newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

ఏంటీ.. సీఎం జగన్ మళ్ళీ జైలుకేనా?!

28-10-201928-10-2019 10:46:03 IST
2019-10-28T05:16:03.864Z28-10-2019 2019-10-28T05:16:00.588Z - - 24-01-2020

ఏంటీ.. సీఎం జగన్ మళ్ళీ జైలుకేనా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అయన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేలకోట్లను అక్రమంగా సంపాదించారని ఆరోపణలు వెల్లువెత్తడం.. సిబిఐ విచారణ.. పదహారు నెలల జైలులో గడపడం.. అనంతరం బెయిల్ మీద జైలు నుండి బయటకొచ్చినా ప్రస్తుతం ప్రతి శుక్రవారం విచారణ నిమిత్తం సిబిఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని సిబిఐ కోరడం తదితర విషయాలన్నీ సగటు తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతానికి వస్తే సీఎంగా ప్రజలకు సేవ చేసే పనిలో ఉన్న బిజీ కారణంగా తనకు ప్రతి శుక్రవారం కోర్టు హాజరు నుండి మినహాయింపు కావాలంటూ జగన్ సిబిఐ కోర్టుకు విన్నపాలు చేసుకోగా సిబిఐ ససేమిరా అంటూ కౌంటర్లు దాఖలు చేసుకుంది. ఈ పిటిషనుపై నవంబర్ 2న సిబిఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ మినహాయింపు కోసమే సీఎం జగన్ కేంద్రంలోని పెద్దల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని కూడా రాజకీయ వర్గాలలో పుంఖాను పుంఖాలుగా కథనాలొస్తున్న సంగతి కూడా తెలిసిందే.

అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి అదే సిబిఐ కేసులలో మరోసారి జైలు కెళ్ళడం ఖాయమని ఓ మీడియా సంస్థల అధినేత తన 'పలుకు'లలో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ముందుగా త్వరలోనే రాబోయే సిబిఐ కోర్టు తీర్పులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ రద్దు చేసి సిబిఐ రోజు వారీ విచారణ ప్రారంభించి సిబిఐ జగన్ అక్రమాస్తుల కేసులు పురోగతి దిశగా వెళ్తాయని జోస్యం చెప్పారు.

దానికి మించి సిబిఐ త్వరలోనే సుప్రీంకోర్టు తలుపు తట్టి జగన్ బెయిల్ రద్దు కోరనుందని.. సిబిఐ బలమైన కారణాలతో రద్దు కోరితే సుప్రీంకోర్టు కూడా బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని అయన పేర్కొన్నారు. రానున్న ఉపద్రవాన్ని జగనుడు ముందే ఊహించే రాష్ట్ర ఖజానాను సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాలల పంచిపెడుతున్నారని.. తాను మళ్ళీ తిరిగి జైలుకెళ్లినా ప్రజల దృష్టిలో మంచి నాయకుడిగా మిగిలిపోయాలని ఆరాటపడుతున్నారని వెల్లడించారు.

అనుకున్నట్లు జరిగి జైలుకెళ్తే వెనుక వచ్చే నాయకుడు పథకాల అమలులో ఘోరంగా విఫలమైతే జగనే ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రజలు తనను కొనియాడాలని సీఎం మనసులో ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయం.. తన రాజకీయ భవిష్యత్ పైనే తన మిత్రుడూ.. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ తో కూడా జగన్ మంతనాలు జరిపారని కూడా చెప్పడం విశేషం.

అంతేకాదు.. మహా అయితే జగన్ సీఎంగా మరో ఏడాది ఉండడమే గగనం కావచ్చు అంటూ పెద్ద ఆటం బాంబే పేల్చారు. అందుకే ఈలోగా అయన చేతికి అందినవరకు ప్రజలకు పంచిపెట్టేసి వెళ్లే ఆలోచనలో ఉన్నారట. తన పార్టీ కార్యకర్తలు, నేతలకు కూడా అయన ఉన్న ఈ కాలంలోనే రాజకీయంగా.. ఆర్ధికంగా కూడా ఆదుకొనే విధంగా జగన్ ప్రణాళికలు ఉంటున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఏపీలోని రెండు బలమైన సామాజికవర్గాలను అణగదొక్కి తన సొంత సామాజికవర్గానికి మేలు జరిగేలా సీఎం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇందులో భాగంగానే పోలీస్ శాఖలో ఆయా సామజిక వర్గానికి చెందిన వారిని రాష్ట్రంలో ఉన్నత పదవులలో లేకుండా చేశారని.. ఇక ఉన్న ద్వితీయ శ్రేణి పోలీసులకు కూడా పై అధికారులతో సీఎం మనసులో మాటను ఆజ్ఞగా పంపించారని వెల్లడించారు.

ఆయా సామాజికవర్గానికి చెందిన మంత్రులతోనే వివాదాస్పద ప్రకటనలు చేయించడం కూడా సీఎం ఎత్తులో భాగమేనని పేర్కొనడం విశేషం కాగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కోణంలోనే బడా బడా పారిశ్రామిక వేత్తలను సైతం బెదిరింపులకు గురి చేసి తన సామజిక వర్గాల నేతలకు మేలు జరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నిర్మొహమాటం చెప్పారు. ఇదే జరిగితే రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులకు అవకాశం ఉంటుంది. మరి ఇది జరిగేనా.. లేక జోస్యంగానే మిగిలేనా!!

 

 

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   12 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle