newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

ఏపీకి కేంద్రం షాక్.. దుగరాజపట్నానికి మోకాలడ్డు

26-11-201926-11-2019 11:27:34 IST
Updated On 26-11-2019 14:31:11 ISTUpdated On 26-11-20192019-11-26T05:57:34.832Z26-11-2019 2019-11-26T05:57:27.745Z - 2019-11-26T09:01:11.606Z - 26-11-2019

ఏపీకి కేంద్రం షాక్.. దుగరాజపట్నానికి మోకాలడ్డు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తూ వచ్చిన దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణాన్ని కేంద్రప్రభుత్వం తన ప్రాధాన్యతల నుంచి కొట్టిపడేసింది. భారీ ఓడరేవు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన దుగరాజపట్నం.. అనువైన ప్రదేశంకాదని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్షుఖ్‌ మండావీయ స్పష్టం చేశారు. నిన్నమొన్నటి దాకా టీడీపీలో ఉండి ఇటీవలే ఫిరాయించిన బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ దుగరాజపట్నం ఓడరేవుకు సంబంధించిన వేసిన ప్రశ్నకు మంత్రి స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

దుగరాజపట్నం ఓడరేవుపై "కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఈ ఓడరేవు ప్రతిపాదనను కమిటీ పరిశీలించిన అనంతరం దుగరాజపట్నంలో ఓడరేవు అభివృద్ధికి పరిస్థితులు సానుకూలంగా లేవని నివేదించింది. ఈ కారణంతోనే ఓడరేవు కోసం కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిధులూ సమకూర్చలేదు’’ అని ఓడరేవుల శాఖ మంత్రి మండావీయా వివరించారు. 

దుగరాజపట్నంపై ఆశలు చావని రాష్ట్ర ప్రజలకు కేంద్రం విస్పష్ట ప్రకటన నిరాశలో ముంచెత్తేదిగా మారింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు తగిన నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కేంద్రప్రభుత్వం చివరకు దుగరాజపట్నంపై చివరి ఆశలను కూడా తుంచేసింది. కానీ ఏపీలో భారీ వ్యయంతో ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం వివరించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లో రూ.14,435 కోట్ల వ్యయంతో మొత్తం ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా గడ్కరీ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మరో రూ.59కోట్ల వ్యయంతో 71 రహదారులను మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. గత రెండేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయని, అవి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 

‘కృష్ణా నదిపై విజయవాడ నుంచి ముక్త్యాల వరకు తలపెట్టిన జలరవాణా పనులు  మొదలైనట్లు కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. జలరవాణా ఆర్థికంగా, పర్యావరణపరంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, దేశంలోని నదులను పరిశుభ్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని, తెలుగు రాష్ట్రాలలోని గోదావరి, మూసీ నదుల పరిశుభ్రత కోసం రూ.259.80కోట్లు విడుదల చేశామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle