newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఏపీలో పాలన సున్నా... రాజకీయ రచ్చే మిన్న!

09-09-201909-09-2019 18:12:04 IST
Updated On 09-09-2019 18:11:55 ISTUpdated On 09-09-20192019-09-09T12:42:04.360Z09-09-2019 2019-09-09T12:33:48.244Z - 2019-09-09T12:41:55.467Z - 09-09-2019

ఏపీలో పాలన సున్నా... రాజకీయ రచ్చే మిన్న!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవ్యాంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ కొలువుతీరి వంద రోజులు దాటిపోయింది. ఈ వంద రోజులూ కూడా ప్రభుత్వ పాలన కంటే రాజకీయం డామినేట్ చేసింది. ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టిన జగన్ సర్కార్ తొలి రోజు నుంచీ రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగానే నిలుస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల అమలుకు పెద్ద పీట వేస్తున్నట్లుగా బడ్జెట్ కేటాయింపులు చేసినప్పటికీ...పథకాల అమలు కంటే గత ప్రభుత్వం చేపట్టిన పనుల నిలుపుదల, కాంట్రాక్టుల రద్దు వంటి విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది.

వంద రోజుల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైసీపీ ఘనంగా చెప్పుకుంటుంటే...ప్రజా సంక్షేమం గాలి కొదిలేసి గత ప్రభుత్వ తప్పిదాలను వెతకడంతోనే సరిపెట్టేసిందని విపక్ష తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తున్నది. ఇలా ఈ వంద రోజుల కాలమూ విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోయింది. సామాన్యులు కూడా తెలుగుదేశం ప్రభుత్వ విధానాలన్నీ తప్పుడువేనని నిరూపించడానికి తప్ప జగన్ సర్కార్ తానేం చేయాలో అది చేయడానికి ప్రయత్నించడం లేదన్న భావనకు వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొని ఉంది. అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై విపక్షంలోనే కాదు జన బాహుల్యంలో కూడా ఆందోళన వ్యక్తమౌతున్నది. 

ఎన్నికల అనంతరం ఒకటి రెండు రోజులు ఎన్నికల ఉద్రిక్తతలు ఉండటం సహజం కానీ ఏపీలో మాత్రం సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయినా చాలా ప్రాంతాలలో ఎన్నికల ఉద్రిక్తతలు చల్లారలేదు. అధికార, విపక్ష పార్టీ శ్రేణుల మధ్య దాడులు సాగుతూనే ఉన్నాయి. సహజంగానే ఈ దాడులలో అత్యధికంగా బాధితులు విపక్ష తెలుగుదేశం వారే. విపక్షం కూడా వైకాపా దాడులలో గాయపడిన బాధితులతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేసింది. 

వైకాపా కూడా ప్రతి విమర్శ చేసినప్పటికీ పునరావాస కేంద్రాల ఏర్పాటు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టిందనే చెప్పాలి. దీనికి తోడు అధికారం చేపట్టిన తొలినాళ్లలో కరకట్టపై అక్రమ కట్టడాలంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్...ప్రజా వేదికను కూల్చేయడంతోనే చల్లారిపోవడంతో తెలుగుదేశం అధినేతపై అక్కసు మినహా అక్రమ కట్టడాలపై సర్కార్ కు సీరియస్ నెస్ లేదన్న భావన ప్రజలలో ఏర్పడేందుకు అవకాశం, ఆస్కారం ఇచ్చింది.

అలాగే అమరావతిపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం, పోలవరం టెండర్ల రద్దు వంటి వాటితో జగన్ సర్కార్ పై లేశ మాత్రంగానైనా ప్రజలలో ఒకింత అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఏపీలో రాజకీయం గరంగరంగా ఉందనడంలో సందేహం లేదు.  అధికారం చేపట్టిన వంద రోజుల వ్యవధిలోనే వైసీపీపా తీసుకున్న కొన్ని దుందుడుకు నిర్ణయాలు తెలుగుదేశంపై సానుభూతి కలిగేందుకు దోహదపడ్డాయని పరిశీలకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ తప్పిదాల నిగ్గు తేల్చడాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు కానీ....తప్పిదాల పేరుతో మొత్తం  పనులనే నిలిపివేయడం వల్ల ఈ పరిస్థితిని స్వయంగా వైసీపీ సర్కారే కొని తెచ్చుకుందని చెప్పడానికి వెనుకాడాల్సిన పని లేదు. 

ఇసుక విధానాన్ని ప్రకటించడంలో జగన్ సర్కార్ చేసిన జాప్యం అధికార పార్టీకి ఎంతో నష్టం చేసిందని చెప్పక తప్పదు. అలాగే  అమరావతి విషయంలో గందరగోళం ఏర్పడేందుకు మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలు కారణమయ్యాయి. పీఏపీల రద్దు వంటి నిర్ణయాలు ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టాయి. అన్నిటికంటే వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టిన అంశమేమిటంటే తెలుగుదేశం హయాంలో పోలవరం, విద్యుత్ ఒప్పందాల విషయంలో వైసీపీ చెబుతున్నట్లు అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని కేంద్ర మంతులు కుండబద్దలు కొట్టడమే.

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   10 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   21 hours ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle