newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీకి పవన్ పరామర్శ

11-05-201911-05-2019 16:17:18 IST
Updated On 28-06-2019 16:08:09 ISTUpdated On 28-06-20192019-05-11T10:47:18.532Z11-05-2019 2019-05-11T10:47:16.369Z - 2019-06-28T10:38:09.352Z - 28-06-2019

ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీకి పవన్ పరామర్శ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లారు.  గత నెల 30న కన్నుమూసిన ఎంపీ ఎస్పీవై  రెడ్డి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీవై రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో నంద్యాలకు వెళ్లిన పవన్‌.. ఎస్పీవై రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎస్పీవై రెడ్డి కన్నుమూసిన రోజు విదేశీ పర్యటనలో ఉండటంతో పవన్‌ రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల, అల్లుడితో కాసేపు పవన్‌ మాట్లాడారు. ఎంపీగా ఆయన చేసిన సేవలు, సామాజిక దృక్పథంని పవన్ గుర్తుచేశారు. 

ఏప్రిల్ 3వ తేదీన  ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో  ఆసుప‌త్రిలో చేరారు. ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న స‌మ‌యంలో అనారోగ్యానికి గురి కావ‌డంతో హుటాహుటిన కేర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప్పటి నుంచి ఆయ‌న‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వ‌చ్చారు డాక్ట‌ర్లు. 30వ తేదీన ఆయ‌న ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle