newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ ల పోస్టింగుల మతలబేంటి?

08-10-201908-10-2019 16:49:18 IST
2019-10-08T11:19:18.897Z08-10-2019 2019-10-08T11:19:16.225Z - - 14-10-2019

ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ ల పోస్టింగుల మతలబేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులలలో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ల పోస్టింగ్ విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఆరడజనుకు పైగా ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగులు లేవు. ఉన్నవారికి కాదని వేరే రాష్ట్రాల నుంచి అధికారుల కోసం ప్రయత్నాలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. పోస్టింగులు ఉన్న అధికారులకు కూడా వారి బాధ్యత ఏమిటి? పని ఏమిటి? అన్న విషయంలో అయోమయం కొనసాగుతున్నది.

ఐఏఎస్, ఐపీఎస్ లకు సంఘాలున్నాయి. ప్రభుత్వ తీరు పట్ల ఆ సంఘాలు కనీసం మౌఖిక నిరసనను కూడా వ్యక్తం చేయకుండా ఆశ్చర్యకరమైన మౌనాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఆఖరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నిమిత్త మాత్రుడిగా మిగిలిపోతున్న పరిస్థితి కానవస్తున్నది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సరిగ్గా ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ జోక్యంతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యంపై అప్పటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఆందోళన బాట పట్టడానికి కూడా సిద్ధమయ్యాయి. మరి ఇప్పుడు అదే సీఎస్ జారీ చేయాల్సిన ఉత్తర్వులు కూడా మరో ఐఏఎస్ అధికారి జారీ చేసే పరిస్థితి ఉంటే ఆ సంఘాలు మాట్లాడటంలేదు.

ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ అధికారులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తిస్తుంటారు. అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. అయితే కేటాయించిన క్యాడర్ ప్రకారం అధికారులకు ఆయా రాష్ట్రాలలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పరస్పర అంగీకారం(మ్యూచువల్ కన్సెంట్), కేంద్రం అనుమతి మేరకు వేరే రాష్ట్రాలకు డిప్యూటేషన్ పై వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఏపీలో పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను విస్మరించి వేరే రాష్ట్రాల అధికారులను తెచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు గురౌతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పరాజయం పాలై వైకాపా అధికారంలోనికి వచ్చిన తరువాత భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదలీలు జరిగాయి. ఇది సహజమే. ఏ పార్టీ అయినా సరే అధికారంలోనికి వచ్చిన తరువాత తమకు అనుకూలం అనుకున్న అధికారులను కీలక స్థానాలలో నియమిస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వమూ అదే చేసింది. అయితే కీలక స్థానాల నుంచి బదలీ చేసిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా నెలల తరబడి గడిపేయడం మాత్రం తొలి సారిగా వైకాపా ఆధ్వర్యంలోనే జరుగుతోంది.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎంవోలో పని చేసిన ముగ్గురు సీనియర్ అధికారులకు ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికారులు ఆ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. అలాగే చేస్తారు కూడా. అధికారులపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నిబంధనలకు లోబడే అధికారులు పని చేస్తారు. చేయాలి కూడా. అందుకు భిన్నంగా నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తేనా పని చేసిన అధికారులు ఆ తరువాత చిక్కుల్లో పడక తప్పదు. 

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో అలా చిక్కులలో పడిన పలువురు అధికారులు ఉన్నారు. ఇప్పటి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వారిలో ఒకరు. అలాగే ఇప్పుడు ఏపీలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి...ఇలా పలువురు ఈ జాబితాలో ఉన్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారుల పోస్టింగులతో బంతాట ఆడుకోవడం సరైనదికాదు. ఉన్నవారికి పోస్టింగులు ఇవ్వకుండా, పొరుగు రాష్ట్రం నుంచో, ఇతర రాష్ట్రాల నుంచో అధికారులను తెచ్చుకోవడం అన్నది సత్సంప్రదాయం ఎంత మాత్రం కాదు. ఇప్పటికైనా జగన్ సర్కార్ ఐఏఎస్, ఐపీఎస్ పోస్టింగుల విషయంలో ఒక సారి సమీక్షించుకుంటే మంచిది.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   39 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   2 hours ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   3 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   20 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle