newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ఏపీలో పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల

14-05-201914-05-2019 11:27:35 IST
Updated On 28-06-2019 12:22:58 ISTUpdated On 28-06-20192019-05-14T05:57:35.144Z14-05-2019 2019-05-14T05:57:30.096Z - 2019-06-28T06:52:58.271Z - 28-06-2019

ఏపీలో పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 17 నుంచి 29 వరకూ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. ఇవాళ ఉదయం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి. తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ ప్రకటించిన మరుసటిరోజే ఏపీలో కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. 

మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.88. ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68. ఏపీ టెన్త్ ఫలితాల్లో 98.19 శాతంతో మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నిలవగా, చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. 

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా,  వీరిలో 99.5శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. అందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక  ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి.

ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్ www.bseap.org, www.rtgs.ap.gov.in లో చూసుకోవచ్చు. అంతేకాదు ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలను మీ ఇంట్లో ఫైబ‌ర్ నెట్ క‌నెక్షన్ ఉంటే... టీవీ తెరపై కూడా ఫలితాలు చూసుకోవచ్చు. టీవీ తెర‌పై విద్యార్థి నెంబ‌రు టైపు చేయ‌గానే.. ఫ‌లితాలు ప్రత్యక్షమ‌య్యేలా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) అధికారులు ఏర్పాట్లు చేశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle