newssting
BITING NEWS :
*ఢిల్లీలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్... పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం*ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్..రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చీఫ్ జస్టిస్ *జగన్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు-లోకేష్ * బస్సు రోకోకి ఆర్టీసీ జేఏసీ పిలుపు.. అనుమతిలేదన్న పోలీసులు..బస్ డిపోల దగ్గర 144 సెక్షన్ విధింపు* ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న తర్వాత సోనియా గాంధీ నేతృత్వంలో తొలిసారి కీలక భేటీ*టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిపై ప్రివిలేజ్ పిటిషన్ ఇచ్చిన వైసీపీ..స్పీకర్ తమ్మినేనిని పరుష పదజాలంతో దూషించారని ఫిర్యాదు *ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీచేయాలి-వంశీ సవాల్

ఎమ్మెల్యే వంశీ జంప్ ప‌క్కా - కార‌ణం వివ‌క్ష‌ణా..? వేధింపులా..?

27-10-201927-10-2019 08:17:22 IST
2019-10-27T02:47:22.211Z27-10-2019 2019-10-27T02:47:14.888Z - - 16-11-2019

ఎమ్మెల్యే వంశీ జంప్ ప‌క్కా - కార‌ణం వివ‌క్ష‌ణా..?  వేధింపులా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీని వీడ‌నున్నారా..?  సైకిల్ స‌వారీ ఆపేసి ఫ్యాన్ కింద సేద తీర‌నున్నారా..? అంటే రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి అవున‌న్న స‌మాధానం వినిపిస్తుంది. ఏపీలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు అద్దం ప‌డుతున్నాయంటూ వారు చెప్పుకొస్తున్నారు. కాగా, గ‌త కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై వంశీ వంశీ అసంతృప్తితో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీలో చేరేందుకు వంశీ రంగం సిద్ధం చేసుకున్నాడ‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. పార్టీని వీడుతున్న వారితో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీడీపీకి మరో షాక్ త‌గిలిన‌ట్టైంది.

అయితే, కృష్ణా జిల్లాలోనే వ‌ల్ల‌భ‌నేని వంశీకి రాజ‌కీయంగా చాలా బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు ఉంది. ఆయ‌న టీడీపీని వీడి అధికార పార్టీ వైసీపీ కండువా క‌ప్పుకుంటారన్న ప్ర‌చారం జోరందుకున్న నేప‌థ్యంలో  సీఎం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డంతో ఆయ‌న పార్టీ మార్పుపై అంద‌రిలోనూ స్ప‌ష్ట‌మైన క్లారిటీ వ‌చ్చేసింది.

ఈ విష‌యాన్ని వ‌ల్ల‌భ‌నేని వంశీ అధికారికంగా ప్ర‌క‌టించ‌కున్నా ఆయ‌న్ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెంట తీసుకెళ్ల‌డంతో పార్టీ జంప్‌పై ఉన్న సందేహాలు ప‌టాపంచల‌య్యాయి. వంశీ పార్టీ మారేందుకు అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

టీడీపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టి నుంచి త‌న‌పై వివ‌క్ష ఉంద‌ని, చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు, లోకేష్‌లు త‌న‌కు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని గ‌తంలో క‌న్నీటిప‌ర్యంతమ‌య్యారు. దీనికి తోడు జిల్లా నేత దేవినేని ఉమా కూడా చిన్న‌చూపు చూస్తుండ‌టం త‌ట్టుకోలేక పార్టీని వీడుతున్న‌ట్టు వంశీ స‌న్నిహితులు చెబుతున్నారు.

మ‌రోవైపు ఇటీవ‌ల వంశీపై న‌కిలీ ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీ కేసు న‌మోదైంది. వంశీ అరెస్టు అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే అధికార పార్టీలో చేరుతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌ను క‌లిసిన సంద‌ర్భంలోనూ వంశీ దీనిపై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

దీంతోపాటు టీడీపీలో తాను ఎదుర్కొన్న అవ‌మానాలు.., గ‌తంలోనే వైసీపీలో చేరాల్సి ఉన్నా ఆగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించిన‌ట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప‌క్కాగా పార్టీ మారుతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే, పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ వంశీని ఎమ్మెల్యేగా చేర్చుకుంటారా..?  లేక ప‌ద‌వికి రాజీనామా చేయించి కండువా క‌ప్పుతారా..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

 అవి రెండు కాకుండా త‌ట‌స్థంగా ఉంటూ అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే ప్ర‌చార‌మూ పొలిటిక‌ల్ స్ట్రీట్‌లో జోరుగా జ‌రుగుతోంది. చూడాలి మ‌రి వంశీ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో..? అయితే, అధికార పార్టీలో చేరితే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తారా..?  అసలు ఎందుకు వంశీ టీడీపీని వీడాల‌ని అనుకుంటున్నారు..?

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle