newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఎమ్మెల్యేల తీరుపై జగన్ అసహనం.. ఎందుకంటే?

04-10-201904-10-2019 16:09:53 IST
2019-10-04T10:39:53.943Z04-10-2019 2019-10-04T10:39:50.527Z - - 19-02-2020

ఎమ్మెల్యేల తీరుపై జగన్ అసహనం.. ఎందుకంటే?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం  అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. వాటితోపాటు రాబోయే మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతుంది. దీంతో వాటిని జ‌నంలోకి తీసుకెళ్లాలంటే అధికార‌పార్టీ ఎమ్మెల్యేలు కీల‌క పాత్ర పోషించాలి. కానీ, ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంద‌రి ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ఈ ద‌ఫా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిచిన ద‌గ్గ‌ర్నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి వైసీపీలో త‌లెత్తింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. అందులోను కొంద‌రి వ్య‌వ‌హార‌శైలి ఏదో గెలిచాములే అన్న‌ట్టు ఉండ‌టం విశేషం.

151 మంది ఎమ్మెల్యేలు కావ‌డంతో అస‌లు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నార‌నేది కూడా ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఇక ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ కార్య‌క్ర‌మాలు జ‌నంలోకి తీసుకెళ్లాలంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పూర్తి స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌న్న అభిప్రాయాలు విన‌వ‌స్తున్నాయి.

కానీ, కొంత మంది ఎమ్మెల్యేల ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బాగా యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యేల‌ను వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం జ‌గ‌న్ కొంత మంది ఎమ్మెల్యేల‌కు క్లాస్ తీసుకున్న విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

అస‌లు ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాలపై మీకు అవ‌గాహ‌న ఉందా..?  లేదా..?  శాస‌న స‌భ స‌భ్యుల‌ను జ‌గ‌న్ గ‌ట్టిగా అడిగిన‌ట్టు స‌మాచారం. కొంత మంది ఎమ్మెల్యేలు త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం జ‌గ‌న్‌కు బాగా ఇబ్బంది క‌లిగిస్తోంద‌ని స‌మాచారం.

ప్ర‌భుత్వం ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా ఎమ్మెల్యేలు జ‌నంలోకి తీసుకెళ్లకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని జ‌గ‌న్ వైసీపీ ఎమ్మెల్యేల‌కు గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.  ఇప్ప‌టికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం లేద‌న్న అభిప్రాయం ఉంది. ఇక ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారే అన్న రీతిలో ఉన్నారు.

ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే క‌నుక అస‌లు జ‌రుగుతున్న ప‌రిణామాలపై ఎమ్మెల్యేల‌కు అవ‌గాహ‌న లేకుండా పోతుంద‌న్న భ‌యంతోనే జ‌గ‌న్ క్లాస్ తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి సీఎం క్లాస్‌తో ఎమ్మెల్యేలు ఎంత‌మేర ప‌నితీరును మెరుగుప‌రుచుకుంటారోన‌ని వైసీపీలోనే చర్చ జ‌రుగుతుండ‌టం విశేషం.   


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle