ఏపీలో పేమెంట్స్ నిల్.. బెంబేలెత్తుతున్న యంత్రాంగం!
05-10-201905-10-2019 11:54:33 IST
Updated On 05-10-2019 15:33:36 ISTUpdated On 05-10-20192019-10-05T06:24:33.973Z05-10-2019 2019-10-05T06:23:54.202Z - 2019-10-05T10:03:36.819Z - 05-10-2019

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందన్నది అందరికీ తెలిసిన నిజమే. గత ప్రభుత్వ విధానాలు, దోపిడీ రాష్ట్ర ఖాజానా దివాలాకు కారణంగా ఇప్పటి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. కానీ ఒక విధంగా మంత్రులే ఆర్ధిక పరిస్థితి బాగాలేదన్న విషయాన్ని కూడా అంగీకరించారు. ఉద్యోగుల జీత భత్యాలకు, నెలవారీ సంక్షేమ పథకాలకు కూడా ప్రభుత్వం జమలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. కథనాల సంగతెలా ఉన్నా జీతాలు, పింఛన్లు లాంటివి కొద్దిగా తేదీలు మారినా ఇప్పటికైతే చెల్లింపులు జరిగిపోతున్నాయి. వాతావరణ కారణాలనీ, సమీక్షలని, పాత కాంట్రాక్టర్ల అవినీతని ప్రస్తుతం అమరావతి, పోలవరంతో పాటు భారీ ప్రాజెక్టులు హోల్డ్ లో ఉన్నాయి. ఇవి ఎప్పటికి మొదలవుతాయి.. వాటికి నిధుల పరిస్థితి ఏమిటన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది. కాగా ప్రభుత్వంలో ఉండే ఇంజనీరింగ్ శాఖలు, రోడ్లు-మరమత్తులు వంటివి, ప్రభుత్వ శాఖల నుండి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇచ్చే కొన్ని పనులకు మాత్రం ఈ ప్రభుత్వం పేమెంట్స్ నిల్ అని చేతులెత్తేస్తుందని యంత్రాంగమే బహిరంగంగా మాట్లాడుకుంటుంది. ఈ నాలుగు నెలల కాలంలో వివిధ శాఖల ముందస్తు ఖర్చుల బిల్లుల చెల్లింపుల నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. కొన్నింటిని చెల్లించేది లేదని తేల్చిచెబుతూ పూర్తిగా రద్దు కూడా చేసిందట. ఇప్పటికి జగన్ సర్కార్ అన్ని శాఖల్లో కలిపి ముప్పై వేలకోట్లకు పైగా బిల్లులను రద్దు చేసినట్లుగా తెలుస్తుండగా బెంబేలెత్తిపోతున్న అధికారులు బిల్లులను ఆర్ధికశాఖ వద్దకు పంపడం కూడా మానుకున్నారట. ఈ ఏడాది ఏప్రిల్కు ముందువి చంద్రబాబు హయాంలో చేపట్టిన పనులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు కాగా వీటిని పునఃపరిశీలించాలని సీఎంఓ నుండి రెండు నెలల క్రితమే ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లగా ఆ సమీక్షలు ఎప్పుడో.. చెల్లింపులు ఎప్పుడో అని అధికారులు ఇక ఆర్ధిక శాఖకు పంపడం మానేశారట. ఇక ఏప్రిల్ తర్వాత బిల్లులను అయితే సాకులు చెప్పి వెనక్కు పంపుతున్నారట. ముఖ్యమైనటువంటి వివిధ శాఖలు కూడా కాంట్రాక్టులు పిలవడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి జంకుతుంటే.. కాంట్రాక్టరైతే పనులు చేసిన తర్వాత కార్యాలయాల చుట్టూ తిరగడం.. ఖర్చులు పెరగడం వంటివాటితో ఎందుకొచ్చిన తంటా అని ముందుకురావడం లేదు. ఎంతో ముఖ్యమైన పనులకు తప్పితే మిగతా వాటికి ఆర్థిక శాఖ నుండి బిల్లులు తేవడం శాఖల అధికారులకు కత్తిమీద సామే అవుతుందట. ముందస్తు చెల్లింపులు చేసే పనులకు కాంట్రాక్టర్ల వద్ద నుండి అధికారులు ఒకటి రెండు శాతం లంచాలుగా మింగేస్తారు. ఇది ముందుగానే ఒప్పందంతో జరిగే పనే కాగా ఇది ఆ రంగంలో ఉండే అందరికీ తెలిసిన బహిరంగ నిజం. దీనికి గాను ఆర్ధిక శాఖ నుండి బిల్లులను త్వరగా మంజూరు చేసేందుకు ఆ అధికారులు కాంట్రాక్టర్లకు సహకరిస్తారు. ప్రభుత్వ వైఖరితో అధికారులకు ఆ పెర్సెంటేజ్ లు రావడం లేదు. పర్సెంటేజ్ ల కోసం కాంట్రాక్టులు ఇచ్చినా బిల్లుల కోసం ఒత్తిడిని తట్టులోకేకపోతున్నామని అధికారులు తలలు బాదుకుంటున్నారు. ప్రభుత్వం బిల్లులను నిలిపివేయడానికి కారణం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితేనంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణరంగం లాంటి భారీ రంగాలు కుదేలవడంతో పాటు దేశంలో ఆర్ధిక పరిస్థితికి తోడు కేంద్రం నుండి నిధుల కొరత, అదే సమయంలో, రాష్ట్ర సర్కార్ కొత్త పథకాలను ప్రవేశపెట్టడం వంటి ఎన్నో కారణాలతో ఎప్పటికప్పుడు నిధులను వెతుక్కోవాల్సి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆఖరికి ఉపాధి హామీ పథకానికి కేంద్రం చేసిన చెల్లింపులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవసరాలకు వాడుకున్నట్లుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక్క గత సెప్టెంబర్ నెలలో రూ3600 కోట్లు రాష్ట్ర సొంతపన్నుల ఆదాయం, కేంద్రం నుంచి సాయం అయితే ఆ నెల ఖర్చు ఏకంగా రూ15 వేల కోట్ల వరకు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన సొమ్మును కొంత అప్పు చేసి, మరికొంత వివిధ శాఖల నుండి బదిలీలు చేసి చెల్లించినట్లుగా తెలుస్తుంది. మరి ప్రతి నెలా ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది? సీఎం మరోపక్క తెస్తున్న కొత్త పథకాల మాటేంటి? ఈ పరిస్థితుల నుండి బయటపడే మార్గమేంటి? అన్నది పౌరులుగా మనం చూస్తూ ఉండిపోవడమే!

దిశ నిందితుల పోస్ట్ మార్టం... నివ్వెరపరిచే నిజాలు
8 hours ago

కులాల కుంపటి రాజేస్తున్నారు..!
8 hours ago

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
14 hours ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
17 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
18 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
07-12-2019

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
07-12-2019

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019
ఇంకా