newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

ఏపీలో కౌలురైతుల పంట పండినట్లేనా..?

20-09-201920-09-2019 14:47:11 IST
Updated On 20-09-2019 15:12:45 ISTUpdated On 20-09-20192019-09-20T09:17:11.409Z20-09-2019 2019-09-20T08:10:04.271Z - 2019-09-20T09:42:45.619Z - 20-09-2019

ఏపీలో కౌలురైతుల పంట పండినట్లేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది ప్రజలకు ముఖ్యంగా ఉద్యోగార్థులకు, రైతులకు ప్రయోజనం కలిగించే ప్రకటనలు చేసింది. లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా అంతకు మించిన మరో పథకం విధివిధానాలను కూడా ఏపీ ప్రభుత్వం గురువారమే ప్రకటించింది. రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలోనే  ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని చెబుతూ విధివిధానాలను ప్రకటించారు. దేశచరిత్రలో ఎక్కడా లేనివిధంగా పెద్దరైతులు, సన్నకారు రైతులతోపాటు భూమిలేని కౌలు రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రూ. 12,500ల మేరకు నగదు బదిలీని నేరుగా రైతుల ఖాతాలకే పంపించనుంది.

రైతుభరోసా పథకంలో భాగంగా ఏపీలోని రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ స్కీంలో భాగంగా ఇవ్వనున్న రూ.6,000లకు అదనంగా ఏపీ ప్రభుత్వం రూ.6,500 జత చేసి ఇస్తుంది. అంటే ఈ పథకంలో సగం నిధులు కేంద్రం నుంచి వచ్చినవి. ప్రధానమంత్రి కిసాన్ స్కీం కింద చిన్న, సన్నకారు రైతులకు మోడీ ప్రభుత్వం నుంచి రూ.6,000 అందించనున్నారు. వాటికి రూ.6,500 జత చేసి జగన్ ప్రభుత్వం మొత్తం మీద రూ.12,500లను ఇవ్వనుంది. విశేషం ఏమిటంటే కౌలు, పెద్ద రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ.12,500 ఇవ్వనుంది. 

అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చొప్పున అందిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ స్కీంలోను రూ.6,000లకు ప్రభుత్వం రూ.6,500 జత చేసి ఇస్తుంది. అంటే ఈ పథకంలో సగం నిధులు కేంద్రం నుంచి వచ్చినవి. 

కేంద్రం రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500 పీఎం కిసాన్ స్కీం కింద చిన్న, సన్నకారు రైతులకు మోడీ ప్రభుత్వం నుంచి రూ.6,000 వస్తాయి. వాటికి రూ.6,500 జత చేసి జగన్ ప్రభుత్వం రూ.12,500 ఇవ్వనుంది. ఇక కౌలు, పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ.12,500 ఇవ్వనుంది. కౌలు రైతులు కూడా అర్హులే... వాలంటీర్లు గుర్తిస్తారు.. 

ఒకవైపున తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సాధ్యం కాదని చేతులెత్తేసిన చోట వైఎస్ జగన్ ప్రభుత్వం సాహసోపేత చర్యకు సిద్ధమయింది. నాలుగు దశాబ్దాలుగా భూమి లేని కౌలు రైతులకు దేశంలోని ఏ రాష్ట్రమూ ఎలాంటి పథకాన్నీ, సహాయాన్ని అందించలేని చరిత్రకు మంగళం పాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన కౌలు రైతులకు కూడా రూ.12,500ల నగదు బదిలీని ఏపీ ప్రభుత్వం అందించనుంది. 

పట్టాభూములు లేని, భూ యాజమాన్యంపై ఎలాంటి ఆధారాలు లేని కౌలు రైతుల ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా సేకరించి నిర్దిష్ట క్రమంలో వాటిని నమోదు చేసి ఎంపిక చేసినాక సేకరిస్తారు. లబ్ధిదారుల జాబితాను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి తదనంతరం అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారు. ఈ జాబితాను మండలస్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఏడీఏలు పరిశీలించాక జిల్లా కలెక్టర్ అధ్యక్షతను జరిగే సమావేశంలో తుదిజాబితాను ఖరారు చేసి సెప్టెంబర్ 25న అధికారికంగా ప్రకటించనున్నారు.

రైతు భరోసా పథకం 70 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనకరం కాగా, దేశ చరిత్రలో మొదటిసారిగా భూమి లేని కౌలుదార్లకు కూడా ఈ పథకాన్ని భారీస్థాయిలో ఏపీ ప్రభుత్వం అమలు చేయనుండటం గమనార్హం. 

Image result for AP formers are beneficiaries for Rythu Bharosa Scheme


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle