newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ఏపీని కుదిపేస్తున్న రథం ఘటన.. జెఎస్వీ బదిలీపై విమర్శలు

11-09-202011-09-2020 11:59:11 IST
2020-09-11T06:29:11.932Z11-09-2020 2020-09-11T06:29:09.105Z - - 29-09-2020

ఏపీని కుదిపేస్తున్న రథం ఘటన.. జెఎస్వీ బదిలీపై విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ను ప్రభుత్వం బదిలీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయనను అంతగా ప్రాధాన్యత లేని బాపట్లలోని ఏపీ మానవవనరుల అభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై చర్చసాగుతోంది. నిజాయితీగా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలా బదిలీల వేటు వేయడం సందేహాస్పదంగా వుంది. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగాక ఏపీలో ఏం జరుగుతుందో అర్థంకాక బుర్రగోక్కోవలసిందే. 

దేవాదాయ ధర్మాదాయ శాఖాధిపతిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జెఎస్వీ.ప్రసాద్‍ను బదిలీ చేయటం వెనుక సిఎం కార్యాలయ అధికారి హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా తానే అని వ్యవహరిస్తున్న ఒక అధికారి జెఎస్వీ బదిలీ వెనుక ప్రముఖ పాత్ర పోషించారని అంటున్నారు. పనితీరుపై ఎప్పటి నుండో అసంతృప్తిగా ఉన్నారు. అదే విధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా ఆయన పనితీరు పట్ల సంతృప్తిగా లేరని అంటున్నారు.ఆయన ఏపీహెచ్‍ఆర్‍డిఐ డైరెక్టర్‍ జనరల్‍గా నియమించారంటే.. ఒక సంవత్సరంలోనే ఆయన రిటైర్డు కావటం ఖాయం అని  ప్రభుత్వం సంకేతికాలు ఇచ్చినట్టే అంటున్నారు.

సమర్దుడు అయిన అధికారిగా పేరు తెచ్చుకున్నారే కానీ.. తన సమర్ధతను ఎక్కడ చూపించాలో.. అక్కడ చూపించలేకపోయారు. నిజాయితీపరుడైన ఐఎఎస్‍ అధికారిగా జెఎస్వీ. ప్రసాద్‍ పేరు తెచ్చుకున్నారేకానీ.. నిజాయితీపరులకు అండను ఇవ్వలేకపోయారనే అభిప్రాయాలున్నాయి. నిజాయితీని ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని జెఎస్వీపై విమర్శలున్నాయి. మరోవైపు నిజాయితీ గల అధికారులను బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని సీనియర్ సంపాదకులు ఎంవీ ఆర్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. టీటీడీకి ఈవోగా చేయాల్సిన యోగ్యుడిని అంతర్వేదిలో గొడవ జరగగానే బాపట్ల బదిలీ చేయాల్సిన అవసరం ఏముంది. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం టీటీడీలో అన్యమతస్తులను వదిలి వెళ్ళిపోమని అన్నందుకు బాపట్ల బదిల చేశారు. జేఎస్వీ ప్రసాద్ బదిలీ వెనుక దుర్మార్గం, దురుద్దేశం కనబడుతోందన్నారు ఎంవీఆర్ శాస్త్రి. 

బాపట్లలో ఏపీహెచ్ ఆర్డీ  డిజిగా జెఎస్వీ ప్రసాద్‍ను నియమిచారంటే.. ఆయనకు సర్వీసున్నంత కాలం అక్కడే పనిచేసి రిటైర్డు అవటం ఖాయమని అధికారులు చెప్పుకుంటున్నారు. ఇటు అంతర్వేది రథం దగ్దం ఘటన హిందువుల మనోభావాలను బాగా దెబ్బతీసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో పిచ్చోళ్ళు దేవాలయాలపై దాడులకు దిగుతున్నారని వస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా వుంటున్నాయి. ఇంతకుముందు కడప జిల్లా రాజంపేటలో,  నెల్లూరు జిల్లా బిట్రగుంటలో దేవుడిరథాలను పిచ్చివాళ్ళు తగల పెట్టినట్టు పోలీసులు కనిపెట్టారు. తరవాత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో దేవతా విగ్రహాలనూ పిచ్చివాళ్ళే ధ్వంసం చేశారనీ సర్కారువారు దివ్యదృష్టితో కనుక్కున్నారు. ఇప్పుడు కొత్తగా అంతర్వేది దేవస్థానంలో పవిత్ర రథాన్నీ గుర్తు తెలియని పిచ్చివాళ్ళే పని గట్టుకుని దగ్ధం చేశారనీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పోలీసులు, మరియు పార్టీ పెద్దలు రెడీమేడ్ నిర్ణయాన్ని జనం మీద రుద్దుతున్నారు.

అంతర్వేదిలో అర్ధరాత్రి హిందూ వ్యతిరేక చర్యలు జరుగుతాయని సి.సి. కెమేరాలకు ముందే తెలుసని, అందుకే అవి పనిచేయడం మానేశాయని భావించాల్సి వస్తోంది. చాలా కాలం ముందే కళ్ళు పొడుచుకున్నాయంటున్నారు సీనియర్ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి. ఈ విషయంలో ఆయన ఉన్నమాట చెప్పేశారు. 50 అడుగులపైగా ఎత్తు ఉండే రథశాల  పైన ఎక్కడో ఎవరికీ కనపడని చోట నిద్రపోతున్న తేనెటీగలకు కూడా సరిగ్గా అదే అర్ధరాత్రి పిచ్చి లేచిందట! ఎవరో ప్రభుదాసులను పిలుచుకొచ్చి ఓపొట్టి గడతో తమ పట్టును తగలబెట్టించుకుని ఆ తేనెటీగలు ఆనందంగా ఆత్మాహుతి చేసుకుంటూ తమతో పాటు తాటిచెట్టంత రథాన్ని కూడా కాకతాళీయంగా మంటలలో  మసి చేశాయన్నారు శాస్త్రిగారు. 

హిందూ మతం మీద, హిందూ దేవస్థానాల మీద, ఎవరి జోలికీ వెళ్ళని హిందువుల విశ్వాసాల మీద, సెంటిమెంట్లమీద, మనో భావాలమీద పగబట్టి, వరసగా నీచ, నికృష్ట దాడులకు తెగబడుతున్న వారి ఆగడాలను వెంటనే అణచి వేయకపోతే రాష్ట్రంలో శాంతికి,  ప్రజా భద్రతకు, మత సామరస్యానికీ పెను ముప్పు తప్పదంటున్నారు. కోట్లాది హిందువులకు పరమపవిత్ర దివ్యక్షేత్రమైన అంతర్వేదిలో నరసింహస్వామి దివ్యరథాన్ని దగ్ధం చేసిన వారు, చేయించిన వారు , వారిని ప్రేరేపించినవారు , కాపాడుతున్నవారు , దైవద్రోహంలో పాలు పంచుకునేవారు ఎవరైనా, ఎంతటివారైనా నామరూపాలులేకుండా చేయగలరని భక్తుల విశ్వాసం. స్వతహాగాఎవరి జోలికీ వెళ్ళక , అవమానాలను,అపచారాలను మౌనంగా భరించే హిందువులకు ఓరిమి నశించింది. హిందూ సమాజం భగభగమండుతోంది. ప్రకంపనలు మొదలయ్యాయి.

 

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల..!

   an hour ago


శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

   an hour ago


రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

రూ. 70 కోట్ల బకాయిలు కట్టకపోతే ఆయిల్ బంద్.. టీఎస్ఆర్టీసీకి కొత్త చిక్కులు

   2 hours ago


అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

అశ్వ‌నీదత్‌, కృష్ణంరాజు ఏపీ ప్రభుత్వం పై న్యాయ పోరాటం...

   3 hours ago


కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇష్టంలేదా?!

   3 hours ago


హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

హైదరాబాద్ లో పుట్టుకొస్తున్న సుపారీ గ్యాంగ్స్.. మర్డర్లకు చిల్లర బేరం!

   3 hours ago


ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

ఇక కుదరదు.. తేల్చిచెప్పిన వైఎస్ జగన్

   4 hours ago


పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

పేదల ఇళ్లకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. మంత్రి కేటీఆర్

   6 hours ago


కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

కేసులూ, మరణాలూ తగ్గాయి కానీ అప్రమత్తత అవశ్యం.. జవహర్ రెడ్డి

   6 hours ago


తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

తమిళ మోడల్ తెలంగాణలో పనిచేయదు.. టీపీసీసీ ఇన్‌చార్జ్ మాణిక్యం

   6 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle