newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఎమ్మెల్సీ పదవులకు మోపిదేవి, పిల్లి సుభాష్ రాజీనామాలు

01-07-202001-07-2020 09:26:26 IST
Updated On 01-07-2020 10:12:14 ISTUpdated On 01-07-20202020-07-01T03:56:26.947Z01-07-2020 2020-07-01T03:56:18.745Z - 2020-07-01T04:42:14.587Z - 01-07-2020

ఎమ్మెల్సీ పదవులకు మోపిదేవి, పిల్లి సుభాష్ రాజీనామాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ కేబినెట్లో రెండు మంత్రిపదవులు ఖాళీ కానున్నాయి. ఏపీ శాసనమండలి సభ్యులుగా వున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇవాళ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. వీరిద్దరూ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ త్వరలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఎమ్మెల్సీ పదవులకు బుధవారం రాజీనామా చేయనున్నారు. 

ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాతో గవర్నర్ ఆమోదం మేరకు మంత్రుల పోర్ట్ పోలియోలు సీజ్ కానున్నాయి. కాగా, ఈనెల 19వ తేదీన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరితో పాటు పరిమళ్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డిలు రాజ్యసభకు ఎన్నికయిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రమాణం చేయకపోయినా రాజ్యసభ సభ్యులుగా వారి పదవీకాలం మొదలైంది. 

ఈ మేరకు ఇరువురికి రాజ్యసభ చైర్మన్ కార్యాలయం సమాచారం పంపింది. కాగా, పార్లమెంట్ సమావేశం కాగానే రాజ్యసభలో సభ్యులుగా వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వీరు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖను ఎవరికి కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో అటు మండలిలోనూ ఇద్దరు సభ్యులు తగ్గనున్నారు. మండలి రద్దుచేసి కేంద్రానికి పంపినా పార్లమెంటు ఇంకా ఆమోదం తెలపకపోవడంతో మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. 

ఖాళీ అయిన మండలి స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటీవల వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఎన్నికల సంఘం రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. దీంతో నలుగురికి జగన్ కొత్త అవకాశాలు ఇవ్వనున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, మరో ఇద్దరు పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle