newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

ఏపీలో ఆగని కరోనా పరుగు... మళ్ళీ 10వేల 167 కేసులు

30-07-202030-07-2020 18:53:07 IST
Updated On 30-07-2020 19:09:58 ISTUpdated On 30-07-20202020-07-30T13:23:07.018Z30-07-2020 2020-07-30T13:22:57.282Z - 2020-07-30T13:39:58.911Z - 30-07-2020

ఏపీలో ఆగని కరోనా పరుగు... మళ్ళీ 10వేల 167 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీరు దారుణంగా మారుతోంది. ఏపీలో వరుసగా రోజువారి కేసులు ఒకేరీతిన బయటపడుతున్నాయి. తాజాగా మరోసారి 10వేల మార్కుని దాటేశాయి. . గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 70,068 మందికి పరీక్షలు నిర్వహించగా 10,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30, 557కు చేరింది. గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరింది. గత 24 గంటల్లో 4,618మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 600024కు చేరింది. మరో 69252మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.వారంరోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మరణాలు కూడా రికార్డుస్థాయికి చేరాయి. 

దేశంలో నాలుగవస్థానంలో వున్న ఏపీ కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుని మించిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే త్వరలో రెండులక్షల మార్కుకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ‌లో 60 వేలు దాటిపోయాయి కరోనా పాజిటివ్ కేసులు, 500ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌, గ‌త 24 గంట‌ల్లో 1,811 కొత్త కేసులు వచ్చాయి. మ‌రో 13 మంది... 60,717కు చేరిన పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 505 మంది మృతి మరణించారు. తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరగడం వల్లే కేసుల తీరు తక్కువగా వుంది.

ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1441 కేసులు, కర్నూలు జిల్లాలో 1252, విశాఖపట్నం జిల్లాలో 1223, పశ్చిమగోదావరి జిల్లాలో 998, అనంతపురం జిల్లాలో 954, గుంటూరు జిల్లా 946, కడప జిల్లాలో 753, నెల్లూరు జిల్లాలో 702, శ్రీకాకుళం జిల్లాలో 586, చిత్తూరు జిల్లాలో 509, ప్రకాశం జిల్లాలో 318, కృష్ణా జిల్లాలో 271, విజయనగరం జిల్లా 214 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19180 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 15723కు చేరాయి. గుంటూరు జిల్లాలో 13762 కేసులు ఉన్నాయి.

 

 

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   21 minutes ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   32 minutes ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   an hour ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   2 hours ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   15 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   15 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   18 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   20 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle