newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ఏపీలో మద్యపాన నిషేధం.. వెక్కిరిస్తున్న అమెరికా అనుభవం

29-09-201929-09-2019 16:07:25 IST
2019-09-29T10:37:25.717Z29-09-2019 2019-09-29T10:12:54.877Z - - 05-08-2020

ఏపీలో మద్యపాన నిషేధం.. వెక్కిరిస్తున్న అమెరికా అనుభవం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాము అధికారంలోకి వస్తే దశలవారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తాం.. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరిగి చెప్పిన మాట. ఆ నవరత్నాల మ్యానిఫెస్టోలో కూడా మద్యం ఊసు లేకుండా చేసే బాధ్యత నాదని అచ్చేసుకున్నారు. అఖండ విజయం తర్వాత నిషేధం సంగతి ఏంటంటే దశలవారీగా అని చెప్పాం కదా తొలిదశలో తామే మద్యం దుకాణాలు పెడతాం.. అంతా ప్రభుత్వ అధీనమే.. ఆదాయం ప్రభుత్వానికే అని కొత్త పాలసీని ప్రకటించేసింది. దీని ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టనుంది. 

ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఉన్న విధానానికి నూతన మద్యం విధానానికి తేడా ఏంటంటే మొత్తంగా 800 షాపులను తగ్గించింది...దుకాణాల ప‌క్క‌నే ప‌ర్మిట్ రూమ్ లు ఉండ‌వు.. ఓ గంట సమయం తగ్గించింది. కొత్త పాలసీని తొలి దశ అనుకుంటే మరో రెండు దశలలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయగలరా? ఇప్పటికే ఎక్సైజ్ శాఖామంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రులు సంపూర్ణ నిషేధం చేశాకే మళ్ళీ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతామని ఘంటాపదంగా చెప్తున్నారు. 

మరి సంపూర్ణ నిషేధం చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా నిషేధం పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకుంటారా? అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం సాధ్యమయ్యేపనేనా? నిజానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇదే అసలైన సవాల్. ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధం నుండి అమెరికాలో ఎనిమిది దశాబ్దాల క్రితమే విధించిన నిషేధం వరకు ఎన్నో అనుభవాలు వెక్కిరిస్తున్నాయి. ప్రతిదీ ఓ గుణపాఠంగా ఛాలెంజ్ చేస్తున్నాయి. 

నిషేధం దిశగా అడుగులే విమర్శలతో మొదలైంది. నిషేధం పేరుతో ప్రభుత్వమే నిర్వహించడమే తొలి విమర్శ కాగా కొన్ని ప్రాంతాలలో సున్నిత ప్రదేశాలలో కూడా ఈ దుకాణాలను ఏర్పాటు చేసారని మరో విమర్శ. పాలసీలు చేయడం గొప్పకాదు.. ఆ పాలసీలను అమలు చేయడమే గొప్ప. 

గతంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు మద్యపాన నిషేధం చేస్తానని ప్రకటించి ఏడాదిన్నర పాటు ఆ నిషేధాన్ని అమలు చేశారు. కానీ, క‌ల్తీ మ‌ద్యాన్ని అరిక‌ట్ట‌డం స‌వాలుగా మారింది. ఆ త‌రువాత‌, ప్ర‌భుత్వ‌మే సారాయి దుకాణాలు తెర‌వాల్సి వ‌చ్చింది. దాంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాతి ప‌రిస్థితులు ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇది సాధ్యం కాదని ఒక సున్నితమైన వివరణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి మద్యం అమ్మకాలను ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారు. 

ప్రభుత్వం భరించగలుగుతున్న ఉచిత పథకాలకు ఇప్పుడు అదే అతిపెద్ద ఆదాయ వనరు కాగా బ్యాన్ చేస్తే ప్రభుత్వం ముందుగా ఆర్ధిక ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి. ఇంకో మరో స‌వాలు స‌రిహ‌ద్దు రాష్ట్రాలలో యథేఛ్ఛ అమ్మకాలు. ఆంధ్రా స‌రిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఒడిశాల‌లో మ‌ద్య నిషేధం ఉండదుకనుక పెద్ద ఎత్తున మ‌ద్యం అక్ర‌మ రవాణా అనే వ్యాపారంగా మొదలవుతుంది. గతంలో ఆ వ్యాపారాలు చేసి అక‌స్మాత్తుగా ధ‌న‌వంతులైపోయి, ఆ త‌రువాత రాజ‌కీయ నాయ‌కులు అయిపోయిన‌వారు కళ్ళముందే కనబడుతున్నారు. కాబ‌ట్టి, స‌రిహ‌ద్దు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అతిపెద్ద సమస్య.

అమెరికా లాంటి అగ్రరాజ్యం ఎనిమిది దశాబ్దాల క్రితమే మద్యపాన నిషేధం కోసం ప్రయత్నాలు చేసి అభాసుపాలైంది. అందుకే ప్రపంచంలో మద్యపాన నిషేధం ఎక్కడ అమలవుతున్నా, అక్కడ అమెరికా అనుభవం వెక్కిరిస్తూ ఉంటుంది. అదే సమయంలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో అమలైన మద్యపాన నిషేధం కూడా ఇదే విషయాన్ని వివరిస్తోంది.

మద్యపాన నిషేధం రాజకీయ పలుకుబడి, మద్దతు లేని పేదల మీద ప్రతాపం చూపుతుంది. పోలీసు యంత్రాంగం బలం పెరిగిపోతుంది. పట్టణాల్లో డబ్బు, పలుకుబడి ఉన్నోళ్లకు మద్యం నేరుగా డోర్ డెలివరీ అవుతుంది. ఇలాంటి వైభోగం సాధ్యం కాని పేదలు అక్రమ మార్గాల్లో తాగుడును అలవాటు చేసుకుని కేసుల్లో ఇరుక్కుంటారు. అంతవరకు చట్టాన్ని గౌరవిస్తూ వచ్చిన వాళ్లు, నిషేధ కాలంలో రెండు గుక్కెల కోసం చట్టాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. అమెరికాలో జరిగిందదే. భారత్‌లో ఇప్పుడు నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ జరుగుతోందదే.  

అమెరికా నిషేధం సమయంలో అందరినీ సమానంగా చూడాల్సిన చట్టం.. పేదలకు, శ్వేతజాతీయేతరులకు మాత్రమే శాపంగా మారింది. దాని అమలులో పలుకుబడి, అవినీతి చొరబడింది. దొంగ వ్యాపారం ద్వారా మద్యం ఏరులై పారింది. పేరుకు నిషేధమే కానీ, రాజకీయ నాయకులు, పోలీసులు, ధనవంతులు దర్జాగా 'ప్రైవేటు'గా మందు సేవిస్తూనే ఉండేవారు. 'ప్రైవేటు' వసతి లేని పేదలు చట్టం బారిన, 'కూ క్లక్స్ క్లాన్' బారిన పడ్డారు. నిషేధంతో విసిగి వేసారి, చివరకు రాజకీయ నిర్ణయం తీసుకుని నిజమైన భద్రత కోసం డెమోక్రట్ల పంచన చేరారు.

ఓ పవిత్రాశయంతో తెచ్చిన చట్టం అమెరికా రాజ్యాంగ చరిత్రలో ఒక కామిక్ ట్రాజెడీగా మారి నిషేధం కోసం చేసిన రాజ్యంగ సవరణను (18వ సవరణ)ను మరొక సవరణ (21వ సవరణ) చేసి ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ నిషేధం అమలు జరగాల్సి ఉంది. అంతటి పారదర్శకత ఈ ప్రభుత్వంలో ఉంటుందా? దేశంలోనే ఎవరికి సాధ్యంకాని ఫీట్ సీఎం జగన్ చేసి చూపిస్తారా? లేక తూతూ మాత్రంగా బ్యాన్ పేరుతో మసిపూసి మారేడుకాయ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   42 minutes ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   2 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   3 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle