newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

ఏపీలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులతో దశ తిరగనుందా?

19-09-201919-09-2019 10:59:37 IST
Updated On 19-09-2019 15:45:32 ISTUpdated On 19-09-20192019-09-19T05:29:37.157Z19-09-2019 2019-09-19T05:29:35.239Z - 2019-09-19T10:15:32.512Z - 19-09-2019

ఏపీలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులతో దశ తిరగనుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖపట్నం నూతన పెట్టుబడులకు కేంద్రంగా ఆవిర్భవిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ఇక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం నగరాన్ని భారతదేశ నూతన పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు.

రాష్ట్ర పరిశ్రమల విభాగం, ఏపీ వాణిజ్య, పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మొదటి కాన్సులేట్ బిజినెస్ మీట్‌లో ఐటీ మంత్రి ప్రసంగించారు. ఈ సదస్సుకు రష్యా, ఫ్రాన్స్, ఇరాన్, ఇటలీ, థాయ్‌లాండ్ కొలంబియా, కెనడా, జర్మనీ, కొరియా, బెల్జియం తదితర దేశాలకు చెందిన కాన్సుల్ జనరల్స్, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. 

రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న భారీ అవకాశాలను ప్రపంచానికి తెలియపర్చే లక్ష్యంలో భాగంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. తీరప్రాతంలో వివిధ పరిశ్రమల స్థాపన కోసం విదేశాల సహకారాన్ని కోరే లక్ష్యంతో ఈ సదస్సును తలపెట్టామని మంత్రి చెప్పారు. సులభతర వాణిజ్యానికి అన్ని స్థాయిల్లో వీలు కల్పిస్తూ సుపరిపాలనను, అవినీతి రహితమైన పారదర్శక పాలనను అందించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. 

ఎలెక్ట్రిక్ వాహనాల ప్రమోషన్‌ నూతన ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని, ఆటోమొబైల్ తయారీ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ని మరొక డెట్రాయిట్‌గా మార్చేందుకు తాము ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు.

చమురు రహిత ఎలెక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన పాలసీని రూపొందించడం ద్వారా ఏపీ దేశంలోనే పైలట్ స్టేట్‌గా మారనుందని మంత్రి చెప్పారు. రాష్ట్రం నుంచి ఎగుమతుల ద్వారా టర్నోవర్ పెద్దగా లేదని, ఎగుమతులను రెట్టింపు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం 4 బిలియన్ల నుంచి 5 బిలియన్ల మేరకు జరుగుతున్న ఎగుమతులను పొడవైన తీరప్రాంతాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా రెట్టింపు చేస్తామన్నారు. 

తైవాన్, వియత్నా వంటి దేశాల్లో అమలవుతున్న ఓపెన్ సీ కల్చర్‌ను పెంపొందించడం ద్వారా సముద్ర ఉత్పత్తుల వృద్ధి కోసం తమ ప్రభుత్వం సముద్ర విధానాన్ని ఖరారు చేయనుందని మంత్రి చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్ చైన్స్ రంగంలో పెట్టుబడుల తమ ప్రాధమ్యంగా ఉంటున్నాయని తెలిపారు. అలాగే ప్రపంచ స్థాయి సీఫుడ్ ల్యాబ్‌లను ప్రోత్సహించనున్నామని వెల్లడించారు.

మంత్రి ప్రకటన ఎంత ఆశాజనకంగా ఉన్నప్పిటికీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోవడమే ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా మారింది. విస్తార తీరప్రాంతంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అభివృద్ధిని ప్రభుత్వాలు ఏమేరకు అందుకుంటాయన్నదే ఆచరణలో తేలాల్సి ఉంది.

 

 

 

 

 

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   44 minutes ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


 గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

గ్రామీణ విద్యార్థుల దశను మార్చే చర్య.. జగన్ కొత్త నిర్ణయం

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle