newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

ఏంటీ జబర్దస్త్?

08-03-201908-03-2019 16:59:48 IST
Updated On 08-03-2019 17:35:53 ISTUpdated On 08-03-20192019-03-08T11:29:48.542Z08-03-2019 2019-03-08T11:22:57.597Z - 2019-03-08T12:05:53.526Z - 08-03-2019

ఏంటీ జబర్దస్త్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా కామెంట్లు ఒక్కోసారి శృతి మించుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై చేసిన కామెంట్లపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. డేటా చోరీ కేసులో ఇటు టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోజా వాడిన పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజకీయం అంటే జబర్దస్త్ కామెడీ షో కాదంటున్నారు టీడీపీ నేతలు. డేరా బాబా మాదిరిగా డేటా బాబా, బేటా బాబాలుగా చంద్రబాబు, లోకేష్‌ రెచ్చిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా కోడుమూరు, అమరావతిలో తీవ్రంగా విమర్శించారు. లోకేష్‌ను ఐటీ మినిస్టర్ అనే కంటే లూటీ మినిస్టర్‌ అంటే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించారు.ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన  డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

2014 ఎన్నికల్లో డేటా చోరీ చేసే చంద్రబాబు గెలిచారని రోజా సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ రోజా చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. నారా చంద్రబాబు తన పేరును సారా చంద్రబాబు నాయుడిగా మార్చుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా? అంటూ ఆమె నిలదీశారు. తాగుబోతులంతా కూర్చుని బార్ పాలసీ తెచ్చారని ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డారు.

ఒక ఎమ్మె్ల్యేగా ఉండి రోజా తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణంగా ఉందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ‘న్యూస్‌స్టింగ్’ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌పై చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మనం వాడే భాష హుందాగా ఉండాలని, ముఖ్యమంత్రిని అలా పోల్చడం ఏంటని అనూరాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించేందుకు వైసీపీ నేతలు నిరాకరించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle