newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ఎవ‌రీ శేఖ‌ర్ గుప్తా..? జ‌గ‌న్‌ను త‌ట్టుకోగ‌ల‌డా..?

29-12-201929-12-2019 07:21:42 IST
2019-12-29T01:51:42.471Z29-12-2019 2019-12-29T01:51:39.205Z - - 05-08-2020

ఎవ‌రీ శేఖ‌ర్ గుప్తా..? జ‌గ‌న్‌ను త‌ట్టుకోగ‌ల‌డా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని కేవ‌లం ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బ‌ద‌నాం చేసేందుకు చంద్ర‌బాబు నాయుడు ఒక ప్ర‌ణాళికాబ‌ద్దంగా ముందుకెళ్తున్నాడు. జాతీయ మీడియాలో ఎక్క‌డైనా జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ క‌థ‌నాలు వ‌స్తే వెంట‌నే వాటిని తీసుకువ‌చ్చి తిరిగి ఏపీలో కూడా ప్ర‌చారం చేస్తూ చూశారా..?  జాతీయ మీడియాలో కూడా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి విధానాల‌పైన వ్య‌తిరేక‌త వ‌స్తోంది అంటూ టీడీపీ ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ప్ర‌చారం చేస్తూ వ‌చ్చింది.

తాజాగా, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శేఖ‌ర్ గుప్తా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపైన కొన్ని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేస్తున్న మూడు రాజధానుల ఆలోచ‌న‌ల‌ను ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శిస్తూ జ‌గ‌న్‌ను తుగ్ల‌క్‌తో పోల్చారు.

జ‌గ‌న్‌కు అధికారం త‌లకెక్కింది అంటూ ఒక వీడియోలో శేఖ‌ర్ గుప్తా ఊగిపోయారు. అయితే, ఆయ‌న విడుద‌ల చేసిన వీడియో మొత్తం చూస్తే శేఖ‌ర్‌గుప్తా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అయిన‌ప్ప‌టికి కూడా ఏపీలోని ప‌రిస్థితుల‌ప‌ట్ల, భౌగోళిక స్థితిగ‌తుల‌పై ఆయ‌న‌కు స‌రైన అవ‌గాహ‌న లేదేమో అన్న అభిప్రాయం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

కేవ‌లం ఎవ‌రో ఇచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఆయన త‌న కంటెంట్‌ను రెడీ చేసుకున్నారా..? అన్న భావ‌న ఆ వీడియో చూసిన త‌రువాత స్ప‌ష్టంగా అర్ధమ‌వుతుంది. అయితే, శేఖ‌ర్‌గుప్తా ఇలా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని విమ‌ర్శిస్తూ ఒక వీడియోను విడుద‌ల చేయ‌గానే చంద్ర‌బాబు నాయుడు ఆ వీడియోను శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ప్ర‌త్యేకంగా ప్ర‌ద్శించి చూపారు.

శేఖ‌ర్ గుప్తా కూడా సీఎం జ‌గ‌న్‌ను తుగ్ల‌క్‌తో పోలుస్తున్నారు. జ‌గ‌న్ ఇలాంటి విధానాల‌ను పాటిస్తున్నార‌ని, జాతీయస్థాయి మీడియా కూడా తీవ్రంగా విమ‌ర్శిస్తోంది చూడండి అంటూ చంద్ర‌బాబు త‌న మీడియా స‌మావేశంలో చూపించారు.

అయితే, శేఖ‌ర్‌గుప్తా సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, ఆ విమర్శ‌ల‌ను తిరిగి చంద్ర‌బాబు త‌న మీడియా స‌మావేశంలో ఉటంకించ‌డ‌మ‌న్న‌ది ఇదేం తొలిసారి కాదు.

కొన్ని నెల‌ల క్రితం చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంలో లులూ గ్రూప్‌కు చాలా అత్యంత విలువైన ఖ‌రీదైన భూముల‌ను కేటాయించారు. ఆ భూ కేటాయింపుల వెనుక భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి అన్న విమ‌ర్శ‌లు రావ‌డంతో ఇటీవ‌ల వైసీపీ ప్ర‌భుత్వం లులూ గ్రూప్‌కు చంద్ర‌బాబు కేటాయించిన భూముల‌ను ర‌ద్దు చేసింది.

అలా ఆ భూముల‌ను ర‌ద్దు చేయగానే ఇదే శేఖ‌ర్‌గుప్తా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు చేశారు. లులూ గ్రూప్‌కు కేటాయించిన భూములను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల పెట్టుబ‌డి దారుల్లో భ‌యాందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందంటూ శేఖ‌ర్‌గుప్తా అభిప్రాయ‌ప‌డ్డారంటూ చంద్ర‌బాబు మ‌రోసారి ఆరోజు ప్రెస్‌మీట్‌లో ఉటంకించారు.

ఇలా చేయ‌డం వెనుక చంద్ర‌బాబు ప్లాన్ గురించి వైసీపీ శ్రేణులు వారి అభిప్రాయాలను ఇలా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఇటీవ‌ల ఏపీలో ఉన్న టీడీపీ అనుకూల ప‌త్రిక‌లు కానీ.., టీవీ ఛానెళ్లు కానీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఏం చెప్పినా ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న ఒక అభిప్రాయ‌ముంది.

దీంతో త‌న మాట‌ల‌కు, త‌న వాద‌న‌కు విలువ చేకూర్చ‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు ఇలా జాతీయ మీడియా జ‌ర్న‌లిస్టుల‌ను ముందుపెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న అభిప్రాయాన్ని వైసీపీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle