ఏపీలో జనసేనదే అధికారం.. మాయావతి జోస్యం
03-04-201903-04-2019 17:21:20 IST
Updated On 09-07-2019 13:26:49 ISTUpdated On 09-07-20192019-04-03T11:51:20.627Z03-04-2019 2019-04-03T11:51:18.728Z - 2019-07-09T07:56:49.092Z - 09-07-2019

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఏపీలో పర్యటించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ జనసేన కూటమి విజయం ఖాయం అన్నారు. రాష్ట్రంలో తమ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, పవన్ కల్యాణ్ సీఎం కానున్నారని ఆమె జోస్యం చెప్పారు. విశాఖలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఏపీ, తెలంగాణలో చాలా కాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తగిన న్యాయం జరగలేదు. ఏపీకిచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడవద్దు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలి. పవన్ వంటి యువ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. పవన్ కల్యాణ్‌తో పాటు బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయి. మా కూటమికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం. ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. మార్పు కోరుకుంటున్నారు. జనసేన కూటమి అసెంబ్లీ, లోక్‌సభ రెండింట్లోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది. పవన్ కల్యాణ్ సీఎం అవుతారు’’ అని మాయావతి అన్నారు. ఏపీలో మారిన రాజకీయ నేపథ్యం కారణంగా తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోలేదన్నారు పవన్. మాయావతిని ప్రధానిగా చూడాలన్నదే తన కల అన్నారు. 2014లో అప్పటి పరిస్థితులను బట్టి బీజేపీ-టీడీపీతో దేపాతో కలిసి ముందుకెళ్లాం. సన్నిహితులు, మేధావులు బీఎస్పీతో కలవాలని కోరారు అన్నారు పవన్. బీఎస్పీ అధినేత్రి మాయవతిపై అభిమానాన్ని చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ పర్యటనకు వచ్చిన మాయావతికి స్వాగతం పలికిన జనసేనాని.. ఆమెకు పాదాభివందనం చేయడం విశేషం.

టీడీపీ కార్యాలయాన్ని.. కూల్చేయాల్సిందేనా!
2 hours ago

ఎంపీ అర్వింద్‌కు పసుపు సెగ..!
3 hours ago

కలెక్టర్‌పై బదిలీవేటు! మంత్రితో తేడాలే కారణమా?
3 hours ago

చేనేత వస్త్ర ప్రదర్శనలో విజయమ్మ, భారతి సందడి
3 hours ago

ఆ బ్రాండ్ల సంగతి నీకెందుకు తల్లీ వదిలేయ్!
4 hours ago

ఖాళీ ఖజానా.. అధికారుల హైరానా!
7 hours ago

జగన్ రివర్స్ పాలనపై చంద్రబాబు రివర్స్ నడక
10 hours ago

ఆర్టీసీ విలీనం సహా.. అసెంబ్లీలో కీలక బిల్లులు
10 hours ago

ఉన్నావ్ దోషులకు శిక్ష పడుతుందా?
10 hours ago

ఉల్లికి తోడు పాల ధరలకు రెక్కలు
11 hours ago
ఇంకా