newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం *అసోం, మేఘాలయ, త్రిపురల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు *ఐదో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఉపాధి హామీ నిధుల విడుదల కోరుతూ..నేడు అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా*నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన..ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు*దిగివస్తున్న ఉల్లి ధరలు...కిలో ఉల్లి 70-80 లోపే అమ్మకాలు *అమరావతి: ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ని సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్*హైదరాబాద్‌: బంజారాహిల్స్ ఎస్‌బీటీ నగర్‌లో రౌడీ షీటర్ హత్య... రౌడీ షీటర్‌ సయీద్ నూర్‌ను హత్య చేసిన నలుగురు వ్యక్తులు, బంజారాహిల్స్ పీఎస్‌లో లొంగుబాటు*తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోఉంటాయి.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మృతదేహాలను భద్రపర్చాలి-సుప్రీంకోర్టు*కూల్చివేతలతో ప్రభుత్వాన్ని ప్రారంభించిన వైసీపీ.. అందరినీ కూల్చివేస్తోంది.. ఎంతోమంది కూలిపోయారు.. మీరెంత...? మీ 151 మంది ఎమ్మెల్యేలెంత?-పవన్*అసెంబ్లీలో మార్షల్ తీరుపై మండిపడ్డ చంద్రబాబు

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

20-11-201920-11-2019 09:22:02 IST
2019-11-20T03:52:02.984Z20-11-2019 2019-11-20T03:51:53.609Z - - 13-12-2019

 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గమైన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి తన కులధ్రువీకరణ రగడపై విచారణకు హాజరు కానున్నారు. శ్రీదేవి ఎస్సీ సామాజికి వర్గానికి చెందిన వారు కాదని,  ఆమె క్రిస్టియన్ అని గతంలో చేసిన ఫిర్యాదుపై గుంటూరు కలెక్టర్ ఆఫీసులో నవంబర్ 26న విచారణ జరగనుంది. 

ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం కలెక్టర్‌ కార్యాలయంలోని జేసీ చాంబర్‌లో నిర్వహించే విచారణకు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీదేవికి జేసీ దినేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు వచ్చేటప్పడు ఎమ్మెల్యే శ్రీదేవి తాను ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు, ఇతరత్రా ఆధారాలన్నీ తీసుకురావాలని సూచించారు.

రిజర్వ్‌డ్ స్థానమైన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గం కాదని కొద్ది రోజులుగా జరుగుతున్న రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు ఆమె ఎన్నికను తప్పు పడుతూ ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. 

లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం అధ్యక్షుడు ఏఎస్‌ సంతోష్‌ చేసిన ఫిర్యాదుకు రాష్ట్రపతి భవన్‌ స్పందించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ ఫిర్యాదును పంపి పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో చీఫ్‌ సెక్రటరీ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం విచారణకు శ్రీకారం చుట్టింది. 

అయితే తాను క్రిస్టియన్ విశ్వాసాలను పాటించడంలో ఏ తప్పూ లేదని ఎమ్మెల్యే శ్రీదేవి సమర్థించుకున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మారదర్శక సూత్రాలు కూడా ఉన్నాయి. కులానికి, మతానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మతవిశ్వాసం ప్రాతిపదికన కులాన్ని గుర్తించకూడదని ఆమె వాదించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle