newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఏపీలో అకాల వర్షం.. అన్నదాతకు అనుకోని నష్టం

10-04-202010-04-2020 10:55:22 IST
Updated On 10-04-2020 11:00:40 ISTUpdated On 10-04-20202020-04-10T05:25:22.509Z10-04-2020 2020-04-10T05:24:50.833Z - 2020-04-10T05:30:40.808Z - 10-04-2020

ఏపీలో అకాల వర్షం.. అన్నదాతకు అనుకోని నష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అనుకోని వాతావరణ మార్పులతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి జోరు వర్షాలు కురిశాయి. ఓ వైపు కరోనా విపత్తు... మరోవైపు భానుడి భగభగలకు వణికిపోతున్న జిల్లా ప్రజానీకాన్ని అకాల వర్షం ముంచెత్తింది. దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు.. ఈదురుగాలుల హోరుతో ప్రజలు భయకంపితులయ్యారు. గురువారం మధ్యాహ్నం ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. అసలే ధరల్లేక అల్లాడుతున్న రైతులను ఉన్నట్టుండి ఊడిపడిన వరుణుడు నిలువునా నిండా ముంచేశాడు.

మిల్లుల్లో, కల్లాల్లో ఆరబోసిన వేలాది టన్నుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. అదేవిధంగా వందలాది ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నీట మునిగింది. అరటి తోటలను ధ్వంసం చేసింది. పెనుగాలులకు చాలా చోట్ల వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 7 గంటల సేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. నెల్లూరు నగరంతోపాటు పట్టణాల్లో వీధులు నీట మునిగాయి. నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది.

నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. దగదర్తిలో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు మరణించారు. నాయుడుపేట మండలం పూడేరు, గొట్టిపోలులో ఇద్దరు, అల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. వాన జోరుతో నెల్లూరు, నాయుడుపేట, ఉదయగిరిలో ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో నూర్పిడి చేసిన ధాన్యపు రాశులు వర్షపు నీటికి తడిసి ముద్దయ్యాయి. సంగం, ఉదయగిరి ప్రాంతాల్లో మామిడి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వాకాడు మండలంలో పెసర, పుచ్చ పంటలు నాశనమయ్యాయి.

కృష్ణా జిల్లా అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వర్షం పడింది. ఈదురుగాలులకు పడవలు ముక్కలై... కృత్తివెన్ను మండలానికి చెందిన నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఆరుబయట ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న గింజలు నీటిపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మోపిదేవి మండలం చిరువోలులో పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధమైంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగిడిపాలేనికి చెందిన ఓ రైతు... పిడుగుపడి మృతి చెందాడు. నగరం మండలం పెద్దపల్లి రైతు... పొలంలో పంటపై పట్టలు కప్పుతుండగా పిడుగుపాటుకు గురై చనిపోయాడు. చేబ్రోలు మండలంలోని పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో పిడుగుపాటుకు ఓ రైతు మరణించాడు. చీరాల, పర్చూరు, అద్దంకి, పొదిలి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కడప జిల్లా చిట్వేలు మండలం తిరుమలశెట్టిపల్లెలో ఈదురు గాలుల ధాటికి అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఉద్యానతోటలు భారీగా దెబ్బతిన్నాయి.  తిరుపతిలో గంటపాటు గాలి వాన ప్రతాపం చూపింది. ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి. 

తిరుపతిలో ఈదురుగాలులకు ఇస్కాన్ మైదానం, బొంతాలమ్మ గుడి, నెహ్రూమున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్ షెడ్లు పూర్తిగా.. ఎస్వీ, ఎంజీఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలు ఉభయగోదావరి జిల్లాలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న సహా పలు పంటలను వానలు నిండా ముంచేశాయి. 

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న నేలరాలాయి. జంగారెడ్డిగూడెం పరిధిలో వెయ్యి హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలాయి. 500 హెక్టార్లలో అరటి... నేలకూలింది. మొక్కజొన్న, వడ్లు పొలాల్లోనే తడిసిముద్దయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షాలకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. రబీ వరి కోతలు జరుగుతున్న సమయంలో కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. 

అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టంపై సీపీఐ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.అకాల వర్షం బీభత్సంతో మరణించిన వారిక కుటుంబాలకు రు.10 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేఖలో కోరారు. అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో వరి, పెసర, మిర్చి, మొక్కజొన్న, అరటి, మామిడి తదితర పంటలు, పండ్ల తోటలు, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.14 మంది మృత్యువాత పడ్డారు.కరోనా విపత్తుకు తోడు వర్ష బీభత్సం రైతులకు శాపంగా పరిణమించింది.పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన అంచనావేసి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

 

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   7 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   8 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   10 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   11 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   11 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   12 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   12 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   12 hours ago


లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

   12 hours ago


విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle