newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

ఏపీలోనూ నేతల నేరచరిత్ర ఘనమే

08-04-201908-04-2019 08:47:39 IST
2019-04-08T03:17:39.422Z08-04-2019 2019-04-08T03:17:12.896Z - - 21-11-2019

ఏపీలోనూ నేతల నేరచరిత్ర ఘనమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల వేళ ఈసీ, సుప్రీంకోర్టు ఆదేశాలతో నేతల చిట్టా బయటపడుతోంది. తమకు ఆస్తులు, అప్పులు, తమమీద వున్న నేరాలు, కేసులు, పడిన శిక్షలు అన్నీ వెల్లడి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసన సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 171 మంది వివిధ కేసుల్లో నేరాభియోగాలను ఎదుర్కొంటున్నట్టు వెల్లడయింది.

సీఎం చంద్రబాబునాయుడుపై కేసు ఉంది.మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు సంబంధించిన ఈ కేసులోనే మంత్రి నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు.వీరిలో అత్యధికంగా జగన్ పార్టీకి చెందిన 97 మంది వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

అలాగే టీడీపీ అభ్యర్ధుల్లో 49 మంది, జనసేనలో 25 మందిపై నేరారోపణలు ఉన్నాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై 11 సీబీఐ, 7 ఈడీ కేసులు సహా అత్యధికంగా 31 కేసులున్నట్టు అఫిడవిట్లో వివరించారు. జగన్ తర్వాత స్థానం మాత్రం ఒక టీడీపీ నేతకు దక్కింది. ఆయనేం మంత్రికాదు, కేవలం ఎమ్మెల్యే, టీడీపీ విప్. అంతటి ఘన చరిత్ర పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ది. ఆయన 26 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.

వీరితో పాటు శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.   వైఎస్‌ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలతో ఆయనపై సీబీఐ కేసు నమోదైంది. మోపిదేవి వెంకటరమణ, వసంత కృష్ణప్రసాద్‌, మల్లా విజయ్‌ప్రసాద్‌, ఆదిమూలపు సురేష్‌ తదితరులపైనా సీబీఐ కేసులున్నాయి.

వీరితో పాటు జనసేన అభ్యర్థులు పలువురు హత్యకు పాల్పడటం, హత్యకు కుట్ర పన్నడం, మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం, ఇసుక దోపిడీ వంటి తీవ్ర నేరాల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో భీమడోలు న్యాయస్థానం చింతమనేని ప్రభాకర్‌కు వెయ్యి జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

దీనిపై ఆయన హైకోర్టులో అప్పీలుకెళ్లారు. టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డికి ఓ హత్య కేసులో హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు యావజ్జీవ ఖైదు, రూ.1,000 జరిమానా విధించింది. భార్య హత్య కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపడిందని రేపల్లె జనసేన పార్టీ అభ్యర్థి కమతం సాంబశివరావు వివరించారు. 

 

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle