newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

ఏపీకి శుభవార్త.. పోలవరం బకాయిల చెల్లింపుకు కేంద్రం హామీ..

16-09-202016-09-2020 06:54:19 IST
2020-09-16T01:24:19.902Z16-09-2020 2020-09-16T01:24:16.154Z - - 29-09-2020

ఏపీకి శుభవార్త.. పోలవరం బకాయిల చెల్లింపుకు కేంద్రం హామీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుచేసిన రూ.3,805కోట్ల బకాయిలు చెల్లిస్తాం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ 

ప్రాజెక్టు పూర్తికి వెంటనే నిధులు విడుదల చేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి 

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. ప్రాజెక్టును అనుకున్న తేదీలోగా పూర్తి చేయడానికి వీలుగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఆమె స్పందించారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధ్రువీకరిస్తూ కాగ్‌ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. దీన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. కాబట్టి దీని నిర్మాణానికి నిధులన్నింటినీ కేంద్రమే సమకూర్చాలి. ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2021 నాటికల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర నిధుల కోసం నిరీక్షించకుండా ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్రమే సొంత నిధులను ఖర్చు చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.3,805 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన, కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని కొద్దికాలం క్రితం సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానికి లేఖ రాశారు.  ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ నాటికల్లా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేయాలి అని విజ్ఞప్తి చేశారు. 

కాగా,  పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జూలైలో లేఖ రాశారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా నిర్మించడానికి నిధులను మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందా అని టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.8,614.70 కోట్లు మంజూరు చేసిందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఇవాళ రాజ్యసభ జీరో అవర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సభలోనే ఉన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తమకు సమర్పించినట్లు తెలిపారు. రూ.3,805 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి, కేంద్ర జల శక్తి మంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ఆమె సభకు తెలిపారు. త్వరలోనే ఈ మొత్తం బకాయిల చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.

రాష్ట్ర విభజన, ప్రస్తుతం కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ కొద్దికాలం క్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వివరిస్తూ రూ.3,805 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయడానికి సహకరించాల్సిందిగా కోరారని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిధుల విడుదల ప్రక్రియ సంక్లిష్టంగా ఉన్నందున నిధుల విడుదలలో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జల శక్తి మంత్రికి విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా నిధులు విడుదల చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జల శక్తి మంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా... ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రం మరికొద్ది రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

 

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

బాలుకు భారతరత్న ఇవ్వమని కోరిన జగన్.. ధన్యవాదాలు తెలిపిన కమల్ హాసన్

   2 hours ago


ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం...  పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

ఆగ‌ని ఆల‌యాల్లో ధ్వంసం... పోతేపోనీ ధోర‌ణికి స‌ర్కార్‌ వ‌చ్చేసిందా?

   4 hours ago


బీజీపీ ’మహా‘ రాజకీయం!

బీజీపీ ’మహా‘ రాజకీయం!

   6 hours ago


ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

ఓరుగ‌ల్లులో ఎన్నిక‌ల సంద‌డి... పంతం నీదా నాదా సై!

   8 hours ago


సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

సీఎంకి మా బాధలేం తెలుస్తాయి ? : రైతుల ఆవేదన

   8 hours ago


రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

రాంమాధవ్‌ను పక్కన పెట్టేశారా? ప్రమోషన్ ఇస్తారా?

   9 hours ago


కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

కృష్ణమ్మకు పోటెత్తిన వరదలు.. ప్రభుత్వం పై ముంపుబాధిత ప్రజల ఆగ్రహం

   9 hours ago


జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

జ‌గ‌న్ నోరు మెద‌ప‌రు... మంత్రులు వ్యాఖ్య‌లు ఆప‌రు!

   10 hours ago


రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. బీజేపీ-జేడీయూకు ఎల్‌జేపీ సవాల్!

   10 hours ago


మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

మంత్రి వెల్లంపల్లికి కరోనా.. తిరుమలకి వెళ్లిన వారంతా టెన్షన్!

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle