newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఏపీలో కరోనా కేసులు పెరగడంపై ఆందోళన

26-04-202026-04-2020 09:31:52 IST
Updated On 26-04-2020 10:17:19 ISTUpdated On 26-04-20202020-04-26T04:01:52.057Z26-04-2020 2020-04-26T04:01:36.336Z - 2020-04-26T04:47:19.896Z - 26-04-2020

ఏపీలో కరోనా కేసులు పెరగడంపై ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నడూ లేనివిధంగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళనకరంగా మారాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పరిస్థితులపై కలవరం చెందుతోంది ప్రభుత్వం. 24గంటల్లో 61 కేసులు పెరగడం పై అప్రమత్తత అయ్యారు అధికారులు. రాష్ట్రంలో 1061కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. 6928 నమూనాలు పరీక్షిస్తే 61 మందికి పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లాలో ఒక్కరోజులోనే 25 కేసులు పెరిగిపోయాయి. లారీ డ్రైవర్ కారణంగానే కేసులు పెరిగిపోయాయి. 

కర్నూల్ లో 14 కేసులు నమోదయ్యాయి. మొదటి సారిగా శ్రీకాకుళం లో మూడు పాజిటివ్ కేసుల నమోదుపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో  శ్రీకాకుళానికి ప్రత్యేకాధికారిని నియమించింది ప్రభుత్వం. రాష్ట్రంలో 31కి చేరింది మృతుల సంఖ్య. 171 మంది వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకూ కర్నూల్ 275, గుంటూరు209 ,కృష్ణా127, చిత్తూరు73, నెల్లూరు72, కడప55, ప్రకాశం53, అనంతపురం51, ప. గో.39, తూ. గో.37, విశాఖ22, శ్రీకాకుళం3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సగటున పాజిటివ్‌ కేసుల శాతం 4.23 శాతం ఉండగా రాష్ట్రంలో ఇది కేవలం 1.66 శాతం మాత్రమేనని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్‌ కేసుల శాతం తక్కువగా ఉందన్నారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో విజయవాడలో నాన్ వెజ్ అమ్మకాలు నిషేధించింది ప్రభుత్వం. కరోనా పెరిగిపోతున్న తరుణంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేసింది. ఒక్క విజయవాడలోనే 120కి పైగా కేసులు నమోదుతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను మూసేవేసింది. నాన్ వెజ్ షాపుల్లో సామాజిక దూరం కనిపించకపోవడంతో ఆదివారం రోజున విజయవాడలో షాపులు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. 

రాష్ట్రంలో 11 జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు లు నమోదవుతున్నప్పటికీ, వెనుకబడిన జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం లల్లో పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతి నిధులు సంతోషించారు. వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ ఈ జిల్లాలలో కరోనా కేసులు లేకపోవడంతో కేంద్ర పభుత్వం కూడా ఈ రెండు జిల్లాలను గ్రీన్‌జోన్‌లో ఉన్నట్లుగా ప్రకటించింది. అధికారులు ఇంతవరకూ చేసిన కృషికి అందరూ ప్రశంసించారు. అయితే ఒక్కసారిగా పాతపట్నం మండలంలో ఒకే కుటుంబం లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన పరీక్షలలో తేలడంతో జిల్లా ఉలిక్కిపడింది. అధికారులు నిశ్చేష్ఠుల య్యారు. జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు కలవరపడుతున్నారు. పాతపట్నం మండలంలోని కాగువాడకు చెందిన శంకరరావు అనే వ్యక్తి ఢిల్లి మెట్రో రైల్వేలో పనిచేస్తున్నాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌ విధించిన తరువాత గత నెల 19న గూడ్స్‌బండిలో ఆయన జిల్లాకు చేరుకుని, అక్కడ నుండి కాలినడకన తన గ్రామానికి చేరుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు మండల అధికారులకు చెప్పగా, అతనికి వైద్య పరీక్షలు చేశారు. 

అతనికి కరోనా నెగిటివ్‌ రావడంతో గృహనిర్బంధంలో 14 రోజులు ఉంచారు. ఆ తరువాత మళ్ళీ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ మరో 14 గృహ నిర్బంధంలో ఉండమని అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. ద్విచక్ర వాహనంపై పాతపట్నం మండలంలో తన బంధువులు, తన స్నేహితులు అందరినీ కలుసుకున్నాడు. అత్తవారింటిలో కూడా అతను ఉన్నాడు. అయితే 28 రోజులు దాటిన తరువాత అతనికి జ్వరం, దగ్గు వంటివి రావడంతో అందుకు అతను ఆర్‌ఎంపీ వైద్యుడి సలహాతో ఒకటి రెండు రోజులు యాంటీబయాటిక్‌ , పారాసెట్మాల్‌ వంటి మాత్రలు వేశాడు. రెండవ రోజుకైనా తగ్గకపోవడంతో అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని స్థానికులు చెప్పడం, ఈ సమాచారం వాలంటీర్లు అందరికీ తెలిసి స్థానిక వైద్యులకు, పోలీసులకు తెలిపారు.

అతనిని బలవంతంగా శ్రీకాకుళంలో కోవిడ్‌ ఆసుపత్రి జెమ్స్‌ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరీక్షలలో కూడా లో లెవెల్‌లో కరోనా ఉన్నట్లు తేలడంతో అనుమానం వచ్చిన వైద్యులు ఆయన రక్త నమూనాలు, స్వాబ్‌ కాకినాడ పంపించారు. అయితే అతని అత్త, మామ, మరదలికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లుగా స్థానికులు తెలుసుకుని, ఆ విషయాన్ని అధికారులకు చెప్పడంతో శుక్రవారం అతని కుటుంబ సభ్యులతో పాటు పరిసర గ్రామాలలో ఆయన ఎవరెవరిని కలుసుకున్నదీ వివరాలు తెలుసుకుని, దాదాపు 51 మందిని జెమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రికి, రిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు జరిపారు. వారిస్వాబ్‌ కూడా కాకినాడ పంపించగా కరోనా వున్నట్టు తేలింది. దీంతో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు లేవని ఊపిరి పీల్చుకున్న జిల్లా వాసులు,అధికారులు టెన్షన్ పడుతున్నారు.       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle