newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఏపీకి పరిశ్రమలే వద్దా? తెలంగాణకు త్యాగం చేశారా?

02-11-201902-11-2019 09:24:18 IST
Updated On 02-11-2019 17:22:41 ISTUpdated On 02-11-20192019-11-02T03:54:18.317Z02-11-2019 2019-11-02T03:53:06.357Z - 2019-11-02T11:52:41.262Z - 02-11-2019

ఏపీకి పరిశ్రమలే వద్దా? తెలంగాణకు త్యాగం చేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న మనవ వనరులను ఉపయోగించుకోవాలి. అందుకు పరిశ్రమలు, కర్మాగారాలు ఏర్పాటు కావాలి. పరిశ్రమలు, వివిధ కంపెనీలు రాష్ట్రానికి రావాలంటే ప్రభుత్వం తన తరపున తమ ప్రతినిధులను వివిధ రాష్ట్రాలు, దేశాలకు పంపించి తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, తమ రాష్ట్రానికి వస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, పాలసీలను వివరించాల్సి ఉంటుంది. మన రాష్ట్రం ఎంత గొప్పదైనా.. మన దగ్గర ఎంత మేధావులు ఉన్నా అది పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు ఆ విషయాన్ని తెలియజేసేందుకు ఈ పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాలు.

పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు గత టీడీపీ ప్రభుత్వంలో విస్తృతంగా చేపట్టడంతోనే.. కియా, హీరో మోటార్ కార్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు చిత్తూరు జిల్లాను మినీ సైజ్ ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చి యువతకు ఉపాధి కల్పన ప్రయత్నం చేశారు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమ కానీ.. ఓ కంపెనీ కానీ ఒక్కటీ లేదు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందా అంటే దానిపై కూడా ఎక్కడా స్పష్టత లేదు.

కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే సంగతెలా ఉన్నా గత ప్రభుత్వంలో ఏర్పాటుకి ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కూడా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచనలో పడ్డాయని కూడా తాజాగా అదానీ గ్రూప్ విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న డేటా సెంటర్ డైలమా పడిందన్న కథనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం పెట్టుబడుల రాబట్టేందుకు చేసే ప్రయత్నాలెలా ఉన్నా కేంద్రం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ఏపీ ప్రభుత్వం మొహం చాటేయడమే విస్తుపోయేలా చేస్తుంది.

కేంద్రం పెట్టుబడులను రాబట్టినా పరిశ్రమలను రాష్ట్రాలలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయా సదస్సులకు రాష్ట్రాలకు ఆహ్వానం పంపించి మీ రాష్ట్రంలో ఉన్న వసతులు రాయితీలను కంపెనీలకు తెలియజేయాలని చెప్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సు జరిగింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ఒక్క ఏపీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రం నుండి కూడా మంత్రి కేటీఆర్ ఓ బృందాన్ని వెంటపెట్టుకొని మరీ రెండు రోజులు ముందుగానే ఢిల్లీకి చేరుకొని ఆ సదస్సులో రిప్రజెంట్ చేయాల్సిన అంశాలపై కసరత్తులు చేసి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత పలువురు మంత్రులను కలిసి రాష్ట్రానికి కావాల్సిన అంశాలను ప్రస్తావించారు. కానీ ఏపీ నుండి ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి కానీ ఆ శాఖ అధికారులు కానీ ఈ సదస్సుకు హాజరు కాలేదు.

ఇప్పటికే ఏపీకి వచ్చేందుకు పెట్టుబడిదారులు వెనకంజ వేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతుండగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఉన్న అవకాశాలను కూడా లైట్ తీసుకోవడం ఏమిటో మేధావులకు సైతం అంతుబట్టడం లేదు. ఒకపక్క రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా ప్రభుత్వం భవిష్యత్ మీద ఎలాంటి ప్రణాళికలు లేని విధంగా ప్రవర్తిస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతుండడంతో మానవవనరులు పక్క రాష్ట్రాలకు తరలివెళ్ళిపోతున్నారు.

ఏపీ ప్రభుత్వ వింత పోకడలు తెలంగాణకు వరంగా మారుతున్నాయి. అదానీ గ్రూప్ విశాఖలో అరవై వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలనుకున్న డేటా సెంటరే హైద్రాబాదుకు తరలివెళ్లిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు దీనిపై అటు అదానీ గ్రూప్ కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు. అదానీ మాదిరే తెలుగు రాష్ట్రాల వైపు చూసే పారిశ్రామిక వేత్తలు, సంస్థలకు ఇప్పుడు కేవలం తెలంగాణ మాత్రమే ఆప్షన్ గా మారినట్లుగా కనిపిస్తుంది. గత ఏపీ ప్రభుత్వం పరిశ్రమల ఆకర్షణకు వినూత్న పథకాలను చేపడితే ఈ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు, ఒక్క పైసా లంచం లేకుండా అనుమతులు అంటూ మాటలకే పరిమితమవుతుంది. అసలు ఏపీకి పరిశ్రమలే వద్దా? లేక తెలంగాణ కోసం త్యాగం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle