newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఏపీలో అరకోర ‘సంక్షేమం’ - అర్హులకు సైతం అందని వైనం!

09-10-201909-10-2019 12:13:53 IST
2019-10-09T06:43:53.542Z09-10-2019 2019-10-09T06:43:46.845Z - - 14-10-2019

ఏపీలో అరకోర ‘సంక్షేమం’ - అర్హులకు సైతం అందని వైనం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు ఘనంగా ఉన్నా...అరకొర ప్రయోజనాలే లబ్ధి దారులకు అందుతున్నాయి.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకూ ఏదో ఒక రూపంలో అందేలా రూపకల్పన చేసి అమలు చేశారు. అవి ఫలించాయి. అప్పటి ప్రభుత్వానికి ప్రజాభిమానాన్ని మెండుగా సంపాదించి పెట్టాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ కూడా అదే పంథాలు అనుసరించాలని భావిస్తున్నది. అందుకే సమాజాంలోని ప్రతి వర్గానికీ ఏదో రూపంలో సంక్షేమం అందేలా పథకాలను రూపకల్పన చేసింది. అయితే  ఆ పథకాల అమలుకు ప్రభుత్వమే రూపొందించిన నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ నిబంధనల కారణంగా చాలా సందర్భాలలో అర్హులకు కూడా ‘సంక్షేమం’ అందకుండా పోతున్నది. అంతే కాదు...అవే నిబంధనలు అవరోధాలుగా మారి...అర్హులు సైతం వాటిని ఆ పథకాల లబ్ధిదారులుగా ముందుకు రావడానికి సంకోచిస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది. 

వాహనమిత్ర పథకాన్నే తీసుకుంటే...లబ్ధిదారులు సైతం ముందుకు రాని పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఈ పథకం లబ్ధిదారులుగా నమోదుకు ముందుకు రాకపోవడంతో ఇప్పటికే గడువు పెంచిన సర్కార్ మరోసారి కూడా గడువు పెంచేందుకు నిర్ణయించింది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు జత చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు చెరో ఆటో ఉంటే...వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకంలో ప్రయోజనం చేకూరుతుంది. జీవనోపాధి కోసం రెండు ఆటోలున్న వ్యక్తి కి కూడా ఒకే ప్రయోజనం చేకూరుతుంది. అంటే కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ ఉంటే...అందరికీ ఈ పథకం వర్తించే పరిస్థితి లేదు.

గత వైఎస్ సర్కార్ సంక్షేమ పథకాలలో ఇటువంటి నిబంధనలు ఉండేవి కాదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇలా ఏ పథకం తీసుకున్నా...ఒకే కుటుంబంలో ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికీ ప్రయోజనం చేకూరేది. అందుకే వైఎస్ఆర్ పథకాలు అంతగా ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు జగన్ సర్కార్ రూపొందించిన పథకాల పట్ల లబ్ధి దారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది.జగన్ సర్కార్ నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న, చేయనున్న పథకాలన్నీ కూడా బహుళ ప్రజాదరణ పొందేందుకు నిబంధనలు అడ్డువస్తున్నాయి.

అమ్మ ఒడి పథకాన్నే తీసుకుంటే...ఈ పథకం గురించి జగన్ ప్రకటన చేసినప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్న తేడా లేకుండా...ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు. అయితే తీరా పథకం అమలు వద్దకు వచ్చే సరికి ఈ పథకం లబ్ధి కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికేనని ప్రభుత్వం ప్రకటన చేసింది. అదీ ఒక కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుందన్న సవరణా చేశారు. దీంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారికి సైతం తీవ్ర అసంతృప్తి ఏర్పడుతోంది. ఇంకా అమలులోనికి రాకముందే...అమ్మఒడి పథకం పట్ల ఆ పథకం వల్ల ప్రయోజనం పొందే వారే అసంతృప్తి చెందుతున్నారు. పథకాల ప్రకటనే కాదు...వాటి అమలు కూడా పకడ్బందీగా ఉన్నప్పుడు మాత్రమే అవి ప్రజల మన్ననలు పొందుతాయి.

అందుకు భిన్నంగా నిబంధనల సంకెళ్లు విధించి...పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికే లబ్ధిదారులు వెనుక ముందులాడేలా ఉంటే అవి ఆశించిన ఫలితాలు ఎంత మాత్రం ఇవ్వజాలవు. అమ్మ ఒడి పథకాన్నే తీసుకుంటే ప్రభుత్వ నిబంధనలు పేదలకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను చదివించుకునే అర్హత లేదని స్వయంగా ప్రభుత్వమే భావిస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉన్న ఇద్దరు పిల్లలలో పథకం లబ్ధి కోసం ఒకరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి మరొకరిని ప్రైవేటు పాఠశాలలో చేర్చడం వల్ల ఆర్థికంగా ఆ కుటుంబానికి లభించే వెసులు బాటు ఏముంటుంది?

ఇలా ఏపీలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న, చేస్తామంటున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులలో అయోమయాన్నీ, అసంతృప్తినీ నింపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన పథకాలు...వంద శాతం లబ్ధిదారులకు చేరేలా లక్ష్యం పెట్టుకుని అందుకు అనుగుణంగా అమలు చేయడం జరిగింది. అందుకే నాడు వైఎస్ హయాంలో అమలు చేసిన పథకాలు నేరుగా లబ్ధిదారుకు చేరాయి.  ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ తనయుడు జగన్ మోహన రెడ్డి మాత్రం సంక్షేమ పథకాల ప్రకటనలో తండ్రిని అనుసరిస్తున్నా...వాటి అమలు విషయంలో మాత్రం ఆ బాటలో పయనించడం లేదు. 

అందుకే పథకాలు ఆకర్షణీయంగా, ప్రయోజనకరంగా కనిపిస్తున్నా...వాటిని పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.  పథకాల వల్ల రాజకీయ ప్రయోజనం పొందాలన్న భావనే తప్ప ఆ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయా? అన్న సమీక్ష, అందేలా చూడాలన్న సంకల్పం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించదు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక సారి సమీక్షించి...అమలు కార్యాచరణలో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   18 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle