newssting
BITING NEWS :
*జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయి రెడ్డి, టీఎస్ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్..ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఆబ్సెంట్ పిటిషన్ వేసిన ఏపీ సీఎం జగన్*ఐబీ అధికారి అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఆరు గంటల పాటు పేగులు లాగి మరి చిత్రహింసలు. పోస్ట్ మార్టంలో వెల్లడవుతున్న నిజాలు * ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం పర్యటన .. అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ *ఢిల్లీ పోలీసు కమిషనర్ గా ఎస్.ఎన్. శ్రీవాత్సవ నియామకం..మూడు రోజుల క్రితమే ఆయన్ను స్పెషల్ కమిషనర్ గా నియమించిన ప్రభుత్వం *రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం..బస్సును వెనకనుండి ఢీకొన్న కల్వకుర్తి ఆర్టీసీ డిపో బస్సు..20 మంది విద్యార్థుల్లో 6గురికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు*ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం

18-11-201918-11-2019 09:33:20 IST
Updated On 18-11-2019 12:01:35 ISTUpdated On 18-11-20192019-11-18T04:03:20.075Z18-11-2019 2019-11-18T04:03:17.134Z - 2019-11-18T06:31:35.281Z - 18-11-2019

ఏపీకి తిరిగి రానని శపథం.. ఎల్వీ సుబ్రహ్మణ్యం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంతో ఘర్షణకు దిగి అనూహ్యంగా, అవమానకరంగా పదవి పోగొట్టుకున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారిక విధులను నిర్వర్తించడానికి ఇక ఎన్నటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదని కఠోర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి అనామకమైన పదవికి (ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్) బదలాయించబడిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వెంటనే నెలరోజులు సుదీర్ఘ లీవుపై వెళ్లిపోయారు.

అప్పటినుంచి తన జాడ తెలియనివ్వని ఆయన డిసెంబర్ 6న తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవినుంచి తప్పించబడిన తాను ఇతర అనామక పదవులను చేపట్టడానికి ఏపీకి తిరిగి రాబోనని ఎల్వీస్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తాజా సమాచారం. అంటే ఆయన తన నెలరోజుల సెలవును నిరవధికంగా పొడగించదల్చినట్లు తెలుస్తోంది.

ఈలోపుగా కేంద్రప్రభుత్వ సేవలకు డిప్యుటేషన్ కింద వెళ్లాలని కూడా ఎల్వీఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయిదునెలలు మాత్రమే సర్వీసు ఉన్న ఎల్వీఎస్ ఢిల్లీలో విధులు నిర్వహించి అక్కడే రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు.

అయితే అయిదునెలల సర్వీసు మాత్రమే కలిగి ఉన్న సుబ్రహ్మణ్యం ఇంత స్వల్ప కాలానికి గానూ కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం దక్కించుకోవడం మామాలు పరిస్థితుల్లో సాధ్యం కాని విషయమని తెలుస్తోంది.

ఎందుకంటే పదవీవిరమణకు అయిదు నెలల స్వల్పకాలం మాత్రమే కలిగివున్న ప్రభుత్వోద్యోగి కేంద్రంలో కొత్త పదవిని చేజిక్కించుకున్నప్పటికీ తనకు కేటాయించిన పనులను అర్థం చేసుకోవడానికి ముందే తన పదవీకాలం ముగిసిపోవచ్చు. పదవీవిరమణ గడువు సమీపించిన వ్యక్తికి ఉన్నత పదవిని ఇవ్వడానికి కేంద్రం కూడా అంగీకరించకపోవచ్చని ఐఏఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాబట్టి తాను ఇప్పటికే పెట్టిన నెలరోజుల లీవును నిరవధింకంగా పొడిగించుకుని గౌరవప్రదంగా నిష్క్రమించడమే సుబ్రహ్మణ్యం ముందున్న దారి అని తెలుస్తోంది. కానీ తాను పదవీ విరమణ చేయాడానికి ఒక రోజు ముందు తనకు కేటాయించిన బాధ్యతల్లో ప్రభుత్వోద్యోగి చేరాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతడి లేక ఆమె సర్వీసు పూర్తవుతుంది. 

అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నతోద్యోగిగా తిరిగి రానని భీషణ ప్రతిజ్ఞ చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాగోలా కేంద్ర ప్రభుత్వం వద్దకు డిప్యుటేషన్ మీద వెళ్లడానికే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

విషాదకరమైన విషయం ఏమిటంటే, ఏపీలో ఎల్వీ సుబ్రహ్మణ్యంకి లాంఛనప్రాయమైన వీడ్కోలు లభించకపోవడమే. అంత అత్యున్నత పదవికి చేరుకున్న ఐఏఎస్ అధికారికి ఇలాంటి గతి పట్టడం బాధాకరమైన విషయం.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువిడుపులు లేని మొండితనానికి బలైన ఐఏఎస్ ఉన్నతాధికారిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం చరిత్రలో నిలిచిపోనున్నారు. 

 

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

ట్విట్టర్లో జగన్‌ని ఆటాడుకున్న చినబాబు

   2 hours ago


టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

టీడీపీ పిటిషన్‌పై విచారణ.. మార్చి 2కు వాయిదా

   4 hours ago


కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

కిలో టమోటా రూపాయి..రోడ్లపైనే వదిలేస్తున్న రైతన్న

   4 hours ago


పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

పిచ్చి పీక్స్.. వాలంటీర్లే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్లు!

   9 hours ago


వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

వాహ్.. 13 కోట్లతో కేసీఆర్ ఫాంహౌజ్‌ పోలీస్ స్టేషన్!

   9 hours ago


కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

కరోనా దెబ్బకు హడలిపోతున్న చైనా... భారత్ కీలక నిర్ణయం!

   11 hours ago


అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

అసెంబ్లీ సీట్ల పెంపు లేదు..ఏపీ, తెలంగాణ నేతలకు హోంశాఖ షాక్

   12 hours ago


 మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

మార్క్ ఫెడ్ నిర్లక్ష్యం ..కందుల రైతుల ఇబ్బందులు

   12 hours ago


కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

కలకలం రేపుతున్న ఏసీబీ దాడులు... ఏరియా ఆస్పత్రుల్లో తనిఖీలు

   12 hours ago


వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

వైసీపీకి వార్నింగ్ బెల్స్ ఇస్తున్న సొంత క్యాడ‌ర్‌

   13 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle