newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

ఎమ్మెల్సీ ఎన్నిక....బాబుకు అగ్నిపరీక్ష

19-02-201919-02-2019 13:01:50 IST
Updated On 19-02-2019 18:53:10 ISTUpdated On 19-02-20192019-02-19T07:31:50.883Z19-02-2019 2019-02-19T07:31:48.508Z - 2019-02-19T13:23:10.636Z - 19-02-2019

ఎమ్మెల్సీ ఎన్నిక....బాబుకు అగ్నిపరీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శాసనసభ ఎన్నికలకు ముందే ఏపీలో సందడి ప్రారంభమయింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో హడావిడి ఎక్కువైంది. ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శాసనసభలో సంఖ్యా బలాల్ని బట్టి ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కనున్నాయి.

రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం గడువు కూడా ముగియనున్నా వాటికి ఈసీ ఇంకా ప్రకటన జారీచేయలేదు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల తుది జాబితాల ప్రకటనకు బుధవారం వరకు గడువు ఉంది. టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మరణించడంతో స్థానికసంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలి. 

ఎమ్మెల్యేల కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో కాలపరిమితి ముగియబోతోంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణతో పాటు పి.శమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావులు ఎమ్మెల్సీలుగా పదవీ విరమణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదుగురూ అధికార పార్టీలోనే ఉన్నారు. ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ తరఫున గెలిచిన తర్వాత టీడీపీ చెంతన చేరారు.

లక్ష్మీ శివకుమారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికై తర్వాత టీడీపీలోకి వచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకీ దక్కనుండడంతో నలుగురు ఎవరన్న అంశం ఉత్కంఠను రేపుతోంది. ఎమ్మెల్యేల రేసులో లేనివారికి అవకాశం దక్కనుంది. 

ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడిని మళ్లీ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం గ్యారంటీ.  మిగతా మూడు స్థానాలకు పోటీ విపరీతంగా ఉంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ రామసుబ్బారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇందుకోసం వీరిద్దరూ ఇటీవలే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ రెండు స్థానాలను కూడా పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు చేస్తున్నారు. వివిధ కారణాల వల్ల టీడీపీలో ఎమ్మెల్సీ టికెట్లు హాట్ హాట్‌గా మారుతున్నాయి. 

మూడు స్థానాలు...10 మంది పోటీ

వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు, ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య, టీడీపీ అధికార ప్రతినిధులు లంకా దినకర్‌, పంచుమర్తి అనూరాధ, ఏపీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ దాసరి రాజా తదితరులు ఎమ్మెల్సీ టిక్కెట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే టీడీపీలో చేరిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నెల్లూరు మేయర్‌ అజీజ్‌ రేసులో ఉన్నారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కోటాలో వైసీపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి ఇస్తారని అంటున్నారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్ష కాబోతున్నాయని అంటున్నారు. ఓటర్లు గ్రాడ్యుయేట్లు- టీచర్ల కోటాలో జరిగే ఎన్నికల్లో  ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల కారణంగా ఆయా జిల్లాల్లో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమర్ధులకే స్థానం కల్పిస్తారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో సహజంగానే ఉత్కంఠ ఉంటుందని, చంద్రబాబు అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటారని ‘న్యూస్ స్టింగ్’తో చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   4 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   5 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   9 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   9 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   11 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   12 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   12 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   13 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   13 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle