newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ‌గా రోజా

12-06-201912-06-2019 16:15:05 IST
Updated On 24-06-2019 11:08:52 ISTUpdated On 24-06-20192019-06-12T10:45:05.606Z12-06-2019 2019-06-12T10:45:03.755Z - 2019-06-24T05:38:52.248Z - 24-06-2019

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ‌గా  రోజా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంత్రి పదవి రాలేదని అలిగిన నగరి ఎమ్మెల్యే రోజాకు జగన్ పదవి కట్టబెట్టారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియడం లేదని రోజా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఎవరిమీద అలగలేదని, ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ రోజాను ఈ పదవి వరించింది. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రోజా ధన్యవాదాలు తెలిపారు.

దీంతో రోజా కూల్ అయినట్టు తెలుస్తోంది.  మంగళవారం సీఎం జగన్ ఆదేశాల మేరకు అమరావతి వచ్చిన రోజా... ఆయనతో చర్చలు జరిపారు. మంత్రి పదవి దక్కని రోజాను బుజ్జగించిన సీఎం జగన్, వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి... ఆమెకు ప్రోటోకాల్ ఉన్న పదవి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి.. మంత్రి పదవి దక్కలేని అలక వహించిన రోజాతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృ‌ష్ణారెడ్డికి కూడా జగన్ నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle