newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

25-05-202025-05-2020 10:34:32 IST
Updated On 25-05-2020 11:34:13 ISTUpdated On 25-05-20202020-05-25T05:04:32.024Z25-05-2020 2020-05-25T05:04:28.455Z - 2020-05-25T06:04:13.759Z - 25-05-2020

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీని సీజ్‌ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విషవాయువు లీకేజీతో 12 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ సంస్థ ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులను నిర్దేశించింది. అంతేగాక ఎల్జీ పాలిమర్స్‌ ప్రాంగణంలోకి సంస్థ డైరెక్టర్లతో పాటు ఎవరినీ అనుమతించరాదని స్పష్టం చేసింది. కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు స్వాధీనపరిచి, వారు భారత్‌లోనే ఉంటారని చెప్పినప్పటికీ.. కోర్టు అనుమతి లేకుండా వారికి పాస్‌పోర్టులు ఇవ్వరాదని కూడా ఆదేశించింది. అదేవిధంగా ఆ డైరెక్టర్లు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లరాదని విస్పష్టంగా ఉత్తర్వులిచ్చింది. 

ఈ నెల 7న ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాధితులకు పరిహారం పెంచేలా ఆదేశించాలని, బాధితులంతా కోలుకునే వరకూ చికిత్స అందించాలని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని మరో రెండు పిల్స్‌ కూడా దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టైరిన్‌ తరలింపునకు ఎవరు, ఎలా అనుమతించారు, ఈ అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మౌనమెందుకని కూడా హైకోర్టు ప్రశ్నించింది.

ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న కమిటీలు.. అవసరమైతే పరిసరాల్లోకి ప్రవేశించవచ్చని, అయితే ఆ కమిటీల సభ్యులు తిరిగి వెళ్లేటప్పుడు సంస్థ గేటు వద్ద ఉన్న రిజిస్టర్‌లో.. తనిఖీకి సంబంధించిన విషయాన్ని, పరిశీలించిన అంశాన్ని రికార్డు చేయాలని పేర్కొంది. కోర్టు అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ చర, స్థిరాస్తులు.. అమర్చి ఉన్న సామగ్రి, యంత్రాలు మొదలైన వేటినీ తరలించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. లాక్‌డౌన్‌ సమయంలో కంపెనీ కార్యకలాపాల పునఃప్రారంభానికి సంబంధించి ఏవైనా అనుమతులున్నాయా.. లేకుంటే సదరు కంపెనీపై తీసుకున్న చర్యలేంటో రాష్ట్రప్రభుత్వం నివేదించాలని నిర్దేశించింది. 

ఘటనపై దర్యాప్తునకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ), కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కమిటీలను నియమించాయి. అయితే ఈ వ్యవహారంలో అన్ని సందేహాలకు ఏ కమిటీ సమాధానమిస్తుందన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం స్వేచ్ఛనిచ్చింది. ఈ నెల 26వ తేదీ లోపు ఈ వ్యవహారంపై నివేదికను తమ ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ నుంచి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ తగిన పర్యావరణ క్లియరెన్స్‌ లేకుండానే పని చేస్తోందన్న దానిపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. 

‘స్టోరేజీ ట్యాం కును సరిగా తనిఖీ చేయలేదా శీతలీకరణ వ్యవస్థ సరిగా పని చేయలేదా హాని కలిగించే వ్యాసార్థ జోన్‌ 6.3 కి.మీ వరకు విస్తరించిందా ఈ హానికరమైన జో‌న్‌ పరిధిలోనే పలు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక స్థలాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం ఉన్నాయా ఉత్పత్తులు, నిల్వలు, ప్రమాదకర రసాయనాల రూల్స్‌-1989 ప్రకారం.. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, తరలింపు విధానాలపై చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించి, శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఇదేమైనా జరిగిందా ప్ర మాదం సంభవించినప్పుడు కంపెనీలోని సైరన్‌అలారం వ్యవస్థ పని చేయలేదా అన్న అంశాలపై వివరణ ఇవ్వాలి. ఈ ఘటనపై కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు పైన పేర్కొన్న అంశాలపై మౌనం దాల్చాయి’ అని హైకోర్టు పేర్కొంది. 

ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌, కేంద్రప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ గడువు కోరారని, మరికొన్ని అంశాలపైనా వారు వివరణ ఇవ్వాల్సి ఉందని తెలిపింది. ‘కంపెనీల చట్టం ప్రకారం ఎల్జీ పాలిమర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నికర విలువ ఎంత నేరం నమోదు అనంతరం దర్యాప్తు కోసం తనిఖీ బృందాన్ని నియమించకుండా, మెజిస్టీరియల్‌ విచారణ జరుగకుండా, ఎలాంటి కోర్టు అనుమతి లేకుండా ఎల్జీ పాలిమర్స్‌లోని స్టైరిన్‌ను దక్షిణ కొరియాకు తరలించేందుకు ఎందుకు అనుమతిచ్చారు ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు’ అని హైకోర్టు ప్రభుత్ప అడ్వకేట్ జనరల్‌ని నిలదీసింది.

 

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

మండలిపై జగన్ గురి.. . నామినేటెడ్ అభ్యర్ధులు వీరేనా?

   2 hours ago


పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

పరిమళించిన మానవత్వం.. డాక్టర్ సాహసం

   2 hours ago


పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

పాకిస్తాన్ కాదు.. దేశానికి అసలు ముప్పు చైనాతోనే.. శరద్ పవార్

   2 hours ago


ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

ఏపీలో కరోనా వేగం.... రెడ్ జోన్ మండలాలివే

   2 hours ago


రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

రాజ్‌భవన్‌ని తాకిన కరోనా.. 48మందికి పాజిటివ్

   2 hours ago


అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

అక్కడ తగ్గుతుంటే.. తెలంగాణలో ఆందోళనకరం

   3 hours ago


బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

బెంగళూరులో లాక్ డౌన్.. సీఎం కార్యాచరణ

   3 hours ago


విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు.. తెలుగు తమ్ముళ్ళ విసుర్లు

   15 hours ago


టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

టీఎస్ఆర్జేసీ గడువు పెంపు.. ఓపెన్ స్కూల్ పరీక్షలు రద్దు

   a day ago


కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

కరోనా వ్యాప్తి నిరోధంలో ధారావి విజయ పాఠం.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

   12-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle