newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

’ఏపీలో అవినీతి రూ.3 లక్షల కోట్లు‘

04-12-201804-12-2018 17:14:49 IST
Updated On 04-12-2018 17:20:04 ISTUpdated On 04-12-20182018-12-04T11:44:49.625Z04-12-2018 2018-12-04T11:44:47.432Z - 2018-12-04T11:50:04.439Z - 04-12-2018

’ఏపీలో అవినీతి రూ.3 లక్షల కోట్లు‘
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు హయాంలో ఏపీ పాలన అవినీతిమయం అయిపోయిందంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో ఒకటి కాదు రెండు ఏకంగా మూడులక్షల కోట్ల అవినీతి జరిగిందని అజయ్ కల్లం బాంబు పేల్చారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో  కర్నూలులో జనచైతన్య వేదిక నిర్వహించిన సదస్సులో  అజయ్ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. ఏపీని వారసత్వ రాజకీయాలు, అవినీతి, కుటుంబపాలనను నుంచి విముక్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరోక్షంగా మంత్రి లోకేష్‌పై విమర్శలు చేశారు. ప్రభుత్వం గ్రామస్వరాజ్యాన్ని తుంగలో తొక్కి.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీలో 600మంది ఒక్కొక్కరు 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచుకున్నారని.. మొత్తం 3లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. విదేశీ పర్యటనలు, ఈవెంట్స్, ధర్మపోరాట దీక్షల పేరుతో కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. 

ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఖర్చుచేసిన 50 వేల కోట్లలో 20 వేల కోట్లు అవినీతి జరిగిందన్నారు అజేయకల్లం. నంద్యాల ఎన్నికల్లో 200 కోట్లు ఖర్చుచేశారని, ప్రజాధనాన్ని తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగిస్తున్నారన్నారు అజేయ కల్లం. ఏపీలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస ధర లభించడం లేదన్నారు. ఏపీ విభజన వల్ల తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు ప్రయోజనం కలిగిందని, రాయలసీమను నిర్లక్ష్యం చేశారన్నారు. ఇసుక, మట్టి, ఫైబర్‌ గ్రిడ్, నీరు–చెట్టు, నీటి కుంటలు, రెయిన్‌ గన్‌లు... ఇలా ప్రతీ దాంట్లోనూ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలన్నారు అజేయకల్లం, 

ఇదిలా ఉంటే..అజేయ కల్లం ఆరోపణలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శిగా.. ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కల్లం ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు.  అంత అవినీతి జరుగుతున్నప్పుడు ఉన్నతాధికారిగా ఎందుకు ఆపలేదని మంత్రి ప్రశ్నించారు. పదవుల్లో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడిని, ప్రభుత్వాన్ని పొగడడం.. రిటైరయ్యాక తిట్టడం.. ఒక ఫ్యాషనైపోయిందని మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన చేతుల మీదుగా నడిచిన ఫైళ్లలో అవినీతి జరిగిందంటున్న అజయ్ కల్లం....దాన్ని అడ్డుకోకుండా ఎందుకు ఊరుకున్నారన్నారు. లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే బాధ్యతగల ఉన్నతాధికారిగా ఏం చేశారని, నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. మరో టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య అజేయకల్లం ఆరోపణలను ఖండించారు. అవినీతి చక్రవర్తి, ప్రతిపక్ష నేత జగన్‌కు.. అజయ్ కల్లం సెక్యూరిటీగార్డు మాదిరిగా పనిచేస్తూ రక్షించే పనిలో తీరిక లేకుండా ఉన్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. 

రాజకీయ నేతలు అవినీతి ఆరోపణలు చెయ్యడం సాధారణ విషయమే. వీటిని ప్రజలు కూడా అంతగా పట్టించుకోరు. ఏపీలో అవినీతిపై మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు కలిగిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక స్థాయిలో పనిచేసిన అధికారులు ఆరోపణలు చేస్తే మాత్రం, వాటికి ఆధారాలు ఉండే అవకాశాలు ఎక్కువ. అందుకే వాటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఏపీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరైన అజయ్ కల్లం సంచలన ఆరోపణలు చేశారు. అజయ్ కల్లం ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా లేక చాలా మంది రాజకీయ నేతల్లాగే ఆయన కూడా పైపై ఆరోపణలు చేశారా అన్నది త్వరలో తేలిపోనుంది. పక్కా ఆధారాలుంటే మాత్రం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle