newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో తాజాగా 31 పాజిటివ్‌ కేసులు.. 600 మార్క్ దాటేసిన మొత్తం కేసులు

19-04-202019-04-2020 11:10:12 IST
Updated On 19-04-2020 12:36:55 ISTUpdated On 19-04-20202020-04-19T05:40:12.659Z19-04-2020 2020-04-19T05:40:10.058Z - 2020-04-19T07:06:55.750Z - 19-04-2020

ఏపీలో తాజాగా 31 పాజిటివ్‌ కేసులు.. 600 మార్క్ దాటేసిన మొత్తం కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు, తాజా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలనుంచి శనివారం ఉదయం 10 గంటలవరకు 31 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రత్యేకించి విజయవాడలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కృష్ణా జిల్లాలోనే 18 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం 70 కరోనా పాజిటివ్ కేసులకు గానూ 59 కేసులు విజయవాడలోనే నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 603కు పెరిగింది. 

కాగా శనివారం ఏపీలో 3 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో కోవిడ్19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 17కి పెరిగింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు చనిపోగా, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఒక మహిళ విజయవాడలో చికిత్స పొందుతూ మరణించారు.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన 31 కేసుల్లో తూర్పుగోదావరి-2, కృష్ణా-17, కర్నూలు-6, నెల్లూరు-3, ప్రకాశం 2, పశ్చిమగోదావరి-1 నమోదయినట్లు ప్రభుత్వ బులెటిన్ తెలిపింది. ఇకపోతే జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 129 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఐదు కేసులు కొత్తగా రావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య పెరిగింది. 

కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం ఆ జిల్లాలో మరణాల సంఖ్య 5కి చేరింది. కర్నూలు జిల్లాలో శనివారం ఒకరు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 42 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 545 మంది చికిత్స తీసుకుంటున్నారు.

విజయవాడలో తొమ్మిది నెలల పాపకు కరానా పాజిటివ్‌ వచ్చింది. ఆమెతోపాటు, తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలకు కూడా రావడంతో వారంతా ప్రస్తుతం గన్నవరం సమీపంలోని కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప తండ్రి కారు మెకానిక్‌గా పనిచేస్తూ మాచవరం కార్మికనగర్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి షెడ్‌ మూసేయడంతో ఇంటికే పరిమితమయ్యాడు. 

ఆ ప్రాంతంలో వారం రోజుల కిందట ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఎలా సోకిందో తెలీదు కానీ, తొమ్మిది నెలల చిన్నారితోపాటు, ఆమె తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలకు సోకింది. 

ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతంతోపాటు, విజయవాడ నగరం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  

నూజివీడు లారీ డ్రైవర్‌కు ప్రయాణంలో ఉండగా కరోనా పాజిటివ్ అని తేలడంతో మహారాష్ట్ర నుంచి తిరిగి వస్తున్న అతడిని తెలంగాణ పోలీసులు పట్టుకుని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపినట్లు నూజివీడు పోలీసు శాఖ తెలిపింది. బాధితుడితో సంబంధమున్న 19 మందిని దీంతో హోం క్వారంటైన్ లో ఉంచినట్లు తెలిపారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle