newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ఏపీలో భారీ మొత్తంలో మ‌రో పెట్టుబ‌డి - 5 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు..!

19-12-201919-12-2019 12:17:06 IST
Updated On 19-12-2019 12:18:02 ISTUpdated On 19-12-20192019-12-19T06:47:06.747Z19-12-2019 2019-12-19T06:47:03.908Z - 2019-12-19T06:48:02.685Z - 19-12-2019

ఏపీలో భారీ మొత్తంలో మ‌రో పెట్టుబ‌డి - 5 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతుంది. రూ.700 కోట్లు పెట్టుబ‌డి పెట్టేందుకు చైనాకు చెందిన ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌న త‌యారీసంస్థ డోవ్ లెవీ టెక్నాలజీ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది. భారీ మొత్తంతో ఏపీలో వాహ‌న త‌యారీ యూనిట్‌ను నెల‌కొల్పుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. 

ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు డోవ్  లెవీ టెక్నాలీ సంస్థ వెల్ల‌డించింది. వ‌చ్చే మూడేళ్ల కాలంలో వంద మిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చించ‌నున్న‌ట్టు సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. డోవ్  లెవీ టెక్నాలజీ ద్వారా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక యూనిట్‌లో త‌యారైన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను ఫిబ్ర‌వ‌రిలో దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌బోతుంది. 

ఈ సంద‌ర్భంగా కంపెనీ డైరెక్ట‌ర్, చీఫ్ ఫైనాన్షియ‌ల్ అధికారి బాలాజి మాట్లాడుతూ ఏపీలో సుమారు రూ.700 కోట్ల‌కుపైగా పెట్టుబ‌డి పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మొత్తం వంద మిలియ‌న్ల డాల‌ర్ల‌లో తొలి విడ‌త 30 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు, మిగ‌తా 70 మిలియ‌న్ల డాల‌ర్ల‌ను ద‌శ‌ల‌వారీగా పెట్టుబ‌డి పెడ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ మొత్తాన్ని వ్యాపారాన్ని విస్త‌రించ‌డానికి వినియోగించ‌నున్న‌ట్టు చెప్పారు. ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఏర్పాటు చేయ‌నున్న ఈ యూనిట్‌తో ప్ర‌త్య‌క్షంగా 2వేల మందికి, ప‌రోక్షంగా 3వేల మందికిపైగా ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయ‌ని బాలాజి ప్ర‌క‌టించారు. 

అంత‌ర్జాతీయ ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీలో 25 ఏళ్ల‌కుపైగా డ‌వ్ సంస్థ‌కు అనుభ‌వం ఉంది. ఈ నేప‌థ్యంలో దేశీయ మార్కెట్‌లో ఉన్న అవ‌కాశాల‌ను అందిపుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్న‌ట్టు కంపెనీ చైర్మ‌న్, సీఈవో తెలిపారు. 

కాగా, డావ్ సంస్థ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఏర్పాటు చేయ‌నున్న స్కూట‌ర్ల‌లో త‌క్కువ వేగం క‌లిగినా వాటి ధ‌ర రూ.50వేలు నుంచి రూ.75వేల లోపు ఉండ‌నుంది. అదే వేగం, ఎక్కువ వేగం క‌లిగిన స్కూట‌ర్లు రూ.75వేలు నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ స్కూట‌ర్ల‌ను ఒక్క‌సారి బ్యాట‌రీ రీచార్జ్ చేస్తే 125 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తాయి. 

 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle