newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

ఏపీని ఆదుకొనే నాధుడెవరు?

27-12-201927-12-2019 14:48:51 IST
Updated On 28-12-2019 10:56:51 ISTUpdated On 28-12-20192019-12-27T09:18:51.342Z27-12-2019 2019-12-27T09:18:47.741Z - 2019-12-28T05:26:51.232Z - 28-12-2019

ఏపీని ఆదుకొనే నాధుడెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సగటు పౌరుడికి అన్నీ తెలిసినవే. వైసీపీ ప్రభుత్వం కదిలించిన రాజధాని తుట్టె ఇప్పుడు రాష్ట్రాన్ని రావణకాష్టంలా దహించివేస్తుంది. ముచ్చటగా మూడు ముక్కల ప్రతిపాదన ఇప్పుడు మూడు ప్రాంతాలలో అయోమయంగానే కనిపిస్తుంది. మొత్తంగా రాష్ట్రంలో అటు పరిపాలనతో పాటు ప్రజా వ్యవస్థలో రాష్ట్రంలో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ, భయం నెలకొన్నాయి.

అసెంబ్లీ సాక్షిగా తమ ప్రాంతానికి హైకోర్టు అని సీఎం చెప్పినపుడు రాయలసీమ వాసులలో అప్పుడు ఆనందం కనిపించినా రోజులు గడిచేకొద్దీ ఆనందం స్థానంలో అయోమయం నెలకొంది. ఒక్క హైకోర్టు వలన తమ ప్రాంతానికి ఒరిగేదేంటి.. రాజధాని మొత్తం తమ ప్రాంతంలో ఉంటేనే తమకి అభివృద్ధి అన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. రాజధాని కోసం విశాఖకు రాయలసీమ వాసులు వెళ్లాలంటే ఎంత వ్యయప్రయాసలతో కూడుకున్నదో ఆ ప్రాంత వాసులకు నెమ్మదిగా ఆలోచన వచ్చింది.

ఇక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండా వంద కిమీ దగ్గరలోకి వచ్చిన రాజధానిని వందల కిమీ దూరం చేస్తున్నారన్న బాధ ఆ ప్రాంతాల ప్రజలను దహించివేస్తుంది. రాజధాని ప్రాంత ప్రజలు, రాజధానికి భూములిచ్చిన రైతులైతే గత వారం రోజులుగా తిండి తిప్పలు మానేసి రోడ్ల మీదకి చేరి ఆందోళనలు చేస్తున్నారు.

ఆందోళనను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీస్ బలగాలను దించారంటే అక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఈరోజే క్యాబినెట్ భేటీ రాజధాని అంశాన్ని తేల్చేయనుందని కథనాలు రావడంతో రాజధాని ప్రాంతంలో ఆందోళనలు ఉదృతమయ్యాయి. కాగా ప్రభుత్వం క్యాబినెట్ భేటీలో రాజధాని అంశాన్ని పూర్తిగా తేల్చలేదు. జీఎన్ రావు కమిటీ నివేదికపై రెండు గంటల పాటు మంత్రివర్గం చర్చించింది.

కాగా, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ నివేదిక కూడా వచ్చిన తర్వాత రాజధానిపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదిక జనవరి 3 తరువాత అందనుంది. అయితే ప్రభుత్వం రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లుగా నిన్న రాజధాని ప్రాంత ఎమ్యెల్యేల మాటలు చెప్పకనే చెప్పాయి. పైగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు విశాఖ ప్రాంతానికి సీఎం రాజధాని వరం ఇచ్చారని చేసిన వ్యాఖ్యలు కూడా దాదాపుగా రాజధానిపై ధ్రువీకరణ ఇచ్చేసినట్లైంది.

మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు ఎప్పటికి కొలిక్కి వస్తాయన్నది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. అసలే ఆర్ధిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ఈ పరిస్థితిలు రాష్ట్రాన్ని మరింత అగాధంలోకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న పాలనా వికేంద్రీకరణ రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల పాలు చేసేలా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపించడం లేదు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle