newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

ఎస్వీబీసీ ఛైర్మన్ రేసులో ఆ ముగ్గురు?

15-01-202015-01-2020 11:31:58 IST
2020-01-15T06:01:58.051Z15-01-2020 2020-01-15T06:01:55.569Z - - 13-08-2020

ఎస్వీబీసీ ఛైర్మన్ రేసులో ఆ ముగ్గురు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదంలో చిక్కుకున్న  శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్  ఫృథ్వీరాజ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పదవిలో ఇప్పుడు ఎవరిని నియమించాలనేది చర్చనీయాంశంగా మారింది.  ఈ ప్రతిష్టాత్మక పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ఇటు వైసీపీ. ప్రభుత్వ వర్గాల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వివాదాలకు తావులేని వ్యక్తిని ఈ పదవిలో నియమిస్తేనే బాగుంటుందని జగన్ భావిస్తున్నారు.

ఎస్వీబీసీ చైర్మన్ రేసులో పలువురి ప్రముఖుల పేర్లు సీఎం జగన్ పరిశీలిస్తున్నారు.ఇందులో ప్రధానంగా ప్రముఖ యాంకర్ , ప్రస్తుత 10టీవీ మేనేజింగ్ డైరెక్టర్ స్వప్న పేరు వినిపిస్తోంది. ఈమె ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

సాక్షి టీవీ చానెల్లో ఎంతోకాలనుంచి అనుబంధం ఉంది. స్వప్న జగన్ కుటుంబానికి చాలా దగ్గరైన వారు.. పైగా ఏ రాజకీయ పదవిలోనూ లేదు. ఆమె వివాదారహితురాలు కూడా. ఎస్వీబీసీని ఆమె అయితే సమర్థంగా నడిపించడం ఖాయం అంటున్నారు. ఈ రేసులో స్వప్న పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 

స్వప్నతో పాటు మరికొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. అందులో చంద్రబాబును వ్యతిరేకంగా మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలిపిన మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు పేరు కూడా తెరపైకి వస్తోంది. ఈయన టీటీడీలో పనిచేయడం కూడా అదనపు బలం. ఈయన అయితే సమర్థంగా పనిచేస్తారని, ఆయన అనుభవం వివిధ విషయాల్లో బాగా పనికి వస్తుందని అంటున్నారు.స్వప్న, ఐవైఆర్ కృష్ణారావుతో పాటు టాలీవుడ్ దర్శకుడు శ్రీనివాస రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. 

శ్రీనివాసరెడ్డికి జగన్ తో ఎంతో అనుబంధం ఉంది. అంతేకాకుండా ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈయన కూడా ఎస్వీబీసీ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి పట్త సీఎం జగన్ మొగ్గుచూపే అవకాశాలున్నాయి. శ్రీనివాసరెడ్డి దివంగత వైఎస్ కు సన్నిహితంగా మెలగడమే కాదు ఎన్నికల సమయంలో వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వీరిలో ఎస్వీబీసీ చైర్మన్ కి ఒకరిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. మరి సీఎం వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎవరికి అవకాశం ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   19 minutes ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   24 minutes ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   31 minutes ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   2 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   2 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   3 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   3 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   3 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle