newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

13-07-202013-07-2020 08:37:49 IST
Updated On 13-07-2020 09:30:49 ISTUpdated On 13-07-20202020-07-13T03:07:49.140Z13-07-2020 2020-07-13T03:06:07.450Z - 2020-07-13T04:00:49.494Z - 13-07-2020

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా పరీక్షలు పెరుగుతుండడంతో కేసుల తీవ్రత కూడా ఎక్కువ గానే వుంది. ఏపీలో ఆదివారం నాటికి 17,624 మందికి పరీక్షలు నిర్వహించగా 1,933 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 29,168కి చేరాయి. వాటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి సంబంధించిన కేసులు 2,403 ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారివి 429 ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 328 మంది మృతిచెందారు. యాక్టివ్‌ కేసులు 13,428 ఉన్నాయి. 

ఏపీలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విజయవాడల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం రెడ్ జోన్ మండలాల్ని ప్రకటించింది. మొత్తం 97 మండలాల్ని రెడ్ జోన్‌ కింద వెల్లడించింది. 

రెడ్ జోన్ మండలాలివే:

విశాఖపట్నం (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ).

తూర్పుగోదావరి (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ

పశ్చిమగోదావరి (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)

కృష్ణా (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)

గుంటూరు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)

కర్నూలు (17) : కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)ప్రకాశం (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

నెల్లూరు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు (పట్టణ), కావలి (పట్టణ), కోవూరు, ఓజిలి, తోటపల్లిగూడూరు

చిత్తూరు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

కడప (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

అనంతపురం (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

ఈనెల 20 నుంచి కేంద్రం జారీచేసిన కోవిడ్ 19 మార్గదర్శకాల్ని జిల్లాల్లో అమలుచేయాలని ఏపీ ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. రెడ్‌జోన్లలో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు నమోదు కాకుంటే ఆ మండలాన్ని ఆరెంజ్‌ జోన్‌ కిందకు మార్చుతుంది. ఆ తర్వాత మరో 14 రోజులపాటు పాజిటివ్‌ కేసు ఒక్కటీ రాకపోతే అప్పుడు గ్రీన్‌జోన్‌ పరిధిలోకి మండలం చేరుతుంది. గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించడం తాజా పరిణామం. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle