newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు

19-02-202019-02-2020 14:57:02 IST
2020-02-19T09:27:02.322Z19-02-2020 2020-02-19T09:27:00.500Z - - 07-04-2020

ఏపీలో ఠారెత్తిస్తున్న ఏసీబీ దాడులు..అధికారుల్లో వణుకు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రెండోరోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ మున్సిపల్ కార్పొరేషన్లలోని టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో సోదాలు జరుగుతున్నాయి. తొలిరోజు దాడుల్లో భారీగా నగదు, వివిధ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు ప్రకటించారు. తొలిరోజు 13 జిల్లాలలో 14 టీములుగా 100 మందికి పైగా అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో 1,03,813 రూ. లెక్కల్లో లేని నగదు.. , సంబంధం లేని ఇద్దరు ప్రైవెటు వ్యక్తులు , అనధికారిక కట్టడాలపై నిర్లక్ష్యంపూరిత విధానం, పలు అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో రూ. 8,940 లెక్కల్లో లేని నగదు గుర్తించారు.

ఇటు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీలలో రూ15,110 లెక్కల్లో లేని నగదు, టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు  అధికారులు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో అసిస్టెంట్ సిటి ప్లానర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు. అతని వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. 

రూ 13,16,335 విలువైన పెండింగ్ అడ్వర్ టైజింగ్ టాక్స్ వసూలు పట్ల ఏడాదిగా నిర్లక్ష్యం, అనధికార కట్టడాల పట్ల చర్యలు తీసుకోకపోవడం , సిటిజన్ చార్ట్ ను మెయింటెన్ చేయకపోవడం వంటివాటిని గుర్తించారు అధికారులు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో 24 బిల్డింగ్స్ కు బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచినట్టు గుర్తించారు.

ఇటు పశ్చిమగోదావరి జిల్లాలో తనిఖీలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. తాడేపల్లి గూడేం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన తనిఖీలలో సిబ్బంది దగ్గర లెక్కల్లో లేని 5640 రూ. నగదు, నెలవారీ జాబితా సరిగా నిర్వహించకపోవడం, ఇన్ స్పెక్షన్ సరిగా చేయకపోవడం, ఏపీడీఎంఎస్ ద్వారా వచ్చిన 206 దరఖాస్తులలో 4 దరఖాస్తులను 15రోజుల్లోనే పర్మిషన్స్ ఇచ్చినట్టు గుర్తించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల వద్ద 14,690 రూ. లెక్కల్లో లేని నగదు, అనధికారిక కట్టడాలకు పర్మిషన్స్ ఇచ్చినట్టు గుర్తించారు. 

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీలలో అధికారుల వద్ద 7740 రూ.లెక్కల్లో చూపని నగదు, రూ 5000 జీతంతో ప్రైవేటు వ్యక్తి విధుల నిర్వహణ,  2309 బిల్డింగ్ లకు బీపీఎస్ దరఖాస్తులను పెండింగ్ పెట్టినట్టు గుర్తించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీలలో  టౌన్ ప్లానింగ్ లోని 12 మంది సిబ్బంది నుండి 34650 రూ. లెక్కల్లో చూపని నగదు, అనధికార కట్టడాల కూల్చివేతలలో నిర్లక్ష్యం, అనధికారిక కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చినట్టు గుర్తించారు. 

విశాఖలోని ఖరీదైన ప్రాంతంగా పేర్కొనే మధురవాడ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తిని గుర్తించారు అధికారులు. ఇటు గాజువాక మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన తనిఖీలలో అధికారుల వద్ద రూ. 29,900 లెక్కల్లో చూపని నగదు, కంప్యూటర్ ఆపరేటర్లు గా ఉన్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను గుర్తించారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీలలో అధికారులు, సిబ్బంది వద్ద రూ 2 లక్షల 87 వేల 263  లెక్కల్లో లేని నగదు సీజ్ చేశామన్నారు ఏసీబీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు. అధికారులపై శాఖాపరమయిన చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. రెండవ రోజు ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   6 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   11 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   11 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   13 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   16 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   16 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   16 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   17 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   19 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle