newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

ఎమ్మెల్యే ధ‌ర్మానపై పేలుతున్న‌ సెటైర్లు..!

01-11-201901-11-2019 17:16:23 IST
Updated On 01-11-2019 17:17:10 ISTUpdated On 01-11-20192019-11-01T11:46:23.305Z01-11-2019 2019-11-01T11:46:18.375Z - 2019-11-01T11:47:10.866Z - 01-11-2019

ఎమ్మెల్యే ధ‌ర్మానపై పేలుతున్న‌ సెటైర్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు, ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ నాయ‌కుడిగా రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత‌ల్లో ఒక‌రు. అటువంటి ధ‌ర్మాన ప్ర‌స్తుతం అధికార వైసీపీలో మాత్రం మౌనంగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితి. దీంతో ఆయ‌న వైఖ‌రిపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు రాజ‌కీయ‌వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు అవ‌మాన భారంతో తెగ‌ ఫీలైపోతున్నార‌ని, ఎమ్మెల్యేగా గెలిస్తే క‌చ్చితంగా మంత్రి ప‌దవి ఖాయ‌మ‌ని, వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే చాలా మంది ద‌గ్గ‌ర ధ‌ర్మాన‌ ముందే టాం.. టాం వేశారని స‌మాచారం.

అంతేకాకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఏదైనా స‌మ‌స్య గురించి చెప్తే నెక్ట్స్ మ‌న‌మే మంత్రి అయిపోతాం.. క‌నుక ప‌నుల‌న్నింటిని చేసేద్దామ‌ని చెప్పుకొచ్చారు.. కానీ, చివ‌రి నిమిషంలో జ‌గ‌న్ కేబినేట్‌లో ధ‌ర్మానాకు చోటు లేకుండా పోయింది. జ‌గ‌న్ పెద్ద ఝ‌ల‌క్ ఇవ్వ‌డంతో ఆయ‌న‌కు ఏం చేయాలో అర్ధం కావ‌డం లేదు.

మ‌రోప‌క్క త‌న అన్న‌య్య ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు మాత్రం జ‌గ‌న్ మంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌డంతో ప్ర‌సాద్‌రావు ఖంగితినేశారు. నిజానికి అన్న‌య్య‌కు అంత సీన్ ఉండేది కాద‌ని, తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు అన్న సంగ‌తి అస‌లు ఎవ్వ‌రికీ తెలియ‌ద‌ని కూడా బాధ‌ప‌డిపోతున్నారు.

అస‌లు జ‌గ‌న్ ఎందుకిలా చేశార‌ని లోలోన ధ‌ర్మాన‌ కుమిలిపోతున్నార‌ని ఆయ‌న అనుచ‌రులే బ‌హిరంగంగా చెప్పుకొస్తున్నారు. 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న మంత్రి పోస్టు ఇవ్వ‌కుండా జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌డంపై రక ర‌కాలుగా జ‌నాలు చ‌ర్చచేసుకుంటున్నారు. దీని వెనుక పెద్ద కార‌ణ‌మే ఉందని స‌మాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ మీద ధ‌ర్మాన కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అవి అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారాయి. అది మ‌న‌సులో పెట్టేసుకుని జ‌గ‌న్ త‌న‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదోమోన‌ని మ‌ద‌న‌ప‌డిపోతున్నార‌ట ధ‌ర్మాన‌.

ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వైసీపీ గూటికి చేరిన‌ప్పుడు అన్న‌పై త‌మ్ముడు ప్ర‌సాద్‌రావు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి. వీటికి తోడుగా మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ధ‌ర్మాన ప్ర‌సాద్‌రావు ఎంపీ అభ్య‌ర్ధి విజ‌యం కోసం అస‌లు క‌నీసం క‌ష్ట‌ప‌డ‌లేద‌ని పార్టీలో గుస‌గుసలు వినిపించాయి. పార్టీకి అవ‌స‌ర‌మ‌న సమ‌యంలో కాకుండా నాలుగేళ్ల త‌రువాత వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం కూడా జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేద‌ట‌. ఈ కార‌ణాల‌తోనే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ప‌క్క‌న పెట్టేశార‌ని అంటున్నారు.

అయితే, బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా ఇటువంటి మాట‌లు చాలానే అన్నార‌ని, అయినా ఆయ‌న‌కు మినిస్ట‌ర్ ప‌ద‌వి ఇచ్చారని ధ‌ర్మాన‌వ‌ర్గంలోని వారు అంటున్నార‌ట‌. మొన్న‌టి ఎన్నిక‌ల వ‌ర‌కు క‌నీసం ఎమ్మెల్యే ప‌ద‌వి లేకుండా బాధ‌ప‌డిన ధ‌ర్మాన ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని, చాలా డ‌ల్ అయిపోయారు. ఇప్పుడు ఏదో త‌న‌కు న‌చ్చిన‌ప్పుడు నియోక‌వ‌ర్గంలో తిరుగుతూ గ‌డిపేస్తున్నారే త‌ప్ప ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా పెద్ద‌గా మాట్లాడ‌టం లేద‌ని అంటున్నారు.

ఒక‌ప్పుడు ప్ర‌భుత్వంలో కాని ప‌నంటూ ధ‌ర్మాన ప్ర‌సాద్‌కు లేదు.  ప్ర‌స్తుతం త‌న అనుచ‌రుల‌కు కావాల్సిన ప‌నుల‌కు ఎలాంటి సిఫార్సులు చేయ‌కుండా దాదాపుగా మౌనంగా ఉండిపోవ‌డంతో కేడ‌ర్‌కు ఏం చేయాలో అర్ధం కావ‌డం లేద‌ని తెలుస్తుంది.  

రెండుమూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్య‌క్తుల‌కే మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన జ‌గ‌న్ రాబోయే రెండేళ్ల‌లో చేప‌ట్టే కేబినేట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో చోటు క‌ల్పిస్తారేమోన‌ని, అలా వీలు కాకున్నా.. కేబినేట్ హోదాలో ఏదైనా వేరే ప‌ద‌వి అప్ప‌గిస్తారేమోన‌ని కూడా వారు అనుకుంటున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle