newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఏపీలో బీజేపీ టీడీపీని దాటేసిందా?

07-10-201907-10-2019 22:25:09 IST
2019-10-07T16:55:09.632Z07-10-2019 2019-10-07T16:55:04.681Z - - 15-10-2019

ఏపీలో బీజేపీ టీడీపీని దాటేసిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పట్టు సాధిస్తున్నదా? దక్షిణాదిన బీజేపీ బలం అంతంత మాత్రమే. అందులోనూ ఏపీలో బీజేపీ ఉనికి మాత్రమే ఉన్న పార్టీ...గత కొద్ది కాలం వరకూ అందరి అభిప్రాయం ఇదే. అయితే ఇటీవలి సార్వత్రిక ఎన్నికల తరువాత సీన్ మారింది. ఏపీలో తెలుగుదేశం పరాజయం తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా వంద రోజుల పాలన తరువాత...విపక్ష తెలుగుదేశం కంటే అధికార పక్షంపై, ప్రభుత్వంపై విమర్శల జోరులో బీజేపీయే ముందుంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే ఉద్దేశం వైకాపా సర్కార్ లో ఉన్నట్లు కనిపించకపోవడం, అదే సమయంలో విపక్ష తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున కమలం పార్టీకి వలసలు పెరగడంతో బీజేపీలో జోష్ పెరిగింది. 

కేంద్రంలో అధికారంలో ఉండటం ఒక్కటే కాకుండా బీజేపీ వరుసగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ పార్టీకి జనంలో ప్రజలలో ఏర్పడిన సానుకూలత ఏపీలో కూడా ప్రభావమంతంగా కనిపిస్తున్నది. దీనికి తోడూ మూడున్నద దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఏపీ రాజకీయాలలో ప్రధాన స్రవంతిలో చక్రం తిప్పిన తెలుగుదేశం...రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోనికి వచ్చింది. అయితే ఇటీవలి ఎన్నికలలో ఆ పార్టీ చరిత్రలోనే ఘోరమనదగ్గ పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో విపక్షంగా తెలుగుదేశం ఉన్నప్పటికీ బీజేపీదే విపక్ష పాత్ర అన్నట్లుగా పరిస్థితి తారుమారైంది. తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎంపీలు కమలం గూటికి చేరారు. వీరే కాకుండా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆ వలసలు ఇంకా కొనసాగే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో నిన్న మొన్నటి వరకూ ఏపీలో జనం లేని పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు వలస నేతలు, శ్రేణులతో కిక్కిరిసిపోతున్నది. అందుకు తగ్గట్టుగానే ప్రజా సమస్యలపై పోరాటంలో బీజేపీ ముందుంటున్నది. ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయంటూ వారి కోసం భిక్షాటన కార్యక్రమం చేపట్టడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో బీజేపీది ఉనికి మాత్రమే అనుకునే పరిస్థితి నుంచి విపక్షానికి దీటుగా ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా జనంలోనికి చొచ్చుకుపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే ఈ పరిణామాల కోసం బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించిందనే చెప్పాలి. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని...రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం నుంచీ పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు పకడ్బందీ ప్రణాళికను రచించి సమర్ధంగా అమలు చేసింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడంలోనూ, ఫలితాల అనంతరం అధికారంలో ఉన్న వైకాపాను కట్టడి చేయడంలోనూ బీజేపీ వ్యూహాలు ఒక్కటొక్కటిగా ఫలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇప్పుడు రాష్ట్రంలో అధికార, విపక్షాలలోని అసమ్మతి, అసంతృప్త నేతల చూపులన్నీ బీజేపీవైపే ఉన్నాయని చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు వైకాపా నుంచి వలసలు లేకపోయినా...ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనమౌతున్న సూచనలను బీజేపీ ముందుగానే పసిగట్టింది. అందుకు తగ్గట్టుగానే...అధికార పగ్గాలు చేపట్టిన వైకాపా అడుగులు ఉన్నాయి. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ వైఎస్ జగన్ వినా మరెవరూ క్రియాశీలంగా వ్యవహరించే పరిస్థితి కానీ, స్వేచ్ఛ కానీ ఉన్నట్లు కనిపించడం లేదు.

విపక్షంపై విమర్శలు తప్ప...ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై మాట్లాడేందుకు మంత్రులూ, సీనియర్లూ కూడా ముందుకు రాని పరిస్థితి.  ఈ తరుణంలోనే వైకాపా సర్కార్ ఇసుక విధానం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. విపక్ష తెలుగుదేశం కంటే బలంగా ఇసుక విధానంలోని లోపాలను, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను ప్రజలలోనికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యింది. ఏపీకి చెందిన రామ్ మాధవ్ వంటి వారు కేంద్ర స్థాయిలో కీలకంగా ఉండి ఏపీపై దృష్టి సారించడం కూడా బీజేపీకి కలసి వచ్చిందని చెప్పవచ్చు.

అన్నిటికీ మించి పోలవరం రివర్స్ టెండరింగ్ విధానంపై విపక్ష  తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీయే ఎక్కువగా స్పందించింది. అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టగలిగింది. పోలవరానికి నిధులు సమకూర్చాల్సిన బీజేపీయే...రివర్స్ టెండరింగ్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న విషయాన్ని ప్రజలలోనికి బలంగా తీసుకువెళ్లడంతో ఆ పార్టీ మైలేజ్ పెరిగిందని చెప్పాలి.

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

టీఎన్జీఓలకు కెసిఆర్ తియ్యని మాటలే వరాలా?

   6 hours ago


అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

   11 hours ago


కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

కరెంట్ కోతకి 'కాకే' కారణమన్న మినిస్టర్

   13 hours ago


 కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

కాంట్రాక్టు డ్రైవర్లపై, బస్సులపై దాడులు.. హింస బాటలో ఆర్టీసీ సమ్మె

   14 hours ago


ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఉద్యోగులకు పవన్ బాసట.. కీలక వ్యాఖ్యలు

   14 hours ago


‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

‘మహా’ ప్రచారంలో మోడీ ఓవర్ స్పీడ్!

   14 hours ago


సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

సీఎం జగన్‌తో ‘సైరా’ చిరంజీవి భేటీ.. ఏం చర్చించారంటే..?

   15 hours ago


పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

పొత్తునుంచి వైదొలిగి ఘోరతప్పిదం చేశాం.. చంద్రబాబు అంతర్మథనం..

   16 hours ago


మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

మ‌రో విప్ల‌వాత్మ‌క కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ శ్రీకారం

   16 hours ago


సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle