newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఏపీలో మందు కొట్టక్కర్లేదు...కొంటే చాలు కిక్కు!

01-10-201901-10-2019 13:24:14 IST
2019-10-01T07:54:14.768Z01-10-2019 2019-10-01T07:54:13.064Z - - 20-11-2019

ఏపీలో మందు కొట్టక్కర్లేదు...కొంటే చాలు కిక్కు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కొత్త మద్యం పాలసీని ఈ రోజు నుంచి అమలులోనికి తీసుకు వచ్చింది. మద్య నిషేధం లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ మందు బాబులకు తొలి కిక్కు ధరల రూపంలో ఇచ్చింది. ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సు గడువు పూర్తి కాగానే ఆ లైసెన్సుల రెన్యువల్ జోలికి వెళ్లకుండా నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక గతంలోలా పండుగలు, పర్వదినాలు, మద్యం బంద్ ఉండే రోజులలో కూడా ఇష్టారీతిన మద్యం సేవించేందుకు అవకాశం లేకుండా నిబంధనలను అమలులోనికి తీసుకు వచ్చింది. ఇంట్లో ఫ్రిజ్ ఉంది కదాని బార్ లా మద్యం సీసాల నిల్వ కూడదు. కొత్త విధానంలో ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లో మూడు సీసాల ( మూడు ఫుల్ బాటిల్స్) మద్యాన్ని మించి నిలువ ఉంచుకోవడం నిషేధం

నూతన మద్యం పాలసీ నేటి నుంచి అమలులోనికి వచ్చింది. ఈ విధానం ప్రకారం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించినట్లేనని ప్రభుత్వం భావిస్తున్నది. ఎందుకంటే గతంలోలా పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుని వాటిని ప్రైవేటుగా విక్రయించేందుకు ఇక అవకాశం ఉండదు. ఈ నిబంధనను కచ్చితంగా కఠినంగా అమలు చేస్తే  పల్లెల్లో, ఊళ్లలో పట్టణాలలో ఇంటి పక్క కిరాణా దుకాణాలు, కిళ్లీ కొట్లు మద్యం బెల్ట్ షాపుల్లా మారిపోయిన పరిస్థితి కనిపించదు. ఇంత వరకూ బానే ఉంది కానీ ప్రభుత్వ కొత్త విధానం లో మద్యం ధరలను చూస్తేనే మందు బాబులకు షాక్ తగిలే లా ఉంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై రిటైల్ టాక్స్ విధించింది. అంటే ఒక్కసారిగా ధరలు ఆకాశానికి ఎగసేందుకు ఈ విధానం అవకాశం ఇస్తుంది. మద్య నిషేధం కంటే ముందు మద్య నియంత్రణ ఇలాగే సాధ్యమౌతుందని ప్రభుత్వం భావిస్తున్నదనిపిస్తున్నది. ప్రతి మద్యం బాలిట్ పైనా కనీసం పది రూపాయల టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాక్స్ గరిష్టంగా 250 రూపాయల వరకూ ఉంది. కొత్త విధానం మేరకు ఈ పెరిగిన ధరలు కూడా నేటి నుంచే అమలు లోనికి వచ్చాయి.

ఈ పెంపునకు ఏపీ సర్కార్ అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ అని పేరు పెట్టింది. ధరలను పెంచేయడమే కాకుండా...పాత విధానంతో పోలిస్తే కొత్త విధానంలో మద్యం షాపుల సంఖ్యను కూడా భారీగా తగ్గించేసింది. ధరలలను పెంచేయడం ద్వారా మాత్రమే మద్యం వినియోగాన్ని తగ్గించగలమని...తద్వారా తన లక్ష్యమైన సంపూర్ణ మద్య నిషేధం అమలుకు మార్గం  సుగమమౌతుందని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ధరల పెరుగు దలకు తోడు మద్యం దుకాణాల సంఖ్య రమారమి 20% తగ్గిపోవడంతో అక్రమాలకు తెరలేచే అవకాశాలు ఉంటాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఈ విధానాన్ని కచ్చితంగా అములు చేసి తీరుతామని, అక్రమాలకు పాల్పడే వారికీ, మద్యాన్ని ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించే వారికీ కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నది.

సంపూర్ణ మద్య నిషేధం అమలు సంగతి ఎలా ఉన్నా...ఇప్పుడు కొత్త విధానం అమలు వలన మద్యం బాబులకు ధరల షాకుతో పాటు...మద్యం లభ్యత తక్కువై అనివార్యంగా నియంత్రణ పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ఈ విధానం విజయవంతమై రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దం.  


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle