newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

ఏపీలో టీడీపీ ఖాళీయేనా?

12-09-201912-09-2019 15:57:18 IST
2019-09-12T10:27:18.247Z12-09-2019 2019-09-12T10:27:16.456Z - - 20-11-2019

ఏపీలో టీడీపీ ఖాళీయేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయింది. ఆవిర్భావం నుంచి సంచలనాలకు వేదికగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఘన విజయాలనూ నమోదు చేసింది. ఘోర పరాజయాలనూ ఎదుర్కొంది. కానీ ఎన్నడూ ఇప్పటిలా క్యాడర్ లో నిస్తేజం నెలకొన్న పరిస్థితి గతంలో లేదు. తెలుగుదేశం ఆవిర్భావమే ఒక సంచలనం అయితే...అద్భుత విజయం సాధించిన ఏడాదిలోనూ నాదెండ్ల ఎపిసోడ్ లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడటం ఒక సంచలనం. 

అయితే అప్పటి గవర్నర్ రామ్ లాల్ చర్యకు విరుద్ధంగా ఆసేతు హిమాచలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ ఏకతాటిపై కదలి రావడం...ఎన్టీఆర్ కు దన్నుగా యావదాంధ్రప్రదేశ్ ప్రజలూ కలసికట్టుగా ఉద్యమ బాట పట్టడం ఎప్పటికీ చెరిగిపోని ఒక రికార్డు. నెల రోజులలే నెల రాజు నాదెండ్ల భాస్కరరావు అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక గద్దె దిగడం, ఆ వెంటనే ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీరాకం చేయడం ఒకెత్తయితే...ఆ వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం మరో ఎత్తు.  తొలి సారిగా వామపక్షాలు, బీజేపీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో సంకీర్ణాలకు, పొత్తులకు శ్రీకారం చుట్టినది కూడా తెలుగుదేశం పార్టీయే. 

అయితే ఆ తరువాతి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. అప్పటి ఓటమి నుంచి మళ్లీ తెలుగుదేశం పార్టీ తేరుకోగలదా? అన్న అనుమానం సర్వత్రా నెలకొంది. కానీ తెలుగుదేశం బలంగా పుంజుకుంది. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే అంతలోనే ఆగస్టు సంక్షోభం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. తెలుగుదేశం నిట్ట నిలువుగా చీలిపోయింది. చంద్రబాబు నాయకత్వంలోని వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో బీజేపీతో పొత్తుతో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఇన్ని సంక్షోభాలలోనూ ఎక్కడా తొణకకుండా పార్టీ నిలదొక్కుకుంది. 

ఆ తరువాత వరుసగా 2004, 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైనప్పటికీ ఈ స్థాయిలో నాయకుల వలస లేదనే చెప్పాలి? కొందరు నాయకులు పార్టీ మారినప్పటికీ, కొందరు ఎంపీలు చేయందుకుని తెలుగుదేశానికి చెయ్యిచ్చినా పార్టీ కేడర్ చెక్కు చెదరకుండా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం క్యాడర్ చెల్లా చెదురయ్యింది. సీనియర్ నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుని పార్టీకి దూరమయ్యారు. ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. 2014లో ఎంతో కొంత పట్టు నిలుపుకున్నప్పటికీ ఆ తరువాత తెలంగాణలో తెలుగుదేశం నామమాత్రంగా మిగిలిపోయింది. 

అయితే ఏపీలో అధికారం దక్కించుకుని బలపడింది. ఇటీవలి ఎన్నికలలో పరాజయం మాత్రం ఆ పార్టీకి గట్టి దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. క్యాడర్, నాయకులు కూడా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి ఉంది. ఏకంగా తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేఎల్పీలో విలీనమైపోయారు. ఏపీలో కూడా తొలి నుంచి పార్టీతో ఉన్న నాయకులు కూడా ఒక్కరొక్కరుగా కమలం గూటికి చేరుతున్నారు. ఏ రోజు ఎవరు పార్టీకి గుడ్ బై చెబుతారో తెలియని పరిస్థితి ఏపీలో నెలకొని ఉంది.

దీంతో కింది స్థాయి కేడర్ లో కూడా మనోబలం సన్నగిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం నాయకత్వం కూడా తన విమర్శలు, పోరాటాన్ని సామాజిక మాధ్యమానికి పరిమితం చేయడంతో క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలపై విపక్షం గళమెత్తుతున్న దాఖలాలు లేవు. లేకుంటే ఇసుక విధానం, పోలవరం రివర్స్ టెండరింగ్, అమరావతిపై అయోమయ ప్రకటనలపై ప్రజామద్దతుతో ఉద్యమాలకు తెలుగుదేశం ముందుకు వచ్చి ఉండేది. ఆ పరిస్థితి కానరాకపోవడమే ఇందుకు నిదర్శనం. మొత్తం మీద ఆవిర్భావం నుంచీ ఎన్నడూ ఎదుర్కొని తీవ్ర సంక్షోభాన్ని ఇప్పుడు తెలుగుదేశం ఎదుర్కొంటున్నది. అపర చాణక్యుడిగా గుర్తింపు పొందిన పార్టీ అధినేత చంద్రబాబు ఎలా అధిగమిస్తారన్నది రానున్న కాలంలో తేలుతుంది.

https://www.photojoiner.net/image/W8zyteHA


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle