newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత

20-02-202020-02-2020 12:58:30 IST
Updated On 20-02-2020 12:59:45 ISTUpdated On 20-02-20202020-02-20T07:28:30.905Z20-02-2020 2020-02-20T07:28:29.030Z - 2020-02-20T07:29:45.153Z - 20-02-2020

ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ.. పెదపరిమిలో ఉద్రిక్తత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే రోజాకు అమరావతి నిరసనల సెగ తగిలింది. పెదపరిమిలో రోజా కాన్వాయ్ ను రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రోజా రాజధానిపై మాట్లాడాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని మహిళలు పునరుద్ఘాటించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు నచ్చచెబుతున్నా పరిస్థితిలో మార్పు లేదు. రోజా కారుని అడ్డుకుని ఆమె బయటకు రావాలని నినాదాలు చేశారు మహిళలు, రైతులు.

ఐనవోలులోని ఎస్సార్ఎం వర్శిటీలో జరిగిన ‘పరిశ్రమ-విద్య’ సదస్సుకు రోజా హాజరయ్యారు. ఆమె ఐనవోలు వచ్చిన సంగతి తెలుసుకున్న మహిళా రైతులు ‘మూడురాజధానులు వద్దు-అమరావతి ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు వైసీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భూములిచ్చిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులు కాదంటూ నినదించారు.పోలీసుల వలయంలో నుంచి  యూనివర్సిటీ లోపలకి వెళ్లి సమ్మిట్ లో పాల్గొన్న రోజా. రోజాను బయటకు రాకుండా అడ్డుకోవాలని  యూనివర్సిటీని అన్ని వైపులా దిగ్బంధించిన రైతులు. యూనివర్సిటీ వద్ద రైతులు గ్రామాల నుంచి భారీగా చేరుకుంటుండంతో  రోజాను హై సెక్యూరిటీ మధ్య బయటకు  తీసుకొచ్చి పంపించారు పోలీసులు.

పోలీసులు, నీరుకొండ రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను నిలువరించి ఎస్సార్ ఎం వర్శిటీ వాహనంలో రోజాను పంపించేశారు. పెదపరిమి వద్ద ఆమె వాహనాన్ని అడ్డుకోవడం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65 రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని రైతులు, మహిళలు మండిపడ్డారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle