newssting
BITING NEWS :
* క‌రోనాపై పోరాటం చేసేందుకు మ‌హా సంక‌ల్పం.. ..రాత్రి 9 గంట‌ల‌కు 9 నిమిషాల పాటు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి దీపాలు వెలిగించిన జనం. దేశమంతా దీపకాంతులు *మోడీ పిలుపునకు స్పందించిన భారతావణి *కరోనా కాటుకు లిబియా మాజీ ప్రధానమంత్రి జిబ్రిల్ మృతి *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 252కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు*తెలంగాణలో 272కి చేరిన కరోనా కేసులు *దేశ వ్యాప్తంగా 3831కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా 120 మంది మృతి*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ*జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్. జవాన్లు-ఉగ్రవాదులకు మధ్య కొనసాగుతున్న ఎదురు కాల్పులు. నిన్నటి నుంచి కెరాన్, భత్పూరా సెక్టార్లలో జవాన్ల కూబింగ్. భద్రతా దళాల కాల్పుల్లో 9మంది ఉగ్రవాదులు హతం. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాన్ మృతి. ఇద్దరికి గాయాలు*లాక్ డౌన్ పాటించకుండా ప్రార్ధనలు చేసిన పాస్టర్ అరెస్ట్. తూర్పు గోదావరి జిలా రాయవరంలో ఈ సంఘటన జరిగింది. ప్రార్ధనా మందిరంలో 150 మంది. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించిన స్థానికులు*10వేలదిశగా మొత్తం అమెరికా మృతులు. 4 లక్షల దిశగా మొత్తం కరోనా బాధితులు. వచ్చే రెండు వారాల్లో ఇంకెన్ని చావులు చూడాలో. అంచనాలు ఊహకు కూడా అందడం లేదు. 96శాతం అమెరికన్లను ఇంట్లోనే ఉండమన్నాం - ట్రంప్

ఏపీలో బాబుకు పెరుగుతున్న మద్దతు!- సర్కార్ విదానాల పుణ్యమే!

28-09-201928-09-2019 16:11:33 IST
Updated On 28-09-2019 16:50:12 ISTUpdated On 28-09-20192019-09-28T10:41:33.079Z28-09-2019 2019-09-28T10:41:28.886Z - 2019-09-28T11:20:12.493Z - 28-09-2019

ఏపీలో బాబుకు పెరుగుతున్న మద్దతు!- సర్కార్ విదానాల పుణ్యమే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రభుత్వం తనపై, తమ పార్టీపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నదంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు క్రమంగా ప్రజలలో మద్దతు లభిస్తున్నది.

చంద్రబాబు రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన 9 ఏళ్లు పని చేశారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికతను ఇప్పటికీ  ఆయన ప్రత్యర్థులు సైతం కొనియాడుతుంటారు. చంద్రబాబును రాజకీయ వేత్తగా వ్యతిరేకించే వారు ఉంటారు కానీ ప్రగతి కాముకునిగా, రాష్ట్ర ప్రగతికి కృషి చేసిన నేతగా మాత్రం గుర్తించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. పరాజయం ఎదురైనంత మాత్రాన తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉండగా చేసిన పనులన్నీ అవకతవకలే, అవినీతి మయమే అన్న నిర్ధారణకు రావడం సరికాదు. కానీ ఏపీలో జగన్ సర్కార్ చేస్తున్నది అదే. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అనుసరించిన విధానాలే, తీసుకున్న నిర్ణయాలే అన్న భావనతో వాటన్నిటినీ తిరగదోడడమే పనిగా పెట్టుకోవడం ఏ విధంగా చూసినా సరికాదు.  

ఇప్పుడు పీఏపీల సమీక్ష వద్దకు వస్తే...విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ అవినీతి మయం అంటూ విపక్ష నేతగా రాజకీయ ఆరోపణలు చేసిన జగన్ తీరా అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ అవినీతి నిగ్గు తేల్చడానికి ప్రయత్నినంచాల్సింది పోయి...తాను చెబుతున్నాడు కనుక అది నిజమేనన్న ధోరణిలో వాటి రద్దుకు, సమీక్షకు  నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోర్టులు, కేంద్రం, విద్యుత్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

ఇక రివర్స్ టెండరింగ్ విషయంలో కూడా జగన్ వ్యవహార శైలి ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆదా పేరుతో రివర్స్ టెండరింగ్  అంటూ అన్ని పనులనూ నిలిపివేసి మళ్లీ టెండర్లు పిలవడం వల్ల పనుల జాప్యమే కాకుండా , ఆ జాప్యం కారణంగా పెరిగే వ్యయం ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. వాటన్నిటినీ  పట్టించుకోకుండా జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

అవినీతి  కాంట్రాక్టర్లను ఉపేక్షించమని కాదు. అవినీతి  రుజువైతే...ఆ సొమ్మును అవినీతికి  పాల్పడిన వారి నుంచే ముక్కు పిండి వసూలు చేయవచ్చు. అలా  కాకుండా నిర్దిష్టమైన నిర్ధారణలేమీ లేకుండా...కాంట్రాక్టులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్  అనడం వల్ల సర్కార్ కు చెడ్డ పేరు రావడం తప్ప మరో ప్రయోజనం ఉండదు.

జగన్ సర్కార్ తీరు మాజీ సీఎం చంద్రబాబుపై కక్షసాధింపే విధానంగా  ఉన్నదన్న వాదన రోజు రోజుకూ బలపడుతున్నది. జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా తయారయ్యాయన్న చర్చ రాష్ట్రంలో విస్తృతంగా జరుగుతున్నది. పీఏపీలు, పోలవరం ప్రాజెక్టుల విషయంలోనే కాకుండా ఇసుక విధానంలో కూడా జగన్ అనుసరిస్తున్న తీరు...పేదల పాలిట శాపంగా మారిందన్న వాదనకు బలం చేకూరుతున్నది.

వాస్తవానికి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం అంటే తీసుకుంటున్న చర్యల వల్ల నిర్మాణ రంగం కుదేలు కావడమే కాదు, నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. అసలు ఇసుక విధానం ప్రకటించడంలో జరిగిన తీవ్ర జాప్యం కారణంగా లక్షలాది మంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రత్యామ్నాయాలను ప్రకటించినా ప్రభుత్వం అందుకు కావలసిన ఏర్పాట్లేవీ చేయలేదు. 

గత ప్రభుత్వ హయాంలో ఇసుక పేర కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఒకే ఒక్క ఆరోపణతో లక్షల మంది ఉపాధి కరవై అల్లాడుతున్నా ఖాతరు లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. ఇసుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు నిర్మాణ రంగంపైనా, కార్మికుల ఉపాధిపైనా చూపిన ప్రభావం ప్రభుత్వం తీరు పట్ల నిరసనల సెగకు దారితీసింది. అదే సమయంలో ఇసుక పాలసీ అంటూ ప్రభుత్వం చేస్తున్న ఈ హంగామాపై చంద్రబాబు విమర్శలకు ప్రజల నుంచి స్పందన వచ్చింది.  

నెలలు గడిచి పోతున్నా సర్కార్ తాను చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా ఒక్క ఆధారాన్ని కూడా ప్రజల ముందుకు తేలేకపోవడం కూడా  జగన్ తీరును తప్పుపట్టే వారికి బలం చేకూరుస్తున్నది. మొత్తంగా ఏపీ రాజకీయం అంతా ఇప్పటికీ చంద్రబాబు చుట్టూనే తిరుగుతన్నది. అదే ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి భారీగా వలసలు పెరుగుతున్నా పార్టీ ప్రతిష్ట చెక్కు చెదరకుండా ఉండడానికి దోహదపడుతున్నది. 

దుందుడుకుగా తెలుగుదేశం నిర్ణయాలన్నీ తిరగదొడడమే పనిగా సాగుతున్న జగన్...దీని వల్ల పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, తన పలుకుబడికి కానీ ఎంత వరకూ ప్రయోజనకరంగా ఉంటుందన్నది సమీక్షించుకుంటే బెటరని పరిశీలకులు అంటున్నారు.

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

మ‌లేరియా మందుతో క‌రోనాకు చికిత్స‌

   10 hours ago


వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

వలంటీర్ల ఖాతాలో మరో రికార్డు. 71 శాతం కుటుంబాలకు రూ. 954 కోట్ల పంపిణీ

   15 hours ago


కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

కరోనా సాయం.. ప్రజల సొమ్ముతో వైసీపీ ప్రచారం!

   18 hours ago


కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

కరోనా వార్.. కఠిన చర్యలకు కేసీఆర్ సాబ్ వెనకడుగు?

   18 hours ago


అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

అమెరికాలో ఆగని మృత్యుఘోష... ట్రంప్ ఎమోషనల్ మెసేజ్

   21 hours ago


మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

మనది మహా సంకల్పం..మీ సహకారం అద్భుతం.. జగన్ కు మోడీ థ్యాంక్స్

   a day ago


జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

జగన్ సొంత జిల్లాలో కరోనా వీరవిహారం.... భారీ ఆంక్షలు

   a day ago


కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం.. మతవిద్వేషం కూడదన్న సీఎం జగన్‌

   a day ago


లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

లాక్ డౌన్ పై చర్యలు మీకు సంతృప్తికరంగా వున్నాయా?

   a day ago


అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

అనుమానాలు వ‌ద్దు.. గ్రిడ్లు చెక్కుచెద‌ర‌వట‌

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle