newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఏపీలో ఆగని కరోనా కేసుల హోరు... మరో 813 కేసులు

29-06-202029-06-2020 08:15:44 IST
Updated On 29-06-2020 11:39:13 ISTUpdated On 29-06-20202020-06-29T02:45:44.551Z29-06-2020 2020-06-29T02:45:26.167Z - 2020-06-29T06:09:13.386Z - 29-06-2020

ఏపీలో ఆగని కరోనా కేసుల హోరు... మరో 813 కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్ని కట్టుదిట్టమయిన చర్యలు చేపట్టినా కరోనా కేసుల తీవ్రత ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 25,778 మంది శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 813 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే మొత్తం కేసుల్లో 755 మంది లోక‌ల్స్ కాగా.. విదేశాల నుంచి వ‌చ్చిన వారు 8 మంది, ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారు 50 మంది ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 13,098కి చేరింది. అయితే క‌రోనా కార‌ణంగా గడిచిన 24 గంటల్లో 12 మంది మ‌ర‌ణించారు. కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక‌రు మృతి చెందారు. 

మరోవైపు కరోనా పరీక్షలు చేయడంలో ఏపీ ప్రభుత్వం 8 లక్షల మార్కును అధిగమించింది.రాష్ట్రంలో ఇప్పటి వరకు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 169కి పెరిగింది. క‌రోనా నుంచి కోలుకుని ఇప్ప‌టి వ‌ర‌కు 5908 డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం వేర్వేరు‌ ఆసుపత్రుల్లో 7,021 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు తెలంగాణనుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళే వారి విషయంలో పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు.

తెలంగాణ-ఏపీ సరిహద్దులోని వాడపల్లి మీదుగా ఏపీకి వెళ్లాలనుకునే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోగా వెళ్లిపోవాలని, ఆ తర్వాత అనుమతి ఉండదని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచించారు. ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అన్ని వాహనాలను సాయంత్రం 7 గంటల తర్వాత సరిహద్దుల్లో ఆపేస్తామని గుంటూరు ఎస్పీ చెప్పారన్నారు.

సమయం దాటాక వెళ్లి అనవసరంగా ఇబ్బందులు పడొద్దని ప్రయాణికులకు సూచించారు. నాగార్జునసాగర్–మాచర్ల రోడ్డును ఏపీ సర్కార్ ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించలేదని, కాబట్టి ఆ బాటలో ఎలాంటి ప్రజారవాణనుగానీ, వాహనాలనుగానీ ఏపీ పోలీసులు అనుమతించట్లేదని చెప్పారు. సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా అందరూ తప్పనిసరిగా పాసులు తీసుకోవాలన్నారు. పాసులు లేనివారిని పోలీసులు ఖచ్చితంగా ఆపేస్తారని ఆయన చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle