newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ఏపీకి మూడు రాజధానులు.. జగన్ సంచలన నిర్ణయం?

17-12-201917-12-2019 18:50:20 IST
Updated On 18-12-2019 08:59:22 ISTUpdated On 18-12-20192019-12-17T13:20:20.638Z17-12-2019 2019-12-17T13:20:17.856Z - 2019-12-18T03:29:22.550Z - 18-12-2019

ఏపీకి మూడు రాజధానులు.. జగన్ సంచలన నిర్ణయం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని అమరావతిపై ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతూనే వుంది. తాజాగా మళ్ళీ రాజధాని అంశం హాట్ టాపిక్ అయింది. అసెంబ్లీలో అమరావతిపై చర్చ సందర్భంగా కొత్త ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి రాజధాని పై జరిగిన చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్.

ఈసందర్భంగా జగన్ దక్షిణాఫ్రికాను ప్రస్తావించారు. సౌత్ ఆఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని ..బహుశా ఏపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటూనే ప్రసంగం చివరలో అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటానంటూ వ్యాఖ్యానించారు. దీంతో మూడు ప్రాంతాలను ప్రస్తావించారు. 

అమరావతి : లెజిస్లేటర్ క్యాపిటల్

విశాఖపట్నం : ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్

కర్నూలు : జ్యూడిషియరీ క్యాపిటల్

కొద్దిరోజుల క్రితమే శాసనమండలిలో ప్రభుత్వం ప్రకటన చేసింది. అమరావతి విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ ఈ అంశం హాట్ టాపిక్ అయింది. తాజాగా నిపుణుల కమిటీ నివేదిక వారంలో వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

మొత్తం మీద వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజధానిపై సందిగ్థత కొనసాగుతూనే వుంది. రాజధాని ఏర్పాటుపై నెలకొన్న అనేక అపోహలు,సందేహాలకు ముఖ్యమంత్రి తన ప్రకటనతో తెరదించినట్టు అయింది. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర,రాయలసీమ,కోస్తాంధ్ర ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్నామన్న సంకేతాలను జగన్ పంపించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రాజధానుల గురించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇప్పటికే చంద్రబాబు జగన్ నిర్ణయాలను తుగ్లక్ పాలన అంటూ దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   18 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle