newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఏపీకి లక్ష కొరియా కిట్లు.. పది నిమిషాల్లో వైరస్ పరీక్ష.. సీఎంకి నెగటివ్

18-04-202018-04-2020 08:08:58 IST
Updated On 18-04-2020 09:13:22 ISTUpdated On 18-04-20202020-04-18T02:38:58.179Z18-04-2020 2020-04-18T02:38:56.589Z - 2020-04-18T03:43:22.045Z - 18-04-2020

ఏపీకి లక్ష కొరియా కిట్లు.. పది నిమిషాల్లో వైరస్ పరీక్ష.. సీఎంకి నెగటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోనే తొలిసారిగా లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను కొరియా నుంచి దిగుమతి చేసుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. తొలి గంటలోనే వీటి పనితనం అద్భుతంగా నిరూపణ కావడంతో ప్రభుత్వ వైద్య అధికారుల మనసులో ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మొత్తం 10 లక్షల కిట్ల ఆర్డర్‌లో తొలివిడతగా లక్ష కిట్లు వచ్చేశాయి. మరో 9 లక్షల కిట్లను దక్షిణ కొరియా నుంచి తెప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. కమ్యూనిటీ టెస్టింగ్ కోసం సమర్ధంగా ఉపయోగపడే ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి ప్రత్యేకంగా చార్టర్డ్‌ విమానంలో  రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. ముందుగా లక్ష కిట్లు అందించామని.. త్వరలో మరో 9 లక్షల కిట్లను అందజేస్తామని ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

ఇంత పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్టు కిట్ల దిగుమతి దేశంలో ఇదే తొలిసారి. పైగా ర్యాపిడ్ టెస్ట్ కిట్‌తో తొలిపరీక్ష చేయించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నెగటివ్ రావటం విశేషం. కేవలం పదే పది నిమిషాల్లో వైరస్ ఉందో లేదో తేల్చి పడేసే ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రాష్ట్ర వైద్యరంగ చరిత్రలో ఒక గేమ్ ఛేందర్ కానుందని చెబుతున్నారు. ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు ఇప్పటివరకు 50 నిమిషాలుకాగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పది నిమిషాల్లో వైరస్ జాడను చెప్పేస్తాయి. 

దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ కిట్లకు ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ కిట్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామని ఎస్‌డీ బయో సెన్సార్‌ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. సాంకేతిక పరమైన సహకారాన్ని కూడా ప్రభుత్వానికి అందిస్తున్నామన్నారు. 

కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ కిట్లను ప్రారంభించారు. శాండర్‌ మెడికెయిడ్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ సింథీ, డైరెక్టర్‌ మురళీధర్‌.. ఈ కిట్లను సీఎం జగన్‌కు అందజేశారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కోవిడ్‌–19 నివారణా చర్యలపై సమీక్షించారు. తాజాగా వచ్చిన ర్యాపిడ్‌ కిట్ల ద్వారా రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఊపందుకుంటాయన్నారు. వీటి వినియోగంపై వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఈ కిట్లు జిల్లాలకు చేరుతాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. 

దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఈ  ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం అనే రెండు రకాల స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. కరోనా వైరస్‌ పరిస్థితులకు ముందు రాష్ట్రంలో ఒకే ఒక్క వైరాలజీ ల్యాబ్‌ ఉండేది. కేవలం ఈ ల్యాబ్‌ ద్వారా మాత్రమే టెస్టులు చేయించేవారు. కోవిడ్‌–19 నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కేవలం 2 వారాల వ్యవధిలో విజయవాడ, కాకినాడ, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖపట్నంలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ ల్యాబ్‌ల ద్వారా రోజూ 2,100 పైగా టెస్టులను చేస్తున్నారు. 

ఇప్పటికే రాష్ట్రంలో విస్తృతంగా ట్రూనాట్‌ కిట్లు ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ట్రానాట్‌ కిట్లు మన దగ్గర ఉన్నాయని అధికారులు తెలిపారు. సుమారు 240కి పైగా కిట్లను ఉపయోగించుకోవడం వల్ల పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. అందువల్లే ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల వినియోగానికి ముందే దేశంలో జనాభా ప్రాతిపదికన అత్యధిక కోవిడ్‌– 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది. ఏప్రిల్ 16వ తేదీ వరకు రాష్ట్రంలో 16,555 టెస్టులు చేశారు. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 331 పరీక్షలు చేశారు. రెండు మూడు రాష్ట్రాలు మినహాయించి ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించ లేదు. ఇప్పుడు కొరియా నుంచి లక్ష వరకు వచ్చిన ర్యాపిడ్‌ టెస్టు కిట్లతో పరీక్షలు మరింత ఊపందుకుంటాయని, త్వరలో దేశంలోనే తొలి రెండు మూడు స్థానాల్లో నిలుస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

ఇటీవల విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో తయారైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌తో 50 నిమిషాల్లో ఒక కరోనా నిర్థారణ పరీక్ష చేపట్టేందుకు అవకాశం ఉంది. దక్షిణ కొరియా అందించిన కిట్లతో అంతకన్నా తక్కువ సమయమే పరీక్షలకు పడుతున్నందున ప్రభుత్వం వీటి వినియోగానికి మొగ్గు చూపుతోంది. నాలుగైదు రోజుల్లో జిల్లాలన్నింటికీ ఈ కిట్లను పంపిస్తామని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని, పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని వారికి సీఎం జగన్‌ సూచించారు.

ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ల రాకతో పరీక్షల వేగం పెరుగుతాయని సీఎంకు అధికారులు తెలిపారు. ‘‘రోజుకు చేసే టెస్టుల సంఖ్య 10000 నుంచి 15000కు పెరుగుతాయి. పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా 40 సంవత్సరాలు పైబడి ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పాటిస్తున్నాం. లక్షణాలుంటే వెంటనే కొవిడ్‌ ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నాం. క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం కొంతమంది డాక్టర్లతోనూ ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఏ సమయంలో నైనా ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉంటారు. రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులను వారు నిరంతరం గైడ్‌ చేస్తున్నారు. క్వారంటైన్‌లలో సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం’’ అని ముఖ్యమంత్రికి ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.

కోవిడ్‌–19 టెస్ట్‌ చేయించుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్‌–19 పరీక్ష చేయించుకున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా వైద్యులు ఆయనకు పరీక్ష చేసి, నెగిటివ్‌గా నిర్ధారించారు. కోవిడ్‌–19 కంట్రోల్‌ సెంటర్‌లో స్టేట్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దక్షిణ కొరియానుంచి రప్పించిన కిట్ల పనితీరును స్వయంగా సీఎం పరిశీలించారు. తనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఉందో, నెగెటివ్‌ ఉందో పరీక్షించాలని అధికారులను ఆయన కోరారు. ఈ మేరకు పరీక్షలు నిర్వహించగా, పది నిమిషాల్లోనే ఫలితం వచ్చింది. జగన్‌లో కరోనా లక్షణాలు లేవని ఆ కిట్‌ తేల్చింది.

శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. ఈ కిట్‌ ద్వారానే సీఎంకు వైద్యులు పరీక్ష నిర్వహించారు. కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలెవ్వరూ సంకోచం చెందొద్దని, నిరభ్యంతరంగా, ఎలాంటి సందేహం లేకుండా టెస్టులు చేయించుకోవాలనే సందేశం ఇవ్వడానికే ముఖ్యమంత్రి పరీక్ష చేయించుకున్నారని డాక్టర్‌ కె.రాంబాబు తెలిపారు. ఈ కిట్ల ద్వారా కంటైన్‌మెంట్‌ జోన్లలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్‌గా తేలినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్లలో  మంచి వైద్య సదుపాయాలు, వసతులు ఉన్నాయని చెప్పారు. మంచి ఆహారం తీసుకుంటూ చికిత్స పొందితే త్వరలో ఆరోగ్యవంతులవుతారన్నారు.   

కమ్యూనిటీ టెస్టింగ్‌ అంటే..

విదేశాల నుంచి వచ్చిన వారు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్, ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వారు.. వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ కాకుండా ఇతరులకు కరోనా పరీక్షలు నిర్వహించడాన్ని కమ్యూనిటీ టెస్టింగ్‌ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి కరోనా వైరస్‌ ఎలా సోకిందో తెలియదు. మార్కెట్‌కు వెళ్లినప్పుడో లేక వీధిలో వాళ్లను ఎవరినైనా తాకినప్పుడో వైరస్‌ సోకిందనుకుందాం. ఇలాంటప్పుడు ఈ వ్యక్తి ఇంటి చుట్టుపక్కల వారికి, ఆ వీధిలో వారికి, హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో, రెడ్, ఆరెంజ్‌ జోన్లలో కమ్యూనిటీ టెస్ట్‌లు చేపట్టనున్నారు. 

ఎలా చేస్తారంటే..

రెండు రకాలుగా (వ్యక్తిగతంగా, ర్యాండమ్‌గా) కమ్యూనిటీ టెస్ట్‌ చేయనున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వ్యక్తిగతంగా చేస్తారు. వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల వారందరిలో ఐదుగురు చొప్పున తీసుకుని (వారందరి రక్తంతో కామన్‌గా) ర్యాండమ్‌గా టెస్ట్‌ చేస్తారు. పాజిటివ్‌ వస్తే ఆ ఐదుగురికీ విడి విడిగా టెస్ట్‌లు చేస్తారు. ర్యాండమ్‌ పద్ధతి వల్ల కిట్‌లను పొదుపుగా వాడుకోవచ్చు.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle