం పట్టణం మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు.

ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు లభించని పరిస్థితుల్లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాలతో గ్రీన్ కో వారి సౌజన్యంతో పట్టణంలోని రెండు వేల కుటుంబాలకు కూరగాయల కిట్లను పంపిణీ చేశారు. కూరగాయల కిట్లను ఎంపీడీవో ఆఫీస్ నందు వాలంటీర్లకు అందజేసి వారి ద్వారా ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా మహమ్మారిని నివారించడానికి ఏకైక మార్గం మన ఇళ్ళ లోనే ఉంటూ లాక్ డౌన్ ను స్వచ్ఛందంగా చేయాలని, పాణ్యం నియోజకవర్గం రెడ్ జోన్ గా ప్రకటించడం వలన నిత్యావసర సరుకులు, కూరగాయలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి  చేరే వేస్తున్నామన్నారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది  లేదని సీఎం ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి నియోజకవర్గం లోని అన్ని గ్రామాల పేద ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని తెలిపారు. ఇంతటి విపత్కర సమయంలో కూడా ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి తమకు అండగా ఉన్నారని నిత్యావసర సరుకులు తీసుకున్న  ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.

 

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle