newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త రేట్లు ఇవే!

04-05-202004-05-2020 09:30:17 IST
Updated On 04-05-2020 10:17:45 ISTUpdated On 04-05-20202020-05-04T04:00:17.943Z04-05-2020 2020-05-04T04:00:14.872Z - 2020-05-04T04:47:45.886Z - 04-05-2020

ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు.. కొత్త రేట్లు ఇవే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మద్యం షాపులు తెరవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదాయం పెంచుకునేందుకు మద్యం ధరలు పెంచి మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఏపీలో నూతన మద్యం ధరలు ఇలా వున్నాయి. సాధారణ ధరలకంటే 25 శాతం ఈ కొత్తధరలు ఎక్కువగా వున్నాయంటున్నారు మద్యం ప్రియులు. మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గ్రీన్ జోన్లలో లిక్కర్ షాపులు తెరవచ్చని కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ఏపీలో లిక్కర్‌ షాపులు తెరుచుకోనుండగా.. తెలంగాణలో మాత్రం వైన్‌ షాపుల ఓపెనింగ్‌కు ఎక్సైజ్‌ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

* రూ 120 కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్  బాటిళ్లపై 20 రూపాయలు పెంపు

*హాఫ్ బాటిల్ పై రూ 40, 

*ఫుల్ బాటిల్ పై రూ 80 పెంపు

*రూ 120-150 ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ 40 పెంపు

*హాఫ్ బాటిల్ పై రూ 80, 

*ఫుల్ బాటిల్ పై 120 పెంపు

* రూ 150 కి పైగా ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ 60 పెంపు

* హాఫ్ బాటిల్ పై రూ 120, 

*ఫుల్ బాటిల్ రూ 240 పెంపు

* మినీ బీర్ పై రూ 20 , 

* ఫుల్ బీర్ రూ 30కి పెంచింది ప్రభుత్వం. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు వున్నాయని మందుబాబులు గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం మద్యం ధరలు పెంచి వారి బలహీనతను క్యాష్ చేసుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల కొనుగోలు సమయం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9గంటల వరకు మాత్రమే ఇచ్చింది.  కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు లిక్కర్ కొనుక్కునేందుకు వైన్ షాపులు తెరిచే ఉంటాయి. మద్యం అమ్మకాలకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో మందు బాబులు హుషారుగా ఉన్నారు. 

ఇలా ఉంటే, మా రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు నిషేధమంటూ కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కేరళ స్ఫూర్తిగా ఏపీలో కూడా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మద్య నిషేధం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జగన్ ఈ కరోనా రోజుల్లో అయినా లిక్కర్ సేల్స్ జోలికి పోకుండాఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైన్ షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మాస్క్‌ లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పలు మార్గదర్శకాలు విడుదల చేశారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle