newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

ఏపీలో మరో దుర్మార్గం.. సాయిబాబా విగ్రహం ధ్వంసం!

17-09-202017-09-2020 07:44:48 IST
2020-09-17T02:14:48.774Z17-09-2020 2020-09-17T02:14:46.281Z - - 01-10-2020

ఏపీలో మరో దుర్మార్గం.. సాయిబాబా విగ్రహం ధ్వంసం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మతపరమైన అంశాలలో వివాదాలు హద్దులు దాటుతున్నాయి. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో రథం ధ్వంసం ఘటన నుండి బుధవారం ఉదయాన్నే చెలరేగిన విజయవాడ దుర్గ గుడిలోని రథంపై ఉన్న వెండి సింహంలు మాయంవరకు వరస వివాదాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. బుధవారం ఇంద్రకీలాద్రి దర్శనానికి వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సింహాల మాయమైన ఘటనను తెరమీదకి తీసుకురాగా ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ఇదిలా ఉండగానే విజయవాడలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని నిడమానూరులో గల సాయిబాబా గుడి వద్ద విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెలుపల ఉంచిన విగ్రహానికి తల, కాలు వేరు చేశారు. నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగగా పటమట పోలీస్ స్టేషన్ లో స్థానికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సీఐ సురేశ్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమైన వ్యక్తులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వరసగా ఆలయాలలో జరుగుతున్న ఈ ఘటనలతో రాష్ట్రంలో ధార్మిక సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా రాజకీయం ఈ ఘటనలు విమర్శా-ప్రతి విమర్శలకు ఆయుధాలుగా మారుతున్నాయి.

 

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

జనవరిలో శశికళ జైలు నుండి విడుదల.. అన్నాడీఎంకేలో పరుగులు!

   3 hours ago


అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

అన్నదాతను వెంటాడుతున్న అవే ఇబ్బందులూ... అవే ఆంక్షలూ!

   5 hours ago


బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

బాబ్రీ బాసీదు కూల్చివేత కేసు.. కోర్టు తీర్పుపై మిశ్రమ స్పందన!

   8 hours ago


కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

కరోనాపై కథలు కాదు... వాస్తవాలు చెప్పాలి..?!

   10 hours ago


ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

ఏపీలో మ‌త మార్పిళ్ల‌పై క‌న్నేసిన కేంద్రం... నిజ‌మేనా?

   11 hours ago


దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

   12 hours ago


దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

   12 hours ago


తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

తెలంగాణలో మళ్ళీ వైరస్ వ్యాప్తి.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు!

   12 hours ago


తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

తెలంగాణలో సామాన్యులకు కరెంట్ బిల్ షాక్.. మధ్యతరగతి ఇక్కట్లు!

   13 hours ago


అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle